ప్రభాస్ కు మళ్లీ జక్కన్న సెంటిమెంట్ దెబ్బ పడింది

Saho-hero-Prabhas-Continuous-Rajamouli-Sentiment-Andhra-Talkies
ప్రభాస్ 'సాహో' చిత్రం భారీ అంచనాల నడుమ నేడు విడుదలైన విషయం తెల్సిందే. విడుదలైన ప్రతి చోట కూడా నెగటివ్ టాక్ నే మూట కట్టుకుంది. 350 కోట్ల బడ్జెట్ అంటూ భారీగా ప్రచారం చేయడంతో సినిమాపై అంచనాలు పీక్స్ కు చేరాయి. మరో బాహుబలి ఖాయమని అంతా భావించారు. కాని టాక్ బ్యాడ్ గా వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఏ హీరో అయినా కెరీర్ బిగ్గెస్ట్ సక్సెస్ దక్కించుకోవడం ఆ తర్వాత అట్టర్ ఫ్లాప్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.

ఎన్టీఆర్.. నితిన్.. రవితేజ.. ప్రభాస్.. రామ్ చరణ్... సునీల్ ఇలా ప్రతి ఒక్కరు కూడా రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసిన తర్వాత ఫ్లాప్ లు చవిచూసిన వారే. ప్రభాస్ కు ఛత్రపతి చిత్రం తర్వాత చాలా కాలం వరకు సరైన సక్సెస్ రాలేదు. మళ్లీ ఇప్పుడు 'బాహుబలి' రెండు పార్ట్ లు చేసిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసిన 'సాహో' చిత్రం కూడా నిరాశ పర్చింది. రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలనుకున్న ప్రభాస్ కు సాధ్య పడలేదు.ప్రభాస్ సంకల్పం కంటే కూడా జక్కన్న సెంటిమెంట్ బలంగా ఉన్నట్లుగా ఉంది. అందుకే ప్రభాస్ ఏకంగా బాహుబలి స్థాయి సినిమా అంటూ చేసినా కూడా నిరాశే మిగిలింది. సాహో నెగటివ్ టాక్ తో ప్రభాస్ స్టార్ డంకు వచ్చిన ఢోకా అయితే ఏమీ లేదు. కాని ఆయనపై అంచనాలు పెట్టుకున్న అభిమానులు నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. సాహో ఫలితం నేపథ్యంలో వారి తర్వాత సినిమాల పరిస్థితి ఏంటా అంటూ వారి వారి అభిమానుల్లో ఆందోళన మొదలయ్యే ఉంటుంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...