హన్సికలో అన్ని కోణాలు ఉన్నాయా?

Romanti-Poster-from-Simbu-and-Hansika-Maha-Movie-Andhra-Talkies
ఆపిల్ అందం హన్సిక కు కొన్నేళ్లగా కలిసి రావడం లేదు. సినీ ఛాన్సులున్నా సక్సెస్ లు అందుకోవడంలో వెనుకబడుతోంది. సీనియారిటీ అవకాశాలు తెస్తున్నా! సక్సెస్ ల పరంగా  నేటి తరం నాయికలతో పోటీ పడలేకపోతుంది. ప్రస్తుతం కోలీవుడ్ లో మహా- పార్టనర్ అనే రెండు సినిమాల్లో నటిస్తోంది.  రెండు సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. అయితే ముందుగా మహా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే శర వేగంగా చిత్రీకరణ పూర్తిచేసే పనిలో ఉంది యూనిట్. ఇటీవలే ప్రచారంలో భాగంగా హన్సిక పోస్టర్లను రిలీజ్ చేసారు. హాన్సిక డిఫరెంట్ షెడ్స్ ఉన్న గెటప్ లలో దర్శనమిచ్చిన పోస్టర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో  వైరల్ గా  మారాయి.స్వామీజీ అవతారం ఎత్తి 135 డిగ్రీల కోణంలో కుర్చీలో కూర్చొని నోట్లోంది గుప్పు గుప్పుమంటూ పొగ వదులతోన్న స్టిల్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అసలైన  స్వామీజీలంతా హాన్సిక చిత్ర యూనిట్ పై భగ్గుమన్నారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ హన్సికను తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. అటుపై రక్తంతో నిండిన బాత్ టబ్ లో గన్ను పట్టుకుని పొగరుగా చూస్తూ పడుకున్న స్టిల్ జోరుగా వైలర్ అయింది. తాజాగా అమ్మడు కుర్రాళ్లను హీటెక్కించే పోస్టర్ తో ముందుకొచ్చింది.

పోస్టర్ లో మాజీ ప్రియుడు శింబుతో ఘాటైన రొమాన్స్ లో మునిగిపోతున్నట్లు రివీల్ చేసారు. ఇందులో శింబు ఓ క్యామియో పోషిస్తున్నాడు. ఇద్దరి మధ్య గతంలో పీకల్లోతు ప్రేమ సాగిన నేపథ్యంలో పోస్టర్ పై ఆసక్తి నెలకొంది. వ్యక్తిగతంగా ఇద్దరు  విడిపోయినా  సినిమాలో మాత్రం మళ్లీ రెచ్చి పోయారంటూ నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...