కమెడియన్స్ తో సినిమా నిర్మించనున్న హీరో

Tollywood-Hero-Sundeep-Kishan-to-Produce-a-Movie-with-Comedians-Andhra-Talkies
ప్రస్తుతం కామెడీ సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి స్పందన రావడంతో ఇప్పుడు కమెడియన్స్ ను పెట్టి సినిమాలు చేసే పనిలో ఉన్నారు నిర్మాతలు. ఈ లిస్టులోకి హీరో సందీప్ కిషన్ కూడా చేరబోతున్నాడు. అవును ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సందీప్ ఇటివలే 'నిను వీడను నీడను నేనే' సినిమాతో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం నిర్మాతగా ఓ కామెడీ సినిమాను నిర్మించే పనిలో ఉన్నాడట ఈ కుర్ర హీరో. ఇటివలే మీడియాతో ఆ విషయాన్ని పంచుకున్నాడు కూడా. రాహుల్ రామకృష్ణ ప్రియదర్శి లతో ఓ కామెడీ సినిమా ప్లాన్ చేస్తున్నానని ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని అన్నాడు.

ఇక ప్రస్థానం హిందీలో ఫెయిల్ అవ్వడంపై కూడా రెస్పాన్స్ అయ్యాడు. ఎప్పుడో చూసేసిన కథ అక్కడ వారికి కొత్తగా ఎలా అనిపిస్తుంది. తెలుగులో మనకి అది కొత్త కథతో వచ్చిన మంచి సినిమా కానీ ఈ గ్యాప్ లో అక్కడ ఇలాంటి కథలతో సినిమాలు వచ్చే ఉంటాయి కదా. సో అదే మెయిన్ రీజన్ అయి ఉండొచ్చని తెలిపాడు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...