ఇదీ సంగతి! భిన్న ధృవాలు.. కలుసుకోవు!!

Hero-Naga-Chaitanya-Movie-with-Director-Dil-Raju-Andhra-Talkies
అక్కినేని నాగచైతన్య - దిల్ రాజు కాంబినేషన్ అనగానే జోష్ సినిమా గుర్తుకు వస్తుంది. చైతన్యను వెండితెరకు పరిచయం చేసిన నిర్మాతగా దిల్ రాజు పేరు అభిమానులకు స్ఫురణకు వస్తుంది. అయితే చైతూ కెరీర్ ప్రారంభమై ఏడెనిమిదేళ్లు పూర్తవుతున్నా ఇంకా తిరిగి ఆ జోడీ రిపీట్ కాకపోవడం ఆశ్చర్యం కలిగించకుండా ఉండదు. పరిశ్రమ అగ్ర నిర్మాతతో చైతూ తిరిగి పని చేయకపోవడానికి కారణమేంటో అర్థం కాదు.

అయితే జోష్ తర్వాత తిరిగి ఆ ఇద్దరూ కలిసి పని చేసేందుకు చాలానే ప్రయత్నించినా కానీ ఏదీ కలిసి రాలేదు. `మజిలి` లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చైతన్యతో దిల్ రాజు ఓ మూవీ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ ఆ సినిమాకి అన్నీ అడ్డంకులే. రష్మికను కథానాయికగా నటించమని సంప్రదిస్తే భారీ పారితోషికం డిమాండ్ చేసింది. అలాగే స్క్రిప్టులో సెకండాఫ్ మార్చాల్సిందిగా చైతన్య కోరారు. ఈప్రాసెస్ లోనే నాగచైతన్యకు శేఖర్ కమ్ముల వినిపించిన స్క్రిప్టు నచ్చి ఓకే చెప్పేశాడు. దీంతో ఇక దిల్ రాజు చైతన్యతో ప్రాజెక్టును వాయిదా వేయాల్సి వచ్చింది.తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేసినట్టేనని తెలుస్తోంది. చైతన్య- దిల్ రాజు ప్రాజెక్టు కోసం శశి అనే కొత్త కుర్రాడు స్క్రిప్టును రాశారు. కానీ అది వర్కవుట్ కాలేదు. `మజిలీ` బ్లాక్ బస్టర్ కొట్టడంతో చైతన్యను వెతుక్కుంటూ రకరకాల ఆఫర్లు రావడం చైతూ వాటిపైనే శ్రద్ధ పెట్టడంతో ఇది కుదరలేదిక. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో కలిసి `వెంకీమామ` చిత్రీకరణలోనూ చైతూ బిజీగా ఉన్నాడు. మరోవైపు కమ్ముల సినిమాతోనూ బిజీ. అయితే దిల్ రాజుతో చైతన్య ఇక ఎప్పటికీ సినిమా చేయడా? అంటే అవునని అనలేం కాదని అనలేం. ఇప్పటికి ఆ ఇద్దరూ భిన్న ధృవాల్లా ఉన్నారు. ఎప్పటికి కలుస్తారు? అన్నది చూడాలి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...