అల్లుడితో విభేదాలు.. మామతో సినిమా

Director-Goutham-Meenon-Movie-With-Rajini-Kanth-Andhra-Talkies
విభిన్న ప్రేమ కథ చిత్రాల దర్శకుడిగా పేరున్న గౌతమ్ మీనన్ చాలా గ్యాప్ తర్వాత ధనుష్ హీరోగా 'ఎన్నయ్ నోకి పాయుమ్ తోట' తెరకెక్కించాడు. కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. సినిమాను ఎట్టకేలకు ఈనెల 29న విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. సినిమా విడుదల వాయిదా పడటం మరియు ఇతర కారణాల వల్ల గౌతమ్ మీనన్ మరియు ధనుష్ ల మద్య విభేదాలు ఉన్నాయంటూ తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఒక వైపు ధనుష్ తో వివాదం అంటూ రాస్తున్న మీడియా సంస్థలు మరో వైపు రజినీకాంత్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతుంది అంటూ వార్తలు రాస్తున్నాయి. చాలా కాలంగా వీరిద్దరి కాంబోలో ఒక సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. అయిదు ఆరు సంవత్సరాల క్రితమే వీరి కాంబోలో సినిమా రావాల్సి ఉన్నా కూడా ఏదో కారణం వల్ల సెట్ అవ్వలేదు. మళ్లీ ఇన్నాళ్లకు వారిద్దరి కాంబో మూవీ పట్టాలెక్కబోతుంది.మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ చేసిన రజినీకాంత్ వెంటనే శివ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు. శివ దర్శకత్వంలో సినిమా చేస్తూనే గౌతమ్ మీనన్ సినిమాను రజినీకాంత్ మొదలు పెట్టబోతున్నాడట. ఈ సినిమాను వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ వారు నిర్మించబోతున్నట్లుగా కూడా తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఎన్నయ్ నోకి పాయుమ్ తోట సినిమా ఫలితాన్ని బట్టి ఈ సినిమా ఉండే అవకాశం ఉందని మరి కొందరు అంటున్నారు. ఎన్నయ్ నోకి పాయుమ్ తోట సినిమాను తెలుగులో తూట గా డబ్బింగ్ చేసి అదే తేదీన విడుదల చేయబోతున్నారు.


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...