చరణ్ ను చంపేసి ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటుందట!

Sexy-Heroin-Kajal-Agarwal-Wants-to-Marry-Prabhas-Andhra-Talkies
ఈమద్య కాలంలో మంచు లక్ష్మీ టాక్ షో గురించి మీడియాలో ప్రముఖంగా వింటూ ఉన్నాం. ఆమె సెలబ్రెటీల నుండి బోల్డ్ సమాధానాలను రాబడుతూ వారి సీక్రెట్ లను కెమెరా ముందు ఆవిష్కరిస్తుంది. ఇప్పటికే పలువురు స్టార్స్ ను తన షో లో ఇంటర్వ్యూ చేసిన ఈ అమ్మడు ఇటీవల సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ ను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలను కాజల్ నుండి మంచు లక్ష్మి రాబట్టడంలో సక్సెస్ అయ్యింది.

నా కెరీర్ లో ఇష్టమైన హీరో రానా. ఆయనతో వర్క్ చేయడానికి చాలా ఇష్టపడతాను. రానాతో పని చేయడం చాలా ఫన్నీగా ఉంటుంది అలాగే చాలా కష్టంగా కూడా ఉంటుంది. అయితే రానా నన్ను చాలా బాగా చూసుకుంటాడు. అందుకే ఆయన ఇష్టమైన హీరో అంది. నేను ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా నాతో పాటు ఒక చిన్న దేవుడి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం నాతో ఉంటే ఇంట్లో ఉన్నట్లుగానే అనిపిస్తుంది.

దాసరి స్థానం కోసం చిరు ప్రయత్నాలా? ఏకి పారేసిన సినీ పెద్దమనిషి

Director-Tammareddy-Bharadwaj-Comments-on-Chiru-and-Jagan-Meeting-Andhra-Talkies.jpg
సినిమా రంగానికి చెందిన వ్యక్తి.. తన మనసుకు ఏమనిపిస్తే దాని గురించి చెప్పేయటం చాలా అరుదు. కనిపించని హద్దులెన్నో సినిమా రంగంలో ఉంటాయి. అలాంటివేళ నిష్ఠూరంగా ఉండే నిజాన్ని ధైర్యంగా చెప్పేయటం.. తర్వాత ఎదురయ్యే ఇబ్బందులకు సై అనటం చాలామంది చేయలేరు. ఈ కారణంతోనే మనకెందుకు వచ్చిందన్నట్లుగా రియల్ లైఫ్ లోనూ రీల్ మాటలు చెప్పి తప్పించుకుంటూ ఉంటారు.

ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ.. యూట్యూబ్ హడావుడి ప్రారంభంలోనే నా ఆలోచన పేరుతో అన్ని అంశాల మీద తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పే సినీ పెద్దమనిషి తమ్మారెడ్డి భరద్వాజ. తాజాగా ఆయనో ఆసక్తికర టాపిక్ మీద మాట్లాడారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్దకు.. ఉప రాష్ట్రపతి వెంకయ్య వద్దకెళ్లి తాను నటించిన సైరా గురించి చెప్పటం తెలిసిందే. ఈ సందర్భంగా పలు రూమర్లు వినిపించాయి.

బిగ్ బీని వెంటాడుతోన్న క్రియేటివ్ డైరెక్టర్!

Tollywood-Creative-director-chasing-Big-Bee-Amithab-Andhra-Talkies
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సక్సెస్ చవి చూసి కొన్ని సంవత్సరాలైంది.  ఎంతో ఎఫర్ట్ పెట్టి చేసిన 'గోవిందుడు అందరివాడేలే'- 'నక్షత్రం' ఫలితాలు తీవ్ర నిరుత్సాహాన్నే మిగిల్చాయి. రెండేళ్ల నుంచి ఖాళీగానే ఉన్నాడు. రాసిన  స్క్రిప్టులేవీ వర్కవుట్ కాలేదు. దానికి తోడు బాలయ్య 'రైతు' సినిమా చేస్తానని మాటిచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో పట్టాలెక్కే అవకాశం లేదు. అందుకే ఇక లాభం లేదనుకున్న కృష్ణవంశీ తన క్రియేటివిటీని పక్కన బెట్టి రీమేక్ వైపు దృష్టి సారించిన సంగతి తెలిసిందే. మరాఠీ క్లాసిక్ హిట్టు 'నట సామ్రాట్' పై ఆయన కన్ను పడింది.

