Villa (Pizza 2) Telugu Full Movie | చూస్తున్నంతసేపు సస్పెన్స్ ను రగిలించే మూవీ "విల్లా"

Villa (Pizza 2) - Telugu Full Movie
హీరో ఒక క్రైమ్ రచయితగా పేరు తెచ్చుకోవాలనుకుంటాడు. అయితే తండ్రి కోరిక మేరకు బిజినెస్ ప్రారంభించి.. నష్టపోయి ఆస్తులన్నీ కోల్పోయే పరిస్థితి వస్తుంది. అప్పటికే హీరో తల్లి కారు యాక్సిడెంట్ లో చనిపోవడం, అతని తండ్రి కోమాలోకి పోయి చనిపోవడం జరిగిపోతుంది. 

ఆర్ధిక ఇబ్బందులలో సతమతమవుతున్న హీరోకి ఫ్యామిలీ లాయర్ వచ్చి మీకు వైజాగ్ లైట్ హౌస్ దగ్గర ఒక విల్లా ఉండేదని మీ నాన్నగారు అక్కడే గడిపేవారని, తరువాత ఆ విల్లాలో ఏం జరిగిందో తెలియదని.. మీ నాన్నగారు మాత్రం ఆ విల్లాకు వెళ్ళడం మానివేశారని చెప్తాడు. అంతే కాకుండా ఆ విల్లా అమ్మేస్తే మీ అప్పుల బాధలన్నీ తీరిపోతాయని సలహా ఇస్తాడు.

థియేటర్లు తెరవడంపై తెలుగు రాష్ట్రాల్లో అనిశ్చితి

 థియేటర్లు తెరవడంపై తెలుగు రాష్ట్రాల్లో అనిశ్చితి

Uncertainty-in-Telugu-states-over-opening-of-theaters-andhra-talkies
రాష్ట్రాలు థియేటర్లు తెరిచేందుకు మానసికంగా సిద్ధంగా ఉన్నాయా? లేవా? జనం థియేటర్లు తెరిస్తే సినిమాలు చూసేందుకు బయటకు వస్తారా రారా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. రేపటి నుంచి సస్పెన్స్ కి తెర దించేస్తారేమోనన్న చర్చ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు ఏపీలో రేపటి నుంచి థియేటర్లు తెరవరు. తెలంగాణలో తెరుస్తారా లేదా? అన్నదానిపై సమాచారం రాలేదు.


అన్ లాక్ 5.0 లో భాగంగా అక్టోబర్ 15 నుంచి దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను తిరిగి తెరవడానికి కేంద్రం అనుమతించింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తిరిగి తెరవడంపై ఇంకా చాలా అనిశ్చితి నెలకొని ఉంది. ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుండి థియేటర్లు తెరుచుకోవడం లేదు. దీనిని థియేటర్ యాజమాన్యాలు అధికారికంగా ధృవీకరించనున్నాయట.

లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన హాజరైన ప్రముఖ దర్శకుడు..!

bollywood-director-Anurag-Kashyap-issued-summons-to-be-present-for-questioning-in-rape-case
తెలుగులో 'ప్రయాణం' 'ఊసరవెల్లి' వంటి సినిమాల్లో నటించిన హీరోయిన్ పాయల్ అగర్వాల్.. ఇటీవల బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ పై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడని.. తనను రూమ్ లోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడని ముంబైలోని వెర్సోవా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అనురాగ్ కశ్యప్ పై ఐపీసీ సెక్షన్లు 376 (ఐ) (అత్యాచారం) - 354 (మహిళపై దాడి లేదా క్రిమినల్ ఫోర్స్) - 341 మరియు 342 (నిర్బంధం) కింద ఎఫ్ ఐఆర్ నమోదు చేయబడింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1న ఉదయం 11 గంటలకు పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని పోలీసులు దర్శకుడికి సమన్లు జారీ చేశారు.

