వెయిట్ లాస్ కు సంబంధించిన ఈ యాడ్ లో ప్రచారకర్తలుగా వ్యవహరించిన రాశి.. రంభలకు షాకిచ్చిన కోర్టు

Consumer-Court-Notices-To-Tollywood-Actress-Rashi-and-Ramba-For-Ads-Andhra-Talkies
టాలీవుడ్ లో ఒకప్పుడు తమ అందచందాలతో.. నటనతో ఆకట్టుకోవటమే కాదు.. ప్రేక్షకుల గుండెల్లో గుబులు రేపిన హాట్ భామలు రాశి.. రంభలకు తాజాగా కోర్టు షాకిచ్చింది. దీనికి కారణం.. వారిద్దరూ ఒక సంస్థకు చేసిన వాణిజ్య ప్రకటనగా చెప్పాలి. కలర్స్ అనే సంస్థలు ఈ నటీమణులు ఇద్దరూ నటించారు.

వెయిట్ లాస్ కు సంబంధించిన ఈ యాడ్ లో ప్రచారకర్తలుగా వ్యవహరించిన రాశి.. రంభలు చెప్పిన మాటలకు.. ఆ కంపెనీ సేవల్లో అంతరంపై తాను మోసపోయినట్లుగా ఒక వినియోగదారుడు విజయవాడ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు.

ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. కలర్స్ సంస్థ ప్రకటనను వెంటనే నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. వాణిజ్య ప్రకటనతో మోసం చేయొద్దని హెచ్చరించటంతో పాటు జరిమానాను విధించారు. కలర్స్ సంస్థకు చెందిన ప్రకటనను ఎవరూ ప్రసారం చేయొద్దని.. వాటిని వెంటనే నిలిపివేయాలని కోర్టు పేర్కొంది.వినియోగదారుడు చెల్లించి మొత్తాన్ని (రూ.74652) తిరిగి చెల్లించాలని.. ఆ మొత్తానికి తొమ్మిది శాతం వడ్డీని చెల్లించాలని పేర్కొంది. అంతేకాదు.. వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.2లక్షలు జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది. అదే సమయంలో సినీ నటిమణులు రాశి.. రంభలకు మొట్టికాయలు వేసింది.

ఈ తరహా ప్రకటనలు చేయొద్దని పేర్కొంది. ఇలాంటి ప్రకటనల్లో నటించటం ద్వారా తప్పుడు ప్రకటనల్ని ప్రోత్సహించినట్లు అవుతుందని.. ఇక మీద ఇలాంటి యాడ్స్ నటించే విషయంలో జాగ్రత్తగా ఉండని పక్షంలో కొత్త చట్టం ప్రకారం సెలబ్రిటీలకు కూడా ఫైన్ వేస్తామని హెచ్చరించింది. రంభ.. రాశిలకు ఎదురైన ఈ ఇబ్బందికర పరిస్థితిని.. మిగిలిన నటీనటులు కూడా గుర్తించి జాగ్రత్తపడితే మంచిందంటున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...