'రంగమార్తాండ' టైటిల్ తో ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు రీమేక్ రూపంలో  తీసుకొస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్- రమ్యకృష్ణ జంటగా నటిస్తున్నారు. టైటిల్ లోగోను కూడా ఇటీవలే రిలీజ్ చేసి హైప్ క్రియేట్ చేసారు. ఇలాంటి జోనర్ ను రీమేక్ రూపంలో ఇప్పటివరకూ  ఏ టాలీవుడ్ డైరెక్టర్  టచ్  చేయలేదు. దీంతో కాస్త సాహసమే అయినప్పటికీ క్రియేటివ్ డైరెక్టర్ బుర్రకు పదునుపెట్టి రీమేక్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నేషనల్  లెవల్లో గుర్తింపు తీసుకొచ్చే ప్రక్రియ కూడా ప్రారంభించినట్లు సమాచారం. దీనిలో భాగంగా బాలీవుడ్  మెగాస్టార్ అమితాబ్ ని రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇందులోనూ  బిగ్ బీకి  గురువు పాత్రకే ఆఫర్ చేసినట్లు ప్రచారం సాగుతోంది.

ఇదీ సంగతి! భిన్న ధృవాలు.. కలుసుకోవు!!

Hero-Naga-Chaitanya-Movie-with-Director-Dil-Raju-Andhra-Talkies
అక్కినేని నాగచైతన్య - దిల్ రాజు కాంబినేషన్ అనగానే జోష్ సినిమా గుర్తుకు వస్తుంది. చైతన్యను వెండితెరకు పరిచయం చేసిన నిర్మాతగా దిల్ రాజు పేరు అభిమానులకు స్ఫురణకు వస్తుంది. అయితే చైతూ కెరీర్ ప్రారంభమై ఏడెనిమిదేళ్లు పూర్తవుతున్నా ఇంకా తిరిగి ఆ జోడీ రిపీట్ కాకపోవడం ఆశ్చర్యం కలిగించకుండా ఉండదు. పరిశ్రమ అగ్ర నిర్మాతతో చైతూ తిరిగి పని చేయకపోవడానికి కారణమేంటో అర్థం కాదు.

అయితే జోష్ తర్వాత తిరిగి ఆ ఇద్దరూ కలిసి పని చేసేందుకు చాలానే ప్రయత్నించినా కానీ ఏదీ కలిసి రాలేదు. `మజిలి` లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చైతన్యతో దిల్ రాజు ఓ మూవీ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ ఆ సినిమాకి అన్నీ అడ్డంకులే. రష్మికను కథానాయికగా నటించమని సంప్రదిస్తే భారీ పారితోషికం డిమాండ్ చేసింది. అలాగే స్క్రిప్టులో సెకండాఫ్ మార్చాల్సిందిగా చైతన్య కోరారు. ఈప్రాసెస్ లోనే నాగచైతన్యకు శేఖర్ కమ్ముల వినిపించిన స్క్రిప్టు నచ్చి ఓకే చెప్పేశాడు. దీంతో ఇక దిల్ రాజు చైతన్యతో ప్రాజెక్టును వాయిదా వేయాల్సి వచ్చింది.

సినిమా విడుదలైన వారం రోజుల తర్వాత రివ్యూలు రాయాలట!

Tollywood-Actor-Karthik-Raju-Speech-at-Operation-Gold-Fish-Successmeet-Andhra-Talkies
ఆది హీరోగా శషా చెట్రి హీరోయిన్ గా కార్తీక్ రాజు.. అబ్బూరి రవి.. పార్వతీశం.. నిత్యా నరేష్.. కృష్ణుడు ముఖ్య పాత్రల్లో నటించిన 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సాయి కిరణ్ అడవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. రివ్యూలు కూడా మిక్స్ డ్ టాక్ తో వచ్చాయి. సినిమా విడుదలైన తర్వాత యూనిట్ సభ్యులు ప్రమోషనల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు మరియు టెక్నీషియన్స్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా అబ్బూరి రవి మాట్లాడుతూ అర్జున్ పండిట్ పాత్రను చేసేందుకు ఒప్పుకున్న ఆదికి థ్యాంక్స్. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకున్నా కూడా ఆయన ఒక మంచి కథ అనే ఉద్దేశ్యంతో ఈ పాత్రను చేసేందుకు ఒప్పుకోవడం అభినందనీయం అన్నాడు. సినిమాను తీయడానికి దర్శకుడు సాయి కిరణ్ ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. ఒక మంచి కథను తయారు చేసుకుని దాని కోసం చాలా కష్టపడ్డ దర్శకుడు సాయి కిరణ్ గారికి అభినందనలు అన్నాడు.

