దెయ్యానికి దొరసానికి మధ్యలో బైకు

This-Friday-Movies-At-Tollywood-Box-Office-Andhra-Talkies
ప్రతి శుక్రవారం ఖచ్చితంగా రెండు లేదా మూడు సినిమాలు రిలీజ్ చేయాలని టాలీవుడ్ నిర్మాతలు కంకణం కట్టుకున్నట్టు ఉన్నారు. గత నెల రోజుల నుంచి ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. అందులో ఒకటి మాత్రమే పాస్ అవుతూ మిగిలిన వాటి వసూళ్ల మీద ప్రభావం చూపుతుండగా పోటీ విషయంలో నిర్మాతలు మాత్రం వెనక్కు తగ్గుమంటున్నారు. వచ్చే శుక్రవారం జులై 12న ఇదే పరిస్థితి మరోసారి రిపీట్ అయ్యేలా ఉంది.

ఎన్ని వస్తున్నాయనేది పక్కన పెడితే ప్రధానమైన పోటీ మాత్రం మూడింటి మధ్య ఉంది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో పాటు రాజశేఖర్ రెండో అమ్మాయి శివాత్మికలను జంటగా పరిచయం చేస్తూ రూపొందిన దొరసాని కులాల అంతరాల మధ్య బ్యాక్ డ్రాప్ తో ప్రమోషన్ మొదలైనప్పటి నుంచి బాగానే ఆసక్తి రేపుతోంది


ఇక సందీప్ కిషన్ హీరోగా రూపొందిన హారర్ మూవీ నిను వీడని నీడను నేనే ట్రైలర్ వచ్చాక హైప్ పెంచుకుంది. కథ నచ్చి తనే స్వయంగా నిర్మాతగా మారిన సందీప్ కిషన్ సక్సెస్ మీద చాలా నమ్మకంగా ఉంది. ట్రైలర్ చూస్తేనేమో ప్రామిసింగ్ గానే ఉంది. ఇక శ్రీహరి వారసుడు మేఘంష్ హీరోగా రూపొందిన రాజ్ దూత్ కూడా అదే తేదీకి క్లాష్ అవుతోంది. నిజానికి 5నే ప్లాన్ చేసినప్పటికీ ఏవో కారణాల వల్ల వారం వాయిదా వేసుకున్నారు.

ఇప్పుడు దెయ్యం-దొరసాని-బైక్ ల మధ్య పోటీ ఆసక్తి రేపుతోంది. ఒకదానికి మరొకటి ఏ మాత్రం సంబంధం లేని జానర్లు కావడం విశేషం.ఇది చాలదన్నట్టు హృతిక్ రోషన్ సూపర్ 30 కూడా అదే రోజు వస్తోంది. ఏ సెంటర్స్ అందులోనూ మల్టీ ప్లెక్సుల్లో దీని హవా బాగానే ఉంటుంది. మరి ఈ బాక్స్ ఆఫీస్ వార్ ఎలా ఉండబోతోంది వచ్చే వారం తేలిపోతుంది

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...