మెగాస్టార్ చిరంజీవి సినిమా సైరా: ఇతర భాషల్లో ఆదరిస్తారా?

Tollywood-Sye-Raa-Movie-in-Other-Languages-Andhra-Talkies
మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో.. రామ్ చరణ్ నిర్మాణంతో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం.  బడ్జెట్ కరెక్ట్ గా ఎంత.. ఎన్ని వందల కోట్లు అనే విషయం పక్కన పెడితే.. తెలుగులో మాత్రమే ఈ సినిమా సూపర్ హిట్ అయితే పెట్టుబడి మొత్తం రికవర్ కాదు అనేది అందరూ ఒప్పుకునే వాస్తవం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇతర భాషల్లో 'సైరా' పరిస్థితి ఏంటి?

తెలుగు ప్రేక్షకుల్లో మెగాస్టార్ కు తిరుగులేదు. ఇప్పటికీ చిరు చాలా పెద్ద స్టార్.  ఇక మెగా ఫ్యాన్స్ అండ ఎలాగూ ఉంటుంది.  సాధారణ ప్రేక్షకుల్లో కూడా చిరుపై ఎప్పుడూ అభిమానం ఉంటుంది.  ఆ విషయం చిరు రీ ఎంట్రీ సినిమాతోనే ప్రూవ్ అయింది. ఇక ఈ సినిమాలో చిరుతో పాటుగా అదనంగా ఎన్నో ఆకర్షణీయమైన అంశాలు ఉన్నాయి కాబట్టి ఓపెనింగ్స్ కు దిగులు ఉండదు.  ఇక సినిమాకు హిట్ టాక్ వస్తే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది.  అయితే మిగతా భాషల్లో మాత్రం ఇలాంటి పరిస్థితిని ఎంతమాత్రం ఆశించలేం.ఎందుకంటే చిరు ఇప్పుడు అరవైల్లో ఉన్నారు.  మనకు ఆయన పెద్ద స్టార్... మెగాస్టార్.  ఫ్యాన్స్ అయితే ఇప్పటికీ ఆయనే నంబర్ వన్ అని వాదిస్తూ ఉంటారు. చిరు ఇంపాక్ట్ మహా అయితే కర్ణాటక వరకూ ఉంటుంది. అదొక్కటీ మినహాయిస్తే తెలుగు రాష్ట్రాలకు బయట ఉన్న ప్రేక్షకులకు చిరు క్రేజీ స్టార్ మాత్రం కాదు.  చిరు దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు కానీ ఆయన సినిమాను ఎగబడి చూసే క్రేజ్ మాత్రం ఉండదు. పైగా ఇతర భాషల ప్రేక్షకుల దృష్టిలో ఆయన ఒక ఎజ్డ్ స్టార్. ఇతర భాషల్లోని ఈ జెనరేషన్ యూత్ కు అయన ఎంత మాత్రం కనెక్ట్ అవుతారు అనేది సందేహాస్పదం.

'సైరా' చిత్రానికి 'సాహో' తరహాలో ప్రమోషన్స్ చేస్తున్నారు కానీ ఆ సినిమాకు ఈ సినిమాకు చాలా తేడా ఉంది.  'బాహుబలి' ఫ్రాంచైజీతో ప్రభాస్ క్రేజ్ దేశవ్యాప్తంగా ఆకాశాన్ని తాకింది. హిందీ ప్రేక్షకుల్లో ఆ క్రేజ్  పీక్స్ లో ఉంది.  హిందీ వెర్షన్  సాహో కు ఆ క్రేజ్ పని చేసింది కూడా. కానీ అదే క్రేజ్ తమిళ.. మలయాళ భాషల్లో ఏమాత్రం పని చేయలేదు.  ఇప్పుడు సైరా విషయం తీసుకుంటే చిరుకు దేశవ్యాప్తంగా క్రేజ్ లేదు.. పైగా వయసు ఆయనకు పెద్ద మైనస్.  మరి ఈ ఇబ్బందులను చిరు అధిగమించి 'సైరా' తో ప్యాన్ ఇండియా స్టార్ గా మారతారా అనే ప్రశ్నకు అక్టోబర్ మొదటివారంలోనే సమాధానం దొరుకుతుంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...