డిజిటల్ కట్టడి సీరియస్ గా తీసుకున్నట్టేనా

Tollywood-Producers-on-About-Digital-Streaming-Rights--Andhra-Talkies
నిర్మాతలకు అతి పెద్ద ఆదాయ వనరుగా మారిన డిజిటిల్ స్ట్రీమింగ్ హక్కుల వ్యవహారం గురించి పరిశ్రమ సీరియస్ గానే ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవలే అల వైకుంఠపురము పోస్టర్లో మీరు ఈ సినిమాను అమెజాన్ లో నెట్ ఫ్లిక్స్ లో చూడలేరు అని ప్రత్యేకంగా ప్రస్తావించడం పెద్ద చర్చకే దారి తీసింది. కేవలం నెల రోజుల నిడివిలో అమెజాన్ లాంటి సంస్థలు కొత్త సినిమాలు ఆన్ లైన్ లో పెట్టేయడంతో యావరేజ్ టాక్ వచ్చిన వాటిని థియేటర్లలో ఎవరూ పట్టించుకోవడం లేదు.

ఫలితంగా నిర్మాతకు ఎలా ఉన్నా ఎగ్జిబిటర్లు బాగా దెబ్బ తింటున్నారు. దీనికి పరిష్కారం అగ్రిమెంట్ టైం లోనే నిడివి గురించి స్పష్టంగా రాసుకోవడం. ఇకపై శాటిలైట్ టెలికాస్ట్ తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్ కు అనుమతి ఇవ్వాలని నిర్మాతలు డిసైడ్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి కానీ అమలులో ఎంతమేరకు మన ప్రొడ్యూసర్లు నిజాయితీగా ఉంటారన్నది వేచి చూడాలి. మొన్న ఏప్రిల్ నుంచే కొత్త సినిమాలు 60 రోజుల తర్వాత మాత్రమే డిజిటల్ లో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.

'సైరా' కు జగన్ 'మెగా' ట్రీట్ ఇచ్చేసినట్టే!

Megastar-Chiranjeevi-meets-ap-cm-jagan-Andhra-Talkies
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్రీట్ నిజంగానే అదిరిందని చెప్పాలి. గడచిన వారం రోజులుగా జగన్ చిరుల భేటీపై పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. జగన్ వద్దకు చిరు వెళ్లడానికి గల కారణాలు తెలిసినా కూడా... ఇంకా ఏదో ఉందంటూ ఆసక్తికర కథనాలు వినిపించాయి. అయితే అటు జగన్ గానీ ఇటు చిరు గానీ ఈ కథనాలను ఎంతమాత్రం పట్టించుకోకుండానే... ముందుగా నిర్దేశించుకున్న షెడ్యూల్ కంటే కాస్తంత లేట్ అయినా కూడా కలిశారు. ఒకరినొకరు అభినందించుకున్నారు. ఒకరినొకరు సన్మానించుకున్నారు. అంతేనా... అమరావతి పరిధిలోని తాడేపల్లిలోని జగన్ నివాసంలో జరిగిన ఈ భేటీలో మెగాస్టార్ కు జగన్ మరిచిపోలేని ట్రీట్ అయితే ఇచ్చేశారన్న మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తనను కలిసేందుకు సతీసమేతంగా వచ్చిన చిరుకు తన సతీమణి వైఎస్ బారతితో కలిసి ఘన స్వాగతం పలికిన జగన్... మెగా దంపతులను తమ ఇంటిలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ తర్వాత జగన్ ను చిరు దుశ్సాలువాతో సత్కరించి బొకేను అందించగా... జగన్ కూడా అదే స్థాయిలో చిరుకు సత్కారం చేశారు. ఆ తర్వాత చాలా సేపు మాట్లాడుకున్న జగన్ - చిరు... జగన్ ఏర్పాటు చేసిన విందును ఇద్దరూ కలిసి స్వీకరించినట్లుగా సమాచారం. ఆ తర్వాత కూడా జగన్ - చిరులిద్దరూ చాలాసేపే మాట్లాడుకున్నా... వారి మధ్య ప్రస్తావనకు వచ్చిన అంశాలేమిటన్న విషయం బయటకు రాకున్నా... తన తాజా చిత్రం సైరాను చూడాలని జగన్ ను చిరు కోరినట్టుగా సమాచారం. చిరు అభ్యర్థనకు జగన్ కూడా సానుకూలంగానే స్పందించినట్లుగా సమాచారం.

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...