27 ఏళ్ల కుర్రాడు అరెస్ట్.. కేసు బుక్ చేసిన సోనాక్షి

Bollywood Breaking-Sonakshi-Sinha-files-FIR-against-cyber-bullies--One-Arrested
27 ఏళ్ల కుర్రాడు అరెస్ట్.. కేసు బుక్ చేసిన సోనాక్షి
సోషల్ మీడియాల్లో ఇష్టానుసారం బూతులు మాట్లాడేస్తూ నచ్చిన భాషను ఉపయోగించేస్తే సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ చూస్తూ ఊరుకోదు. దూషణలు .. పరాచికాలకు దిగినా .. వేధింపులకు పాల్పడినా ఫిర్యాదు మేరకు వెంటనే అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ తరహాలో ఆకతాయిలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే అరెస్టులు చేసి జైల్లో వేశారు. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పైనా బూతు పదజాలంతో వల్గర్ పోస్టులు పెట్టి అడ్డంగా బుక్కయ్యాడు ఈ 27 ఏళ్ల కుర్రాడు.

సోనాక్షిని ఇష్టానుసారం దూషిస్తూ ఇష్టానుసారం పోస్టింగులతో చెలరేగిన ఆయువకుడు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందినవాడని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.  తనపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నాడని ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగిన పోలీసులు ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి పేరు శశికాంత్ గులాబ్ జాదవ్.

భర్తలు అంతా రాత్రి 30 నిమిషాల పాటు భార్యల కాళ్లు నొక్కాలంటున్న స్టార్ హీరోయిన్

Sexy-Heroin-Bipasha-made-some-interesting-comments-on-a-talk-show-andhra-talkies
భర్తలు అంతా రాత్రి 30 నిమిషాల పాటు భార్యల కాళ్లు నొక్కాలంటున్న స్టార్ హీరోయిన్
బాలీవుడ్ లో సుదీర్ఘ కాలం ఒక ఊపు ఊపేసి స్టార్ హాట్ హీరోయిన్ గా కొనసాగిన ముద్దుగుమ్మ బిపాస బస్సు ప్రస్తుతం వైవాహిక జీవితంలో పడిపోయింది. ఈ సమయంలో కూడా ఆమె సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపడంతో పాటు రెగ్యులర్ గా ఏదో ఒక షోలో కనిపిస్తూనే ఉంది. గత కొంతకాలం నుంచి వెబ్ సిరీస్సుల్లో కూడా తన మార్క్ చూపెడుతూ పేక్షకులను ఉర్రూతలూగిస్తూనే ఉంది.. నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ ను పెళ్లి చేసుకున్న బిపాస బస్సు తన భర్తతో కలిసి పలు చిత్రాల్లో నటించింది. భర్తతో నటించడం అనేది తనకు చాలా ఇష్టమైన విషయం అంది. ఆయనతో కలిసి నటించడం చాలా సులభంగా అనిపిస్తుంది.

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘మర్డర్’ సినిమాపై తీర్పు వాయిదా

Judgment-on-Ramgopal-Varma-Movie-Murder-postponed-Andhra-Talkies
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘మర్డర్’ సినిమాపై తీర్పు వాయిదా
మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘మర్డర్’ పేరుతో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తన జీవితంపై సినిమా చేస్తున్న నిర్మాతలకు ప్రణయ్ భార్య అమృత గతంలోనే కోర్టు ద్వారా నోటీసులు పంపింది. అనుమతులు లేకుండా తన కథ ఆధారంగా సినిమా తీస్తున్నారంటూ ఆమె నల్లగొండ జిల్లా కోర్టులో పిటీషన్ వేశారు. మర్డర్ సినిమా విడుదల ఆపాలని.. పబ్లిసిటీ ఆపమని కోరుతూ కోర్టును అమృత కోరారు. ఈ మేరకు కోర్టు ద్వారా మర్డర్ సినిమా నిర్మాతలు నట్టి క్రాంతి నట్టి కరుణలకు నోటీసులు పంపారు.

ఈనెల 6న నిర్మాతలు కోర్టుకు హాజరై వారి వాదనను తెలుపాలని కోర్టు నోటీసుల్లో పేర్కొంది. ‘మర్డర్’ సినిమా ట్రైలర్ ను ఇప్పటికే వర్మ విడుదల చేయగా.. అది వైరల్ అయ్యింది. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు వర్మ ప్లాన్ చేయగా అమృత కోర్టుకు వెళ్లి అడ్డుకుంటోంది.

