చుక్కలు చూపిస్తున్న ఇస్మార్ట్ గాళ్

Tollywood-movie-Ismart-Girl-Asking-Shocking-Remuneration-Andhra-Talkies
దీపం ఉండగానే చక్కదిద్దుకోవడం మన అమ్మణ్ణులకు అలవాటే. అయితే ఈ భామ మాత్రం పరిశ్రమలో ప్రవేశించిన కేవలం రెండు మూడేళ్లకే పారితోషికంలో చుక్కలు చూపించేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. ఆరంభం లక్షల్లో పారితోషికంతో సరిపెట్టుకున్న ఈ అమ్మడు ఇప్పుడు ఏకంగా కోటికి ఏమాత్రం తగ్గననేస్తోందట. దీంతో తనను సంప్రదిస్తున్న నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయని సమాచారం.

అసలింతకీ ఎవరీ భామ? అంటే.. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బ్యూటీ ఎవరో చెప్పాల్సిన పనేలేదు. ఫ్యాన్స్ చాలా ఈజీగానే గెస్ చేయగలరు. తనవైన ఒంపుసొంపులు అందాల ఆరబోతతో పిచ్చెక్కించేస్తున్న ఈ అమ్మడు.. టాలీవుడ్ లో తెలివైన గేమ్ ఆడుతోంది. వరుసగా తనవైపు వచ్చిన ఏ క్రేజీ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వచ్చింది వచ్చినట్టే చుట్టబెట్టేస్తోంది.

అల్లుడితో విభేదాలు.. మామతో సినిమా

Director-Goutham-Meenon-Movie-With-Rajini-Kanth-Andhra-Talkies
విభిన్న ప్రేమ కథ చిత్రాల దర్శకుడిగా పేరున్న గౌతమ్ మీనన్ చాలా గ్యాప్ తర్వాత ధనుష్ హీరోగా 'ఎన్నయ్ నోకి పాయుమ్ తోట' తెరకెక్కించాడు. కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. సినిమాను ఎట్టకేలకు ఈనెల 29న విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. సినిమా విడుదల వాయిదా పడటం మరియు ఇతర కారణాల వల్ల గౌతమ్ మీనన్ మరియు ధనుష్ ల మద్య విభేదాలు ఉన్నాయంటూ తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఒక వైపు ధనుష్ తో వివాదం అంటూ రాస్తున్న మీడియా సంస్థలు మరో వైపు రజినీకాంత్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతుంది అంటూ వార్తలు రాస్తున్నాయి. చాలా కాలంగా వీరిద్దరి కాంబోలో ఒక సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. అయిదు ఆరు సంవత్సరాల క్రితమే వీరి కాంబోలో సినిమా రావాల్సి ఉన్నా కూడా ఏదో కారణం వల్ల సెట్ అవ్వలేదు. మళ్లీ ఇన్నాళ్లకు వారిద్దరి కాంబో మూవీ పట్టాలెక్కబోతుంది.

మలైకా డ్రెస్సు మహా చిలిపిది బాబూ..!

Sexy-Heroin-Malaika-Arora-Wardrobe-Malfunction-Andhra-Talkies
బాలీవుడ్ సినిమాల గురించి తెలిసిన వారికి మలైకా అరోరా పేరు తెలిసే ఉంటుంది.  ఇక తెలుగువారికి కూడా మలైకా పరిచయమే. పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' లో కెవ్వు కేక పాటకు నర్తించి కెవ్వుకేక అనిపించింది.  ఈ లేటు వయసు భామకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది.  బికినీ ఫోటోలను పోస్ట్ చేస్తూ..  కుర్ర బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది.  తాజాగా ఈ భామ ఒక స్టోర్ లాంచ్ కు హాజరైంది.  అక్కడ జరిగిన ఒక సంఘటన వైరల్ గా మారింది.

