సినిమా విడుదలైన వారం రోజుల తర్వాత రివ్యూలు రాయాలట!

Tollywood-Actor-Karthik-Raju-Speech-at-Operation-Gold-Fish-Successmeet-Andhra-Talkies
ఆది హీరోగా శషా చెట్రి హీరోయిన్ గా కార్తీక్ రాజు.. అబ్బూరి రవి.. పార్వతీశం.. నిత్యా నరేష్.. కృష్ణుడు ముఖ్య పాత్రల్లో నటించిన 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సాయి కిరణ్ అడవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. రివ్యూలు కూడా మిక్స్ డ్ టాక్ తో వచ్చాయి. సినిమా విడుదలైన తర్వాత యూనిట్ సభ్యులు ప్రమోషనల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు మరియు టెక్నీషియన్స్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా అబ్బూరి రవి మాట్లాడుతూ అర్జున్ పండిట్ పాత్రను చేసేందుకు ఒప్పుకున్న ఆదికి థ్యాంక్స్. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకున్నా కూడా ఆయన ఒక మంచి కథ అనే ఉద్దేశ్యంతో ఈ పాత్రను చేసేందుకు ఒప్పుకోవడం అభినందనీయం అన్నాడు. సినిమాను తీయడానికి దర్శకుడు సాయి కిరణ్ ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. ఒక మంచి కథను తయారు చేసుకుని దాని కోసం చాలా కష్టపడ్డ దర్శకుడు సాయి కిరణ్ గారికి అభినందనలు అన్నాడు.మరో నటుడు కార్తీక్ రాజు మాట్లాడుతూ దర్శకుడు సాయి కిరణ్ గారు సంవత్సరంన్నర  పాటు కష్టపడి ఈ సినిమాను తీశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాను తీయడంతో పాటు దాన్ని విడుదల చేయడం కూడా చాలా కష్టంతో కూడుకున్నది. నాకు డిస్ట్రిబ్యూషన్.. నిర్మాతల సమస్యలు ఏంటీ అనే విషయాలు తెలుసు. సినిమా చాలా బాగా తీశారు.. అందరికి బాగా నచ్చింది. సినిమా అనేది ప్రేక్షకులకు రీచ్ అవ్వాలన్నా.. సినిమా అనేది బతకాలన్నా కూడా రివ్యూలు విడుదలైన వారం రోజుల తర్వాత రాయాలని అన్నాడు. వెంటనే రివ్యూలు రావడం వల్ల చాలా డ్యామేజ్ జరుగుతుందని.. సినిమా మేకర్స్ బాధను అర్థం చేసుకుని రివ్యూల విషయంలో ఆలోచించండి అంటూ విజ్ఞప్తి చేశాడు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...