సుశాంత్ ను కుక్క బెల్డ్ తో హత్య చేశారు

Hero-Sushant-was-killed-with-a-dog-belt-Andhra-Talkies
సుశాంత్ ను కుక్క బెల్డ్ తో హత్య చేశారు
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ హత్య కేసు ప్రస్తుతం బాలీవుడ్ వర్గాలను కుదిపేస్తుంది. బలవంతపు ఆత్మహత్య అంటూ కొందరు కాదు ఖచ్చితంగా హత్య అంటూ మరికొందరు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ కేసు సీబీఐ వారికి అప్పగించాల్సిందే అంటూ సుశాంత్ రాజ్ పూత్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమయంలో సుశాంత్ వద్ద గతంలో ఉద్యోగం చేసిన అంకిత్ ఆచార్య షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఈమద్య కాలంలో అంకిత్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఇటీవల రియాపై ఆయన చేసిన వ్యాఖ్యలు సుశాంత్ మరణంపై ఉన్న అనుమానాలను మరింతగా పెంచాయి. ఇప్పుడు అతడు ఏకంగా సుశాంత్ ను హత్య చేసి ఉంటారు అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. సుశాంత్ ఇంట్లో ఉండే పెంపుడు కుక్క ఫడ్జ్ కు ఉండే బెల్డ్ తో అతడి గొంతును బిగించి కొట్టి హత్య చేసి ఉంటారు అంటూ అంకిత్ ఆరోపిస్తున్నాడు. అతడి శరీరంపై ఉన్న గాయాలను చూస్తుంటే అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో సుశాంత్ వద్ద పని చేసే పలువురిని రియా చక్రవర్తి తొలగించింది. కారణం లేకుండా వారిని తొలగించడంతో పాటు తనకు నమ్మకస్తులు అయిన వారిని ఉద్యోగంలో పెట్టిందని అంకిత్ అంటున్నాడు.

ఈసారి హీరోనే విలన్ వర్మ శిష్యుడి మరో ప్రయోగం!

ఈసారి హీరోనే విలన్ వర్మ శిష్యుడి మరో ప్రయోగం!

heroine-another-experiment-villain-Andhra-Talkies
ఈసారి హీరోనే విలన్ వర్మ శిష్యుడి మరో ప్రయోగం!
అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఎక్స్ 100 చిత్రం ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే! దర్శకుడిగా విమర్శకుల నుండి సైతం ప్రశంసలు అందుకున్నాడు. సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుండి వచ్చిన ఈ దర్శకుడు విభిన్న చిత్రాలను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అందరిలా కాకుండా విభిన్న స్థాయిలో సినిమాలు తీసి గురువును మించిన శిష్యుడు అనిపించుకోవాలని చూస్తున్నాడు. అందులో భాగంగానే తన సెకండ్ మూవీ ‘మహసముద్రం’ను చాలా విభిన్నంగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా కథ విభిన్నంగా ఉండటంతో పాటు పాత్ర ఛాలెంజింగ్ గా ఉండటంతో ఇద్దరు ముగ్గురు హీరోలు ఓకే చెప్పి ఆ తర్వాత వర్కౌట్ అయ్యేనో లేదో అంటూ తప్పుకున్నారు. చివరకు శర్వానంద్ మహాసముద్రంను ఈదేందుకు సిద్దం అయ్యాడు.

నాకు కరోనా వస్తే ప్లాస్మా డొనేట్ చేస్తా : విజయ్ దేవరకొండ

నాకు కరోనా వస్తే ప్లాస్మా డొనేట్ చేస్తా : విజయ్ దేవరకొండ

Tollywood-Hero-Vijay-Devarakonda-Launched-Plsma-Donar-Poster-Andhra-Talkies
నాకు కరోనా వస్తే ప్లాస్మా డొనేట్ చేస్తా : విజయ్ దేవరకొండ
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మనదేశంలో సంపూర్ణ లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే రికవరీ రేటు మెరుగ్గా ఉండడం ఆశాజనకంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో కరోనాని జయించి ఇంటికి వెళ్లిన పేషెంట్స్ తప్పనిసరిగా తమ ప్లాస్మాను ఇచ్చి సాటి మనుషుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. ప్లాస్మా డొనేషన్ కోసం ఎదురుచూస్తున్న కరోనా బాధితులకు కాపాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాను జయించి ప్లాస్మా డొనేట్ చేసిన వారిని సీపీ సజ్జనార్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆఫీసీలో సన్మానించారు. ఈ సందర్భంగా చీఫ్ గెస్ట్ గా హాజరైన విజయ్ దేవర కొండ ప్లాస్మా డోనార్స్ పోస్టర్ ను లాంచ్ చేసారు.

