రామ్ గోపాల్ వర్మ ఇంటర్నేషనల్ ఛాలెంజ్

Ram-Gopal-Varma-International-challenge-andhra-talkies
మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని పెద్ద ఫైటర్ అవ్వాలనుకున్న ఆర్జీవీ కల నెరవేరలేదు. బ్రూస్లీ సినిమాలు చూసి కరాటే ప్రాక్టీస్ చేసి.. అంత పెద్ద మార్షల్ కింగ్ అవ్వాలనుకున్నా కుదరలేదు. బ్రూస్లీ అవ్వాలన్న తన డ్రీమ్ నెరవేరలేదని ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ అన్నారు. అది సరేకానీ.. తన ఫేవరెట్ మార్షల్ స్టార్ బ్రూస్ లీ కథతో సినిమా తీయాలన్న ఆర్జీవీ కల నెరవేరేది ఎప్పటికో చూడాలి.

అదంతా అటుంచితే.. ఇన్నాళ్టికి ఆర్జీవీకి- మార్షల్ ఆర్ట్స్ .. ఆర్జీవీకి బ్రూస్ లీకి  ఉన్న కనెక్షన్ తో ఓ ఇంటర్నేషనల్ సినిమా రాబోతోంది. `ఎంటర్ ది గర్ల్ డ్రాగన్` పేరుతో ఈ సినిమాని రెడీ చేస్తున్నాడు. ఇందులో లేడీ బ్రూస్లీ విన్యాసాల్ని చూపించబోతున్నాడు. టీజర్ ను బ్రూస్ లీ జయంతి కానుకగా ఈనెల 27 న 3:12 పీఎం రిలీజ్ చేయబోతున్నారు. వచ్చే నెల డిసెంబర్ 13న ట్రైలర్ వదులుతాడట. అది కూడా ట్రైలర్ ని  బ్రూస్ లీ సొంత నగరం చైనా- ఫోషన్ సిటీలో రిలీజ్ చేస్తానని ప్రకటించాడు. ఇండో చైనీస్ కో ప్రొడక్షన్ లో ఈ సినిమాను నిర్మిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.అంతా బాగానే ఉంది కానీ.. ఈ సినిమా గురించి ఆర్జీవీ అపుడెపుడో ఇంట్రో ఇచ్చాడు. ఇంతకాలం అండర్ ప్రొడక్షన్ లోనే ఉందేమిటో.. ఇప్పటికీ రిలీజ్ చేయకుండా సడెన్ గా ప్రచారం ఊదరగొట్టేస్తున్నాడేమిటో! ఇక తాను తెరకెక్కించిన `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` ఈ నెల 29న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ట్రైలర్లతోనే సూటిగా మ్యాటర్ కొచ్చేసిన ఆర్జీవీ తెర నిండుగా కుల రాజకీయాలు.. హత్యా రాజకీయాలనే చూపించబోతున్నాడా అన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...