సన్యాసిని అవ్వాలనుకుని ఈ వేషాలా?

Sexy-Heroin-Jacqueline-Fernandez-wanted-to-be-a-nun-Andhra-Talkies
డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన వాళ్లు.. ఇంజినీర్ కాబోయి డైరెక్టర్ అయిన వాళ్లను చూసాం కానీ.. సన్నాసిని కాబోయి కథానాయిక అయినవాళ్లను ఎక్కడైనా చూశారా?  ప్చ్.. అలాంటావిడను మీకు పరిచయం చేయాల్సిందే.

ఇంతకీ ఎవరావిడ? అంటే.. ఇంకెవరూ జాకీ అలియాస్ జాక్విలిన్. సాహో చిత్రంలో ఒకే ఒక్క బ్యాడ్ బోయ్స్.. స్పెషల్ నంబర్ తో కుర్రాళ్ల కళ్లను కట్టి పడేసిన ఈ బ్యూటీ గతం పరిశీలిస్తే ఊహించని షాక్ తగుల్తుంది. అసలు సన్యాసినులు తిరిగే చోట స్తోత్రం అంటూ ప్రార్ధనలు జరిపే చోట పెరిగిన ఈ అమ్మడు ఉన్నట్టుండి బోయ్స్ వాలు చూపుల గాలానికి చిక్కుకుని విలవిలలాడిందట. మనసు ఏకాగ్రత గతి తప్పాయని చెప్పింది.ఈ సంగతిని జాకీనే  స్వయంగా ఫేమస్ నేహా ధూపియా చాట్ షోలో చెప్పింది. సన్నాసిని అయ్యే  క్రమంలోనే ఒక చూపు అటు బోయ్స్ వైపు ప్రసరించిందట. అంతే ఆ తర్వాత క్రష్ లు.. ప్రేమలు వగైరా వగైరా పుట్టుకొచ్చాయిట. దాంతో తాను నన్ కాలేకపోయానని తెగ ఇదైపోయింది. నేహా ధూపియా పాడ్ కాస్ట్ కొత్త ఎపిసోడ్ నేడు టీవీలో టెలీకాస్ట్ కానుంది.

``జాకీ కాన్వెంట్ స్కూలింగ్ అంతా నన్స్ తోనే. ప్రతిరోజూ చర్చిలో ప్రార్థనలు చేసేదానిని. జీవితంలో బోలెడంత గాస్పెల్ స్టఫ్ ఉందిలే!`` అంటూ జాకీ చెప్పుకొచ్చింది. ఈ డ్యాన్సులు.. యాక్టింగ్ పిచ్చి మొదలయ్యాకే అవన్నీ పోయాయని.. ఎప్పుడైతే బోయ్స్ వైపు మనసు మళ్లిందో క్రష్ మొదలైందో అప్పుడు తనలోని నన్ ఎగిరిపోయిందని జాకీ చెప్పి షాకిచ్చింది. ఒకవేళ జాక్విలిన్ నన్ అయ్యి ఉంటే ఈరోజు కుర్రాళ్లంతా చాలా మిస్సయిపోయి ఉండేవారేమో!!

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...