డిజిటల్ కట్టడి సీరియస్ గా తీసుకున్నట్టేనా

Tollywood-Producers-on-About-Digital-Streaming-Rights--Andhra-Talkies
నిర్మాతలకు అతి పెద్ద ఆదాయ వనరుగా మారిన డిజిటిల్ స్ట్రీమింగ్ హక్కుల వ్యవహారం గురించి పరిశ్రమ సీరియస్ గానే ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవలే అల వైకుంఠపురము పోస్టర్లో మీరు ఈ సినిమాను అమెజాన్ లో నెట్ ఫ్లిక్స్ లో చూడలేరు అని ప్రత్యేకంగా ప్రస్తావించడం పెద్ద చర్చకే దారి తీసింది. కేవలం నెల రోజుల నిడివిలో అమెజాన్ లాంటి సంస్థలు కొత్త సినిమాలు ఆన్ లైన్ లో పెట్టేయడంతో యావరేజ్ టాక్ వచ్చిన వాటిని థియేటర్లలో ఎవరూ పట్టించుకోవడం లేదు.

ఫలితంగా నిర్మాతకు ఎలా ఉన్నా ఎగ్జిబిటర్లు బాగా దెబ్బ తింటున్నారు. దీనికి పరిష్కారం అగ్రిమెంట్ టైం లోనే నిడివి గురించి స్పష్టంగా రాసుకోవడం. ఇకపై శాటిలైట్ టెలికాస్ట్ తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్ కు అనుమతి ఇవ్వాలని నిర్మాతలు డిసైడ్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి కానీ అమలులో ఎంతమేరకు మన ప్రొడ్యూసర్లు నిజాయితీగా ఉంటారన్నది వేచి చూడాలి. మొన్న ఏప్రిల్ నుంచే కొత్త సినిమాలు 60 రోజుల తర్వాత మాత్రమే డిజిటల్ లో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.కానీ వాస్తవానికి ఆ నిబంధనకు తూట్లు పొడుస్తూ నెల రోజులకే మళ్ళీ స్ట్రీమింగ్ చేయడం మొదలుపెట్టారు. మొన్నటికి మొన్న నాని గ్యాంగ్ లీడర్ 27వ రోజుకే అమెజాన్ లో రావడం పట్ల నెటిజెన్లు సైతం షాక్ తిన్నారు. కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలైతే మరీ దారుణంగా మూడో వారానికే ఆన్ లైన్ లో ప్రత్యక్షమయ్యాయి. సో ఇప్పుడేదో అనుకోవడం కాదు కానీ నిజంగా చిత్తశుద్ధితో తీసుకున్న నిర్ణయాలు అమలు పరచగలిగితే థియేటర్లకు మంచి రోజులు రావడం ఖాయం. ముఖ్యంగా సినిమా టైటిల్ కార్డు కన్నా ముందు డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ తాలూకు లోగోలు హై లైట్ చేయకుండా జాగ్రత్త పడటం చాలా అవసరం.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...