ఇంతకీ ఏం జరిగిందంటే షారూఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఈమధ్య ముంబైలో ఒక స్టోర్ ను లాంచ్ చేశారు.  ఈ కార్యక్రమానికి మలైకా అరోరా.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. కరణ్ జోహార్.. అనన్య పాండే తదితరులు హాజరయ్యారు. ఎప్పటిలాగే మలైకా చాలా హాటుగా ఉండే డ్రెస్ లో కార్యక్రమానికి హాజరైంది. బెల్ బాటం స్టైల్ ప్యాంట్.. బ్లేజర్ ధరించింది. బ్లేజర్ కు బటన్స్ లేకుండా అందాల ప్రదర్శన చేస్తూ హాటు లేడీ తరహాలో కనిపించింది.  అయితే కొన్ని డ్రెస్సులు ధరించినప్పుడు అవి మన మాట వినవు.  వాటికి కూడా కొంత చిలిపిదనం ఉంటుంది. చిన్నపిల్లలకు నిక్కర్ జారిపోతూ ఉంటుంది కదా.. సరిగ్గా అలాంటిదే.  మలైకం టాప్ కొంచెం పక్కకు జరిగి 'కనిపించాల్సిన హాటు కంటే మరింత హాటు షో' గా మారింది. దీంతో ఆ అందాలను ఫోటోగ్రాఫర్లు హై ఎండ్ కెమెరాలతో బంధిస్తూ రెచ్చిపోయారు.  అనుకున్నదానికంటే డ్రెస్ డిస్కౌంట్ ఎక్కువగా ఉందని.. కెమెరాలు ఎగబడుతున్నాయని గ్రహించిన మలైకం మెల్లగా పక్కకు నడుచుకుంటూ వెళ్లి తన అనవసర డిస్కౌంట్ ను తెలివిగా తగ్గించింది.

రామ్ గోపాల్ వర్మ ఇంటర్నేషనల్ ఛాలెంజ్

Ram-Gopal-Varma-International-challenge-andhra-talkies
మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని పెద్ద ఫైటర్ అవ్వాలనుకున్న ఆర్జీవీ కల నెరవేరలేదు. బ్రూస్లీ సినిమాలు చూసి కరాటే ప్రాక్టీస్ చేసి.. అంత పెద్ద మార్షల్ కింగ్ అవ్వాలనుకున్నా కుదరలేదు. బ్రూస్లీ అవ్వాలన్న తన డ్రీమ్ నెరవేరలేదని ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ అన్నారు. అది సరేకానీ.. తన ఫేవరెట్ మార్షల్ స్టార్ బ్రూస్ లీ కథతో సినిమా తీయాలన్న ఆర్జీవీ కల నెరవేరేది ఎప్పటికో చూడాలి.

అదంతా అటుంచితే.. ఇన్నాళ్టికి ఆర్జీవీకి- మార్షల్ ఆర్ట్స్ .. ఆర్జీవీకి బ్రూస్ లీకి  ఉన్న కనెక్షన్ తో ఓ ఇంటర్నేషనల్ సినిమా రాబోతోంది. `ఎంటర్ ది గర్ల్ డ్రాగన్` పేరుతో ఈ సినిమాని రెడీ చేస్తున్నాడు. ఇందులో లేడీ బ్రూస్లీ విన్యాసాల్ని చూపించబోతున్నాడు. టీజర్ ను బ్రూస్ లీ జయంతి కానుకగా ఈనెల 27 న 3:12 పీఎం రిలీజ్ చేయబోతున్నారు. వచ్చే నెల డిసెంబర్ 13న ట్రైలర్ వదులుతాడట. అది కూడా ట్రైలర్ ని  బ్రూస్ లీ సొంత నగరం చైనా- ఫోషన్ సిటీలో రిలీజ్ చేస్తానని ప్రకటించాడు. ఇండో చైనీస్ కో ప్రొడక్షన్ లో ఈ సినిమాను నిర్మిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సీనియర్ నటి రమ్యకృష్ణపై రకరకాల రూమర్లు..!

