వెయిట్ లాస్ కు సంబంధించిన ఈ యాడ్ లో ప్రచారకర్తలుగా వ్యవహరించిన రాశి.. రంభలకు షాకిచ్చిన కోర్టు

Consumer-Court-Notices-To-Tollywood-Actress-Rashi-and-Ramba-For-Ads-Andhra-Talkies
టాలీవుడ్ లో ఒకప్పుడు తమ అందచందాలతో.. నటనతో ఆకట్టుకోవటమే కాదు.. ప్రేక్షకుల గుండెల్లో గుబులు రేపిన హాట్ భామలు రాశి.. రంభలకు తాజాగా కోర్టు షాకిచ్చింది. దీనికి కారణం.. వారిద్దరూ ఒక సంస్థకు చేసిన వాణిజ్య ప్రకటనగా చెప్పాలి. కలర్స్ అనే సంస్థలు ఈ నటీమణులు ఇద్దరూ నటించారు.

వెయిట్ లాస్ కు సంబంధించిన ఈ యాడ్ లో ప్రచారకర్తలుగా వ్యవహరించిన రాశి.. రంభలు చెప్పిన మాటలకు.. ఆ కంపెనీ సేవల్లో అంతరంపై తాను మోసపోయినట్లుగా ఒక వినియోగదారుడు విజయవాడ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు.

ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. కలర్స్ సంస్థ ప్రకటనను వెంటనే నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. వాణిజ్య ప్రకటనతో మోసం చేయొద్దని హెచ్చరించటంతో పాటు జరిమానాను విధించారు. కలర్స్ సంస్థకు చెందిన ప్రకటనను ఎవరూ ప్రసారం చేయొద్దని.. వాటిని వెంటనే నిలిపివేయాలని కోర్టు పేర్కొంది.

మెగాస్టార్ చిరంజీవి సినిమా సైరా: ఇతర భాషల్లో ఆదరిస్తారా?

Tollywood-Sye-Raa-Movie-in-Other-Languages-Andhra-Talkies
మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో.. రామ్ చరణ్ నిర్మాణంతో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం.  బడ్జెట్ కరెక్ట్ గా ఎంత.. ఎన్ని వందల కోట్లు అనే విషయం పక్కన పెడితే.. తెలుగులో మాత్రమే ఈ సినిమా సూపర్ హిట్ అయితే పెట్టుబడి మొత్తం రికవర్ కాదు అనేది అందరూ ఒప్పుకునే వాస్తవం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇతర భాషల్లో 'సైరా' పరిస్థితి ఏంటి?

తెలుగు ప్రేక్షకుల్లో మెగాస్టార్ కు తిరుగులేదు. ఇప్పటికీ చిరు చాలా పెద్ద స్టార్.  ఇక మెగా ఫ్యాన్స్ అండ ఎలాగూ ఉంటుంది.  సాధారణ ప్రేక్షకుల్లో కూడా చిరుపై ఎప్పుడూ అభిమానం ఉంటుంది.  ఆ విషయం చిరు రీ ఎంట్రీ సినిమాతోనే ప్రూవ్ అయింది. ఇక ఈ సినిమాలో చిరుతో పాటుగా అదనంగా ఎన్నో ఆకర్షణీయమైన అంశాలు ఉన్నాయి కాబట్టి ఓపెనింగ్స్ కు దిగులు ఉండదు.  ఇక సినిమాకు హిట్ టాక్ వస్తే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది.  అయితే మిగతా భాషల్లో మాత్రం ఇలాంటి పరిస్థితిని ఎంతమాత్రం ఆశించలేం.

గారాల చెల్లిని ఫిలిం స్కూల్ కి పంపిన అక్క జాన్వీ కపూర్

Sridevi-Janhvi-Kapoor-sets-sibling-goals-with-an-endearing-goodbye-post-for-Khushi-Kapoor-Andhra-Talkies.jpg
అక్క చెల్లెళ్ల అనుబంధం గురించి చెప్పాలంటే.. బాలీవుడ్ లో జాన్వీ - ఖుషీ కపూర్ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళుతుంటారు. ఫ్యామిలీ ఫంక్షన్లకే కాదు.. డిన్నర్ పార్టీలు.. నైట్ పార్టీలకు కలిసి వెళ్లడం అలవాటు. చాలాసార్లు నగరంలో కలిసి షికార్లు చేస్తూ కెమెరాల కంటికి చిక్కారు. అలాగే ఇన్ స్టాగ్రమ్ లోనూ రెగ్యులర్ గా తమ బాండింగ్ కి సంబంధించిన ఫోటోల్ని షేర్ చేస్తూ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇస్తుంటారు.

అయితే ఆ సిస్టర్స్ మధ్య ఊహించని ఎడబాటు తప్పడం లేదు. ఇన్నాళ్లు జాన్వీ కపూర్ కెరీర్ గురించే ముచ్చటించుకున్న అభిమానులు ఇకపై ఖుషీ కపూర్ సినీ ఎంట్రీ గురించి ముచ్చటించుకునే టైమ్ వచ్చేసింది. అందుకే ఖుషీ నట శిక్షణ కోసం న్యూయార్క్ బయల్దేరింది. అయితే తనకు గుడ్ బాయ్ చెప్పడానికి జాన్వీ విమానాశ్రయానికి వెళ్లలేకపోయింది. అందువల్ల గారాల చెల్లి ఖుషీతో తాను కలిసి ఉన్నప్పటి ఓ ఫోటోని షేర్ చేసిన స్వీట్ మెసేజ్ ని పెట్టింది. ఆ ఫోటోలో అక్క చెల్లెళ్ల మధ్య  లవ్ లీ బాండింగ్ ఆకట్టుకుంటోంది. జాన్వీ తన చిట్టి చెల్లెలు నుదిటిపై ముద్దాడుతోంది. ఆ ఫోటోకి క్యాప్షన్ అదిరిపోయింది.

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...