కింగ్ ఖాన్ డాటర్ టైమొచ్చినట్టేనా?

Suhana-Khan-all-set-to-make-her-acting-debut-Andhra-Talkies
బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ వెల్లువపై నిరంతరం వాడి వేడిగా చర్చ సాగుతోంది. 2019లో ఇప్పటికే ఓ అరడజను స్టార్ కిడ్స్ తెరకు పరిచయం అయ్యారు. మరో నలుగురైదుగురు రెడీ అవుతున్నారన్న సమాచారం ఉంది. ఇందులో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ వారసులు ఇద్దరూ జాబితాలో ఉన్నారు.  సుహానాఖాన్- ఆర్యన్ ఖాన్ వెండితెరకు పరిచయం అయ్యే సమయం ఆసన్నమైందన్న ప్రచారం సాగుతోంది.

ముందుగా సుహానా ఖాన్ ఎంట్రీ ఉంటుంది. ఇప్పటికే సుహానా లండన్ లోని ఆర్డింగ్లి కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేసింది. అక్కడే సోదరుడు ఆర్యన్ తో కలిసి నటనలో సర్టిఫికెట్ కోర్స్ పూర్తి చేసిందని తెలుస్తోంది. ఇక ఎలానూ చదువు పూర్తయింది కాబట్టి ఇక బరిలో దిగడమే ఆలస్యం. కథానాయికగా ఆరంగేట్రానికి డాడ్ షారూక్ నుంచి ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. మామ్ గౌరీ ఖాన్ ఎంతో ఎగ్జయిటింగ్ గా ఆ క్షణం కోసం వేచి చూస్తోంది. ఇలాంటి వేళ ముందుగా ప్రీప్రాక్టికల్స్ లో భాగంగా సుహానా ఏం చేసిందో తెలుసా?


2018లోనే ఈ బ్యూటీ ప్రయోగాలు స్టార్ట్ చేసింది. అప్పట్లోనే కొందరు విదేశీ స్నేహితులతో కలిసి ఓ షార్ట్ ఫిలింలో నటించింది. క్లాస్ మేట్ థియో గిమెనో స్వయంగా ఆ పోస్టర్ ని సోషల్ మీడియాలో రివీల్ చేశారు. షార్ట్ ఫిలిం టైటిల్ `ది గ్రే పార్ట్ ఆఫ్ బ్లూ`. ఈ పోస్టర్ లో సుహానా షాడో గెటప్ థ్రిల్లిస్తోంది. గిమెనో ఇదివరకూ ఈ తరహాలోనే సుహానాతో లఘు చిత్రానికి సంబంధించిన ఫోటోల్ని ఇన్ స్టాలో షేర్ చేశారు. ఇక ఇప్పటికే స్కూల్ ఈవెంట్ లో సుహానా నటనకు షబానా ఆజ్మీ లాంటి స్టార్ కితాబిచ్చారు. స్కూల్ మ్యానేజ్ మెంట్ సైతం సుహానా ప్రతిభకు కితాబిస్తూ ప్రఖ్యాత రసెల్ కప్ ని బహూకరించింది. ఇక ఇప్పటికే సుహానా వోగ్ కవర్ షూట్ ప్రకంపనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. వారసురాలు నెట్టుకొచ్చేస్తుంది అన్న నమ్మకం కలిగితే చాలు తనని తెరకు పరిచయం చేస్తానని డాడ్ షారూక్ చెప్పారు. మరి ఆ క్షణం ఇక వచ్చేసినట్టేనా? అంటే జస్ట్ వెయిట్....!

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...