మాజీ సీఎం మనవడితో ఓ రాత్రంతా గడిపా... శ్రీ రెడ్డి విసిరిన మరో సంచలనం...!!

Spending one night with the grandson of former CM ... Another sensation thrown by Sri Reddy
Spending one night with the grandson of former CM ... Another sensation thrown by Sri Reddy 
శ్రీరెడ్డి అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్ ని కుదిపివేస్తున్న సంచలనం. ఆమె ఎపుడు ఎవరినిపై తన రాయి విసురుతుందో ఎవరికీ తెలియదు. దాంతో ఎవరికి వారు భయంగా చూస్తున్నారంతే. ఫిల్మ్ ఇండస్ట్రీలో కామన్ అనుకుంటున్న కాస్టింగ్ కౌచ్ ని చాలా పెద్ద ఎత్తున శ్రీరెడ్డి బయటపెడుతోంది. దాంతో సినీ ప్రముఖులు పలువురు భుజాలు తడుముకుంటున్నారు. శ్రీరెడ్డి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని అనడంతో పెద్ద కుటుంబాలు సైతం నోరు విప్పలేకపోతున్నాయి.

తాజాగా నాచురల్ స్టార్ నాని మీద ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి ఇపుడు కోలీవుడ్లొ ఓ సినీ ప్రముఖుడి మీద తన బాణాలను ఎక్కుపెట్టింది. ఆ సినీ ప్రముఖుడు ఎవరో కాదు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి స్వయంగా మనవడు, ఇపుడు డీఎంకే అధినేత స్టాలిన్ కి కొడుకు, డీఎంకే యువ విభాగానికి అధినేత.మరి ఉదయ్ నిధి స్టాలిన్ తో కూడా తనకు అఫైర్లు ఉన్నాయని శ్రీరెడ్డి తాజాగా సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.

మూడేళ్ళ క్రితం హైదరాబాద్ గ్రీన్ పార్క్ హొటల్లో నీవు నేను గడిపిన రాత్రి బాగా గుర్తుందా స్టాలిన్ అంటూ శ్రీరెడ్డి తాజాగా వేసిన బాణం ఇపుడు కోలీవుడ్ కే గుచ్చుకుంది. నాడు ఎన్నో చెప్పావ్, అవకాశాలు ఇస్తానని చెప్పావ్. మూడేళ్ళు అయింది చాన్సులు ఎక్కడ అంటూ స్టాలిన్ ని నిలదీసింది. మరి దీనికి కొసమెరుపుగా ఆ రాత్రి చాలా బాగుందని నీవు ఎప్పటికీ మరువలేకపోతున్నావ్ కదూ అంటూ బిగ్ ట్విస్ట్ స్టాలిన్ కి ఇచ్చింది. మరి శ్రీరెడ్డి లిస్ట్ లో ఇంకా ఎంతమంది ఉన్నారో వారు గుట్టు ఎపుడు రట్టు అవుతుందో.

ఏది ఏమైనా శ్రీరెడ్డి వ్యవహారంలో తప్పు ఎటువైపు ఉన్నా కామన్ జనాలు మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలా ఉంటుందా అన్నది మాత్రం నమ్ముతున్నట్లుగానే ఉంది. ఇకపై ఎవరు కాస్టింగ్ కౌచ్ విషయంలో ఎలాంటి అడుగు వేయాలనుకున్నా కూడా జాగ్రత్త అని చెప్పడానికి మాత్రం శ్రీరెడ్డి ఉదంతం పెద్ద ఉదాహరణ అని చెప్పుకోవాలి. కాస్టింగ్ కౌచ్ అన్నది లేకుండా ఉంటే బాగుండును అనుకున్నవారంతా మౌనంగానే శ్రీరెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు.
Spending one night with the grandson of former CM ... Another sensation thrown by Sri Reddy

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...