ఆ సీనియర్ హీరో సైలెంట్ గా పూర్తి చేశాసాడే

Akkineni-Nagarjuna-Completed-Shootiong-For-His-Upcoming-Movie-Andhra-Talkies.jpg
ఒక  సీనియర్  హీరో సినిమా మొదలవుతుందంటే అంతో ఇంతో హంగామా ఉంటుంది. ఓపినింగ్ కే భారీగా ఖర్చు అవుతుంది. ఫ్యాన్స్ కి కూడా ఓపినింగ్ నుండే సినిమా అప్డేట్స్ అందుతాయి. అయితే ఇవన్నీ పక్కన పెట్టి నాగార్జున సినిమా మొదలెట్టేసి ఒక షెడ్యుల్ కూడా పూర్తి చేసేసాడు. అవును సోలోమన్ అనే దర్శకుడితో సినిమా చేస్తున్న నాగ్ ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా ఓల్డ్ సిటీలో ఐదు రోజుల పాటు ఓ స్మాల్ షెడ్యుల్  ఫినిష్  చేసేశాడు.

నిజానికి నాగ్ కి ఈ ఇయర్ హీరోగా అస్సలు కలిసి రాలేదు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న 'మన్మథుడు 2' డమాల్ అనిపించుకుంది. బాక్సాఫీస్ దగ్గర ఎవరూ ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. అందుకే ఎక్కువ హంగామా లేకుండానే నెక్స్ట్ సినిమా ను సైలెంట్ గా మొదలెట్టేసాడేమో అనిపిస్తుంది. అయితే సినిమాలో నాగ్ పోలిస్ పాత్రలో నటిస్తున్నాడు. సినిమాలో తిప్పి కొడితే నాగ్ ది ఇరవై నిమిషాల పాత్ర అనే టాక్ కూడా ఉంది.అయితే నాగ్ ఈ కథను ఎంచుకోవడానికి రైటర్ ని డైరెక్టర్ గా పరిచయం చేయడానికి ఓ స్ట్రాంగ్ రీజన్ ఉండే ఉంటుంది. అదేంటనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకూ ఆగాల్సిందే. మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కంటే ముందే ఈ సినిమాను థియేటర్స్ లోకి తీసుకు రావాలని చూస్తున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...