Speculations-on-About-Most-Powerfull-Heroin-Ramya-Krishna-movie-Offers-in-Telugu-Film-Industry-Andhra-Talkies
గత కొంతకాలంగా సీనియర్ నటి రమ్యకృష్ణపై రకరకాల రూమర్లు పుట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత రమ్యకృష్ణ రేంజు అమాంతం మారిపోయింది. మోస్ట్ పవర్ ఫుల్ శివగామి పాత్రలో నటించాక తన ఇమేజ్ పదింతలైంది. అందుకు తగ్గట్టే వరుస అవకాశాలతో భారీగా ఆర్జిస్తోందని ప్రచారమవుతోంది. అయితే ఇదంతా నిజమే కానీ.. ప్రస్తుతం రమ్యకృష్ణ కెరీర్ పరంగా ఫలానా సినిమా చేస్తున్నారు? అన్న దానిపై స్పష్టమైన క్లారిటీ అయితే లేదు.

అప్పట్లో శివగామి పాత్రకు కొనసాగింపుగా ఫిక్షన్ కథతో తీస్తున్న సినిమాలో  నటిస్తున్నారని పోస్టర్లు రివీలయ్యాయి. ఆ సినిమా రిలీజ్ కి రాలేదింకా. ఈలోగానే రమ్యకృష్ణ నటించిన పలు తమిళ చిత్రాలు రిలీజై వెళ్లాయి. ఇప్పుడు టాలీవుడ్ లోనూ క్షణం తీరిక లేనంతగా వరుసగా సినిమాలకు కమిటవుతున్నారని ప్రచారమవుతోంది. పైగా తెలుగు ఫిలిం సర్కిల్స్ లో రమ్య రెగ్యులర్ గా ప్రత్యక్షమవుతుండడంతో చెన్నయ్ వదిలిన రమ్యకృష్ణ ఇక్కడ మరోసారి పూర్తిగా బిజీ అయిపోతోందంటూ ప్రచారం మొదలైంది.

మాజీ సీఎం మనవడితో ఓ రాత్రంతా గడిపా... శ్రీ రెడ్డి విసిరిన మరో సంచలనం...!!

Spending one night with the grandson of former CM ... Another sensation thrown by Sri Reddy
Spending one night with the grandson of former CM ... Another sensation thrown by Sri Reddy 
శ్రీరెడ్డి అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్ ని కుదిపివేస్తున్న సంచలనం. ఆమె ఎపుడు ఎవరినిపై తన రాయి విసురుతుందో ఎవరికీ తెలియదు. దాంతో ఎవరికి వారు భయంగా చూస్తున్నారంతే. ఫిల్మ్ ఇండస్ట్రీలో కామన్ అనుకుంటున్న కాస్టింగ్ కౌచ్ ని చాలా పెద్ద ఎత్తున శ్రీరెడ్డి బయటపెడుతోంది. దాంతో సినీ ప్రముఖులు పలువురు భుజాలు తడుముకుంటున్నారు. శ్రీరెడ్డి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని అనడంతో పెద్ద కుటుంబాలు సైతం నోరు విప్పలేకపోతున్నాయి.

తాజాగా నాచురల్ స్టార్ నాని మీద ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి ఇపుడు కోలీవుడ్లొ ఓ సినీ ప్రముఖుడి మీద తన బాణాలను ఎక్కుపెట్టింది. ఆ సినీ ప్రముఖుడు ఎవరో కాదు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి స్వయంగా మనవడు, ఇపుడు డీఎంకే అధినేత స్టాలిన్ కి కొడుకు, డీఎంకే యువ విభాగానికి అధినేత.

