గారాల చెల్లిని ఫిలిం స్కూల్ కి పంపిన అక్క జాన్వీ కపూర్

Sridevi-Janhvi-Kapoor-sets-sibling-goals-with-an-endearing-goodbye-post-for-Khushi-Kapoor-Andhra-Talkies.jpg
అక్క చెల్లెళ్ల అనుబంధం గురించి చెప్పాలంటే.. బాలీవుడ్ లో జాన్వీ - ఖుషీ కపూర్ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళుతుంటారు. ఫ్యామిలీ ఫంక్షన్లకే కాదు.. డిన్నర్ పార్టీలు.. నైట్ పార్టీలకు కలిసి వెళ్లడం అలవాటు. చాలాసార్లు నగరంలో కలిసి షికార్లు చేస్తూ కెమెరాల కంటికి చిక్కారు. అలాగే ఇన్ స్టాగ్రమ్ లోనూ రెగ్యులర్ గా తమ బాండింగ్ కి సంబంధించిన ఫోటోల్ని షేర్ చేస్తూ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇస్తుంటారు.

అయితే ఆ సిస్టర్స్ మధ్య ఊహించని ఎడబాటు తప్పడం లేదు. ఇన్నాళ్లు జాన్వీ కపూర్ కెరీర్ గురించే ముచ్చటించుకున్న అభిమానులు ఇకపై ఖుషీ కపూర్ సినీ ఎంట్రీ గురించి ముచ్చటించుకునే టైమ్ వచ్చేసింది. అందుకే ఖుషీ నట శిక్షణ కోసం న్యూయార్క్ బయల్దేరింది. అయితే తనకు గుడ్ బాయ్ చెప్పడానికి జాన్వీ విమానాశ్రయానికి వెళ్లలేకపోయింది. అందువల్ల గారాల చెల్లి ఖుషీతో తాను కలిసి ఉన్నప్పటి ఓ ఫోటోని షేర్ చేసిన స్వీట్ మెసేజ్ ని పెట్టింది. ఆ ఫోటోలో అక్క చెల్లెళ్ల మధ్య  లవ్ లీ బాండింగ్ ఆకట్టుకుంటోంది. జాన్వీ తన చిట్టి చెల్లెలు నుదిటిపై ముద్దాడుతోంది. ఆ ఫోటోకి క్యాప్షన్ అదిరిపోయింది.``మన ప్రేమ ఎప్పటికీ ఫేక్ కాదు. న్యూయార్క్ సిటీకి ప్రార్థనలు`` అంటూ సింపుల్ కొటేషన్ ఇచ్చింది. తాజా  సమాచారాన్ని బట్టి .. ఖుషీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది. త్వరలోనే తన డెబ్యూ సినిమా గురించి వార్త వెలువడనుంది. అయితే అంతకంటే ముందే నటనలో పెర్ఫెక్ట్ గా శిక్షణ పొంది న్యూయార్క్ నుంచి తిరిగి వస్తుందన్నమాట. న్యూయార్క్ పయనమవుతూ ముంబై ఎయిర్ పోర్ట్ లో సెండాఫ్ తీస్కుంది. బోనీకపూర్ దగ్గరుండి మరీ తనని దిగబెట్టారు. ఖుషీ బంధు మిత్రులు విమానాశ్రయానికి విచ్చేశారు. ఇందులో కజిన్స్ మహీప్- సనయ- సంజయ్ కపూర్ తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...