యంగ్ టైగర్ జోడి దొరికిందా

Is-She-NTR-Love-Interest-In-RRR-Andhra-Talkies
టాలీవుడ్ క్రేజీ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలై ఆరు నెలలు దాటినా ఇప్పటిదాకా జూనియర్ ఎన్టీఆర్ కి జోడి  సెట్ కాకపోవడం అభిమానులను టెన్షన్ లో పెడుతూ వచ్చింది.ప్రకటించినప్పుడు ఉన్న డైసీ ఎడ్గార్ జోన్స్ తర్వాత హ్యాండ్ ఇవ్వడంతో కథ మళ్ళి మొదటికి వచ్చింది. కథ ప్రకారం జూనియర్ పోషిస్తున్న పాత్ర బ్రిటిష్ అమ్మాయిని ప్రేమించేలా ఉండటంతో దాన్ని మార్చే అవకాశం లేక తగిన బ్యూటీ కోసం రాజమౌళి వేట సాగిస్తూ వచ్చాడు.

ఫైనల్ గా హాలీవుడ్ నటి ఏమ్మా రాబర్ట్స్ దగ్గర బాల్ ఆగిందని కొద్దిరోజుల క్రితమే లీక్స్ వచ్చాయి. కాని అధికారిక ప్రకటన రాకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది. కాని అంతర్గత సమాచారం మేరకు పైకి ఇంకా చెప్పకపోయినా ఏమ్మా రాబర్ట్స్ ఫిక్స్ అయినట్టు తెలిసింది. త్వరలోనే సెట్ లో జాయిన్ అవుతుందని ఆలోగా చిన్న ప్రెస్ మీట్ లాంటిది పెట్టి కొన్ని అప్ డేట్స్ తో పాటు ఏమ్మా రాబర్ట్స్ కు సంబంధించిన ప్రకటన ఇవ్వొచ్చని తెలిసింది.వచ్చే ఏడాది జూలై 30 రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ మీద అంచనాలు ఇప్పటికే పీక్స్ కు చేరుకున్నాయి. జక్కన్న ఇంకా తన స్టైల్ మార్కెటింగ్ మొదలుపెట్టనేలేదు. అది జరిగితే అంచనాలకు హద్దులు ఉండవు. మూడు వందల యాభై కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ మల్టీ లాంగ్వేజ్ లో రూపొందుతోంది. చరణ్ సరసన ఇంతకు ముందే అలియా భట్ ఫిక్స్ కాగా ఇప్పుడు తారక్ జోడి సమస్య కూడా దాదాపు తీరిపోయింది కాబట్టి ఇకపై మెట్రో స్పీడ్ లో షూటింగ్ ఊపందుకోవడం ఖాయం.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...