కమెడియన్స్ తో సినిమా నిర్మించనున్న హీరో

Tollywood-Hero-Sundeep-Kishan-to-Produce-a-Movie-with-Comedians-Andhra-Talkies
ప్రస్తుతం కామెడీ సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి స్పందన రావడంతో ఇప్పుడు కమెడియన్స్ ను పెట్టి సినిమాలు చేసే పనిలో ఉన్నారు నిర్మాతలు. ఈ లిస్టులోకి హీరో సందీప్ కిషన్ కూడా చేరబోతున్నాడు. అవును ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సందీప్ ఇటివలే 'నిను వీడను నీడను నేనే' సినిమాతో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం నిర్మాతగా ఓ కామెడీ సినిమాను నిర్మించే పనిలో ఉన్నాడట ఈ కుర్ర హీరో. ఇటివలే మీడియాతో ఆ విషయాన్ని పంచుకున్నాడు కూడా. రాహుల్ రామకృష్ణ ప్రియదర్శి లతో ఓ కామెడీ సినిమా ప్లాన్ చేస్తున్నానని ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని అన్నాడు.

ఇక ప్రస్థానం హిందీలో ఫెయిల్ అవ్వడంపై కూడా రెస్పాన్స్ అయ్యాడు. ఎప్పుడో చూసేసిన కథ అక్కడ వారికి కొత్తగా ఎలా అనిపిస్తుంది. తెలుగులో మనకి అది కొత్త కథతో వచ్చిన మంచి సినిమా కానీ ఈ గ్యాప్ లో అక్కడ ఇలాంటి కథలతో సినిమాలు వచ్చే ఉంటాయి కదా. సో అదే మెయిన్ రీజన్ అయి ఉండొచ్చని తెలిపాడు.

సైరా ను మించిన సూపర్ స్టార్ బిజినెస్?

Is-Tollywood-Movie-Sarileru-Neekevvaru-Crossed-Syeraa-Business-In-Hindi-Andhra-Talkies
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా భారీ అంచనాల నడుమ విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు సహా దక్షిణాదిన ఇతర భాషల్లో సైరా మంచి బిజినెస్ చేసింది. కానీ హిందీ లో మాత్రం ప్రీ బిజినెస్ పరంగా అంచనాలు  అందుకో లేకపోయింది. లెజెండరీ అమితాబచ్చన్ కీలక పాత్ర పోషించిన  మార్కెట్ పరంగా అంతగా కలిసి రాలేదు. బాహుబలి రేంజు బిజినెస్ ఆశిస్తే .. అసలు సైరా ను అక్కడ పంపిణీ వర్గాలు లైట్ తీస్కోవడం ఆశ్చర్య పరిచింది. ఒక తెలుగు స్వాతంత్య్ర సమర యోధుడి కథను ఉత్తరాది జనం ఆదరించరని హిందీ మార్కెట్ వర్గాలు భావించాయి. ఇక ప్రచారం పరంగానూ సైరా టీమ్ వెనకబడడం .. పబ్లిసిటీ సమయంలో వరుణుడు వెంటాడడం అన్నీ మైనస్ అయ్యాయి.

అయినా సైరా హిందీ రైట్స్ 9 కోట్లకు అమ్ముడు పోయాయని ఫర్హాన్-తడాని బృందం తో కొణిదెల టీమ్ భాగస్వామ్య డీల్ కుదుర్చుకున్నారని ప్రచారమైంది. ఇప్పటివరకూ ఈ డీల్ చిరు కెరీర్ లోనే ది బెస్ట్. హిందీ రైట్స్ పరంగా రికార్డు అనే చెప్పాలి. ఇప్పటివరకూ నాన్ బాహుబలి కేటగిరీలో ఏ తెలుగు హీరో సినిమా ఇన్ని కోట్లకు బాలీవుడ్ లో అమ్మడు పోయింది లేదు. ఆ రకంగా చిరు ఇమేజ్ కి తిరుగు లేదనే చెప్పాలి.

వివాదాస్పద నటి పాత్రలో శ్రీరెడ్డి!