దేవసేన నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా.. మరి ఎందుకు నో చెప్పింది..?

దేవసేన నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా.. మరి ఎందుకు నో చెప్పింది..?

anushka-next-project-andhra-talkies
దేవసేన నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా.. మరి ఎందుకు నో చెప్పింది..?
లాక్ డౌన్ వలన గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీలో విడుదల కావల్సిన సినిమాలన్ని వాయిదా పడ్డాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే మరికొన్ని నెలల వరకు థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇక టైం దొరికింది కదా.. జనాలు ఓటిటిలకు అలవాటు పడిపోయారు. ఈ ఛాన్సులను క్యాష్ చేసుకునేందుకు అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటిటి సంస్థలు విడుదల కాకుండా నిలిచిన సినిమాల హక్కులను సొంతం చేసుకుంటున్నాయి. ఇక ప్రస్తుతం విడుదల కాకుండా ఆగిపోయింది అనుష్క మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్ 'నిశ్శబ్దం'. నిజానికి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు చందాల ప్రాతిపదికన పనిచేస్తాయి కానీ రెవిన్యూ షేరింగ్ ప్రాతిపదికన కాదు. అందుకే డిజిటల్ హక్కుల కోసం భారీగా డబ్బును ఖర్చు చేస్తే.. భారీ నష్టాలే మిగులుతాయి తప్ప భారీగా లాభాలను మాత్రం పొందలేరు.

ప్రభాస్ చొరవతో ఛాన్స్ దక్కించుకున్న దర్శకుడు!

ప్రభాస్ చొరవతో ఛాన్స్ దక్కించుకున్న దర్శకుడు!

Chance-for-that-director-with-bahubali-hero-Prabhas-initiative-andhra-talkies
ప్రభాస్ చొరవతో ఛాన్స్ దక్కించుకున్న దర్శకుడు!
బాహుబలి చేస్తున్న సమయంలో సుజీత్ తో సినిమాకు ప్రభాస్ కమిట్ అయ్యాడు. దాదాపు మూడు సంవత్సరాల పాటు ప్రబాస్ కోసం వెయిట్ చేయడంతో పాటు రెండు సంవత్సరాల పాటు సాహో చిత్రాన్ని సుజీత్ తెరకెక్కించాడు. అంటే సాహో చిత్రం కోసం తన కెరీర్ లో దాదాపు అయిదు సంవత్సరాలను సుజీత్ ఖర్చు చేశాడు. సాహో చిత్రం సౌత్ లో కాస్త అటు ఇటు అయినా బాలీవుడ్ లో మాత్రం ప్రభాస్ కు మంచి పేరు తెచ్చి పెట్టింది. బాహుబలితో వచ్చిన పేరును మరింతగా పెంచడంలో సాహో కీలకంగా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

సాహో వంటి మంచి సినిమాకు తనకు ఇచ్చిన సుజీత్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ప్రభాస్ సాయం చేశాడు. సుజీత్ వద్ద ఉన్న ఒక కథ నచ్చడంతో తన హోం బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ లో దాన్ని నిర్మించేందుకు వంశీ మరియు ప్రమోద్ లను ఒప్పించాడు. దాంతో పాటు శర్వానంద్ మరియు గోపీచంద్ లను ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పించాడట. గోపీచంద్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ లో రూపొందబోతున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో శర్వానంద్ గెస్ట్ గా కనిపించబోతున్నాడట. ఈ కాంబో సెట్ అవ్వడానికి పూర్తి కారణం ప్రభాస్ అంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

లంగా ఓణిలో కాజల్ అగర్వాల్ ను చూస్తే అంతే సంగతులు!

లంగా ఓణిలో కాజల్ అగర్వాల్ ను చూస్తే అంతే సంగతులు!

