రాములమ్మ రెమ్యునరేషన్ ఎంత ?

Popular-Heroin-Vijayashanthi-Remuneration-For-Sarileru-Neekevvaru-Movie-Andhra-Talkies
హీరోయిన్ గా సెలవు తీసుకుని రాజకీయాల్లోకి ప్రవేశించాక 13 ఏళ్ళు గ్యాప్ తీసుకున్న విజయశాంతి నిన్న సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో అడుగు పెట్టి మళ్ళీ తన అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. కనిపించీ కనిపించకుండా దర్శకుడు అనిల్ రావిపూడి తన లుక్ ని షేర్ చేయడం ఇప్పటికే వైరల్ అయ్యింది. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలతో సమానంగా ఇంకా చెప్పాలంటే ఒకరిద్దరికంటే ఎక్కువ పారితోషికం తీసుకుని రికార్డు సృష్టించిన విజయశాంతి ఇప్పుడు సరిలేరు నీకెవ్వరుకు ఎంత తీసుకుంటున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది.

సినిమా సర్కిల్స్ లో పిఆర్ ఓ గ్రూప్స్ మధ్య జరుగుతున్న చర్చల ప్రకారం ఇందులో పాత్రకు విజయశాంతి సుమారుగా రెండు నుంచి నాలుగు కోట్ల రూపాయలు మధ్య తీసుకుంటున్నారట. ఇది షాకింగ్ ఫిగరే. మాంచి డిమాండ్ ఉన్న గ్లామర్ హీరోయిన్లకె మహా అయితే రెండు లేదా రెండున్నర ముట్టజెబుతున్న తరుణంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు ఇంత ఆఫర్ చేయడం షాకే  కాని ఇవన్ని గాసిప్స్ రూపంలో చక్కర్లు కొడుతున్నవే.


ఇది అధికారికంగా నిర్ధారణ చేసే విషయం కాదు కాబట్టి వాస్తవంగా పరిగణించలేం కానీ చర్చలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఎంత కీలకమైన పాత్ర అయితే తప్ప నిర్మాత అయినా ఇంత రిస్క్ తీసుకోడు. అందులోనూ ప్రత్యేకత లేనిదే విజయశాంతి సైతం ఎస్ చెప్పరు. కాబట్టి సరిలేరు నీకెవ్వరులో తన పాత్ర చాలా స్పెషల్ అన్న విషయం మాత్రం క్లారిటీ వచ్చింది.

అప్పుడెప్పుడో 30 ఏళ్ళ క్రితం మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు కొడుకు దిద్దిన కాపురంలో కృష్ణకు భార్యగా ప్రిన్స్ కు అమ్మగా నటించిన విజయశాంతి ఇన్నేళ్ల తర్వాత అదే మహీ కోసం మేకప్ వేసుకోవడం ప్రత్యేకమే. పాత్ర తాలూకు తీరుతెన్నుల గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఈ లోగానే ఈ రెమ్యునరేషన్ తాలూకు వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...