సైరా ను మించిన సూపర్ స్టార్ బిజినెస్?

Is-Tollywood-Movie-Sarileru-Neekevvaru-Crossed-Syeraa-Business-In-Hindi-Andhra-Talkies
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా భారీ అంచనాల నడుమ విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు సహా దక్షిణాదిన ఇతర భాషల్లో సైరా మంచి బిజినెస్ చేసింది. కానీ హిందీ లో మాత్రం ప్రీ బిజినెస్ పరంగా అంచనాలు  అందుకో లేకపోయింది. లెజెండరీ అమితాబచ్చన్ కీలక పాత్ర పోషించిన  మార్కెట్ పరంగా అంతగా కలిసి రాలేదు. బాహుబలి రేంజు బిజినెస్ ఆశిస్తే .. అసలు సైరా ను అక్కడ పంపిణీ వర్గాలు లైట్ తీస్కోవడం ఆశ్చర్య పరిచింది. ఒక తెలుగు స్వాతంత్య్ర సమర యోధుడి కథను ఉత్తరాది జనం ఆదరించరని హిందీ మార్కెట్ వర్గాలు భావించాయి. ఇక ప్రచారం పరంగానూ సైరా టీమ్ వెనకబడడం .. పబ్లిసిటీ సమయంలో వరుణుడు వెంటాడడం అన్నీ మైనస్ అయ్యాయి.

అయినా సైరా హిందీ రైట్స్ 9 కోట్లకు అమ్ముడు పోయాయని ఫర్హాన్-తడాని బృందం తో కొణిదెల టీమ్ భాగస్వామ్య డీల్ కుదుర్చుకున్నారని ప్రచారమైంది. ఇప్పటివరకూ ఈ డీల్ చిరు కెరీర్ లోనే ది బెస్ట్. హిందీ రైట్స్ పరంగా రికార్డు అనే చెప్పాలి. ఇప్పటివరకూ నాన్ బాహుబలి కేటగిరీలో ఏ తెలుగు హీరో సినిమా ఇన్ని కోట్లకు బాలీవుడ్ లో అమ్మడు పోయింది లేదు. ఆ రకంగా చిరు ఇమేజ్ కి తిరుగు లేదనే చెప్పాలి.అయితే తాజా గా ఆ రికార్డు ను మహేష్ బాబు బ్రేక్ చేసాడు. ఆయన కథానాయకుడి గా నటిస్తోన్న `సరిలేరు నీకెవ్వరు` హిందీ రైట్స్  15.25 కోట్లకు సేల్ అయినట్లు సమాచారం. డబ్బింగ్- శాటిలైట్- డిజిటల్ రైట్స్ కలిపి ఇంత మొత్తం చెల్లించినట్లు ప్రచారం సాగుతోంది. సరిలేరు దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ ఎఫ్ 2 ని హిందీలో రీమేక్ చేస్తున్న సందర్భం గా అతడి ఇమేజ్ అక్కడ కొంతమేర ప్లస్ అయ్యిందని భావిస్తున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...