Sexy-Actor-Sree-Reddy-In-Shocking-Role-Andhra-Talkies
టాలీవుడ్ నటి శ్రీరెడ్డి పేరు తెలియని తెలుగువారు దాదాపుగా ఉండకపోవచ్చు.  క్యాస్టింగ్ కోచ్ ఆరోపణలు చేసి మీడియా దృష్టిని.. ప్రజల ఆకర్షించిన శ్రీరెడ్డి ఫిలిం ఛాంబర్ వద్ద అర్థనగ్న ప్రదర్శనతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది.  అయితే అప్పటి నుంచి తెలుగులో శ్రీరెడ్డికి అవకాశాలు రాలేదు. ఒకరిద్దరు అవకాశాలు ఇస్తామని పబ్లిక్ గా ప్రకటించారు కానీ వాటిసంగతి ఏమైందో తెలియదు.

తాజాగా శ్రీరెడ్డికి 'క్లైమాక్స్' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో ఒక అవకాశం దక్కింది. తెలుగు రాజకీయాలపై ఒక సెటైర్ లాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీరెడ్డి ఒక వివాదాస్పద నటి పాత్రలో నటిస్తోందని సమాచారం.  ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్.. పృథ్విరాజ్.. శివశంకర్ మాస్టర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  రీసెంట్ గా 'క్లైమాక్స్' టీమ్ కొన్ని స్టిల్స్ విడుదల చేసింది.  ఈ ఫోటోలలో శ్రీరెడ్డి ఎప్పటిలాగే గ్లామరస్ గా కనిపిస్తోంది.  ఈ స్టిల్ లో 30 ఇయర్స్ పృథ్వి ఒక స్వామీజీ గెటప్ లో ఉన్నారు.   రాజేంద్ర ప్రసాద్ పొడవాటి గడ్డం పెంచి మోడరన్ గెటప్ లో ఉన్నారు.

ఆ కబురు తర్వాత

Tollywood-Heroin-Kalyani-Priyadarshan-Andhra-Talkies
నట వారసురాలు కళ్యాణి ప్రియదర్శన్ ని చూస్తే చాలా అమాయకంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈమధ్య ఆమె పెళ్లి కబుర్లూ అదే పనిగా వినపడుతున్నాయి. ఈ రెండు విషయాలపైనా మరోసారి క్లారిటీ ఇచ్చుకున్నది.

"నేను తెరపై అమాయకంగా కనిపిస్తానేమో కాని, బయట అలా ఉండను. ఇక పెళ్లి కబురంటారా? నేను ఓ వ్యక్తిని ఇష్టపడుతున్న మాట నిజం. తననే పెళ్లాడతా. అయితే దానికి ఇంకా సమయం ఉంది. ఎవరో కూడా అప్పుడే చెప్తా" అంటున్నది.

నేను వైవిధ్యానికే ఓటు వేస్తా | I vote for diversity :

Regina_Cassandra-I vote for diversity
ఫామ్ లోకి వచ్చినా రాకపోయినా విభిన్నమయిన పాత్రల్ని ఎంచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తుంటుంది రేజీనా కేసెండ్ర. అదే విషయాన్ని అడిగితే నిజాయితీగా సమాధానమిచ్చింది. గ్లామర్ పాత్రలనేవి ఎప్పుడైనా, ఏభాషలోనైనా చెయ్యవచ్చు. కానీ భిన్నమైన అవకాశాలు ఎప్పుడో కానీ రావు.

"ఎవరు"లో నెగెటివ్ రోల్, "ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా" లో లెస్బియన్ పాత్ర అందుకు ఉదాహరణలు. ఇటువంటి వైవిధ్యం గల పాత్రలు చేయాలన్నది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం" అంటున్నది.

సల్మాన్ ఖాన్ సలహాలు తీసుకోకుండా ఉండలేను!

