చుక్కలు చూపిస్తున్న ఇస్మార్ట్ గాళ్

Tollywood-movie-Ismart-Girl-Asking-Shocking-Remuneration-Andhra-Talkies
దీపం ఉండగానే చక్కదిద్దుకోవడం మన అమ్మణ్ణులకు అలవాటే. అయితే ఈ భామ మాత్రం పరిశ్రమలో ప్రవేశించిన కేవలం రెండు మూడేళ్లకే పారితోషికంలో చుక్కలు చూపించేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. ఆరంభం లక్షల్లో పారితోషికంతో సరిపెట్టుకున్న ఈ అమ్మడు ఇప్పుడు ఏకంగా కోటికి ఏమాత్రం తగ్గననేస్తోందట. దీంతో తనను సంప్రదిస్తున్న నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయని సమాచారం.

అసలింతకీ ఎవరీ భామ? అంటే.. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బ్యూటీ ఎవరో చెప్పాల్సిన పనేలేదు. ఫ్యాన్స్ చాలా ఈజీగానే గెస్ చేయగలరు. తనవైన ఒంపుసొంపులు అందాల ఆరబోతతో పిచ్చెక్కించేస్తున్న ఈ అమ్మడు.. టాలీవుడ్ లో తెలివైన గేమ్ ఆడుతోంది. వరుసగా తనవైపు వచ్చిన ఏ క్రేజీ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వచ్చింది వచ్చినట్టే చుట్టబెట్టేస్తోంది.ఇదే హైస్పీడ్ లో ఉన్న ఈ భామను ఓ తమిళ నిర్మాత సంప్రదించాడట. అదిరిపోయే ఆఫర్ ఉంది.. కాదనవద్దని బతిమాలాడట. అయితే ఈ అమ్మడు ఏకంగా కోటి డిమాండ్ చేయడంతో తంబీకి చుక్కలు కనిపించాయని చెబుతున్నారు. అసలు తన సొంత ప్లేస్ లో ఈ అమ్మడికి అంత సీనుందా? అంటే అస్సలు లేనేలేదు. అక్కడ 40లక్షల పారితోషికం ఇస్తే ఎక్కువే. ఇటీవలే ఆయాచితంగా కలిసొచ్చిన ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ వల్ల చెట్టెక్కి కూచుంటోందట. ఇప్పుడున్న భామలంతా ఇంచుమించు కోటి పారితోషికానికి ఎక్కడా తగ్గమని అంటున్నారు. వీళ్ల జాబితాలో ఇస్మార్ట్ గాళ్ కూడా చేరిపోయింది మరి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...