సినీరంగంలో తనకు సలహాలు ఇచ్చేది, తన గురించి ఆలోచించేది సల్మాన్ ఖానే అంటూ మరోమారు నొక్కి,నొక్కి చెప్పింది శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. "ఆయన్ను సలహాలు అడగడానికి అస్సలు ఏమాత్రం ఇబ్బందిపదను. అలాగే అతను కూడా ఏదో చెప్పానులే అన్నట్లు కాకుండా చక్కగా ఉపయోగపడే సలహాలు ఇస్తుంటారు" అంటున్న జాక్వెలిన్ తన నటన కంటే డ్యాన్సే ప్రేక్షకులకు బాగా నచ్చినట్లు ఉంది" అంటూ నవ్వులు విసిరింది..

నిర్మాత అవతారమెత్తుతున్న టాలీవుడ్ హీరోలు

Heros-Becoming-tollywood-Producers-Andhra-Talkies
గతంలో హీరోలు వేరేగా నిర్మాతలు వేరేగా ఉండేవారు. అయితే ఎన్టీఆర్.. ఎఎన్నార్.. కృష్ణ లాంటి కొందరు పెద్ద స్టార్ హీరోలు నిర్మాణ రంగంలోకి ప్రవేశించి సూపర్ హిట్ సినిమాలతో తమ సత్తా చాటారు. మురళిమోహన్.. మోహన్ బాబు లాంటి సీనియర్లు కూడా చాలాకాలం నిర్మాతలుగా కొనసాగారు. ఈ జెనరేషన్లో నిర్మాతలుగా మారిన హీరోలు చాలామందే ఉన్నారు.

ఇప్పటికీ హీరోలుగా నటిస్తున్న సీనియర్ హీరోలలో చూసుకుంటే అక్కినేని నాగార్జున చాలా ఏళ్ళ నుంచి సినిమాలు నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించిన నాగార్జున ఇప్పటికీ నిర్మాతగా కొనసాగుతున్నారు. ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువమంది సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ల లో నాగ్ ఒకరు. 'మనం' లాంటి క్లాసిక్ ఫిలిమ్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి.  నందమూరి బాలకృష్ణ ఈమధ్యే నిర్మాతగా మారి ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించారు. అయితే ఆయనకు విజయం దక్కలేదు.

RRR కి బాహుబలి తరహాలోక్రేజ్ రావడం లేదే

Rajamouli-movie-RRR-Not-Getting-Craze-Like-Bahubali-Andhra-Talkies
రాజమౌళి సినిమాల విజయంలో మిగతా అన్ని అంశాలతో పాటుగా మార్కెటింగ్ కూడా కీలకపాత్ర పోషిస్తుందని పలువురు ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. నిజానికి బాహుబలి లో బ్లాక్ బస్టర్ అయ్యే కంటెంట్ ఉన్నమాట నిజమే కానీ దాంతో  పాటుగా అసాధారణమైన మార్కెటింగ్ వ్యూహం తోడైంది కాబట్టి ఆ రేంజ్ విజయం లభించిందని వారు చెప్తుంటారు. సినిమాలో ఉన్న ఎలాంటి అంశాలను ప్రేక్షకులకు ముందే చెప్పాలి.. ఏవి సస్పెన్స్ గా మెయింటెయిన్ చెయ్యాలి అనే విషయంలో రాజమౌళికి సాటిలేదని అంటుంటారు. ఈ విషయంలో తడబడడం వల్లే చాలామంది దర్శకులు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడుతుంటారు.

అయితే రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న 'RRR' చిత్రం విషయంలో మాత్రం ప్రస్తుతం అనుకున్నంత బజ్ లేదని అంటున్నారు. 'బాహుబలి' సినిమా ప్రకటించిన నాటి నుంచే ఆ సినిమాపై దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం కనిపించింది. ఆ సినిమా గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ఉండేది. మొదటి భాగం ఘనవిజయం సాధించడంతో రెండవ భాగంపై దేశవ్యాప్తంగా అసాధారణమైన ఆసక్తి వ్యక్తం అయింది.  అయితే ఇప్పుడు 'RRR' విషయంలో జనాల్లో క్యూరియాసిటీ ఉంది కానీ 'బాహుబలి' రేంజ్ హైప్ మాత్రం కనిపించడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది.

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...