Sexy-heroin-Kajal-Looking-Gorgeous-In-Saree-andhra-talkies
లంగా ఓణిలో కాజల్ అగర్వాల్ ను చూస్తే అంతే సంగతులు!
చందమామ చిత్రంతో కాజల్ అగర్వాల్ తెలుగులో మంచి గుర్తింపు దక్కించుకుంది. అంతుకు ముందు చేసిన సినిమాల కంటే చందమామతోనే కాజల్ కు ఎక్కువగా పేరు వచ్చింది. అందుకే కాజల్ ను చందమామ బ్యూటీగానే అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు. అంతటి స్టార్ డం దక్కించుకున్న కాజల్ అగర్వాల్ దాదాపు పుష్కర కాలం పాటు టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. ఇప్పటికి కూడా మంచి ఆఫర్స్ తో కెరీర్ లో సాగుతోంది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య చిత్రంలో కమల్ హాసన్ తో ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్న ఈ అమ్మడు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. మరో అయిదేళ్ల వరకు ఈ అమ్మడి స్టార్ డం ఇలాగే ఉంటుందనిపిస్తుంది. తాజాగా హెయిర్ డ్రస్సర్ సీమ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫొటో వైరల్ అవుతోంది.

ఒక సినిమా షూటింగ్ సందర్బంగా కాజల్ మేకప్ అవుతోంది. నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్న కాజల్ లంగా ఓణిలో నిజంగానే చందమామ మాదిరిగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చందమామ అంతటి వెలుగు నీలో ఉంది కాజల్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

RGV సినిమా "పవర్ స్టార్" ముందు "పరాన్న జీవి" ఎగిరిపోయింది!

RGV సినిమా "పవర్ స్టార్" ముందు "పరాన్న జీవి" ఎగిరిపోయింది!

the-paranna-jeevi-flew-in-front-of-rgv-movie-power-star
RGV సినిమా "పవర్ స్టార్" ముందు "పరాన్న జీవి" ఎగిరిపోయింది!
జనసేనాని పవన్ కల్యాణ్ రాజకీయ వైఫల్యంపై ఆర్జీవీ తీసిన సెటైరికల్ మూవీ `పవర్ స్టార్` జూలై 25న రిలీజైన సంగతి తెలిసిందే. అదేరోజు ఆర్జీవీపై సెటైర్ వేస్తూ నూతన్ నాయుడు దర్శకత్వంలో పవన్ అభిమానులు తీసిన `పరాన్నజీవి` చిత్రం రిలీజైంది. అయితే ఈ రెండిటిలో ఏది బెస్ట్ రిజల్ట్ అందుకుంది? ఎవరు ఎంత సంపాదించారు? అంటే.. అంతా ఊహించినట్టే `పవర్ స్టార్` ఏటీటీ వేదికపై సక్సెస్ సాధించిందని ప్రచారమవుతోంది. ఈ సినిమా ఏకంగా రెండు కోట్లు వసూలు చేసిందన్నదే షాకింగ్ న్యూస్. అసలు ఏటీటీ కంటెంట్ అన్న పేరుకు తగ్గట్టే ఇది పూర్తి నిడివి సినిమా కానే కాదు. కేవలం 10-12 సన్నివేశాల సమాహారంగా ఒకదానివెంట ఒకటిగా ఎపిసోడ్లు అల్లినట్టు తీసిన 37 నిమిషాల నిడివి లఘు చిత్రంలాగా కనిపిస్తుంది.

రకరకాల వివాదాల్ని క్రియేట్ చేసి ఆర్జీవీ తెచ్చిన హైప్ నడుమ పవర్ స్టార్ సినిమాని మొదటి రోజు జనం బాగానే చూశారు. అయితే అదే రోజు మధ్యాహ్నానికే ఒరిజినల్ క్వాలిటీతో పవర్ స్టార్ మూవీని జనం పైరసీ వీడియోలో చూశారు. ఇది నిజంగా పెద్ద దెబ్బ కొట్టిందన్న విశ్లేషణ సాగుతోంది. అనవసర ఖర్చు లేకుండా పరిమిత బడ్జెట్ తో తీసిన పవర్ స్టార్ ఆర్జీవీ బృందానికి లక్షల్లో లాభాలు తెచ్చిందని విశ్లేషణ సాగుతోంది.

Lady director deceived by the love magic of a stranger | ఓ అపరిచితుడి ప్రేమ మాయలో మోసపోయిన లేడీ డైరెక్టర్

ఓ అపరిచితుడి ప్రేమ మాయలో మోసపోయిన లేడీ డైరెక్టర్ 

Lady director deceived by the love magic of a stranger
Lady director deceived by the love magic of a stranger
ఆమె ఒక ప్రముఖ అసిస్టెంట్ డైరెక్టర్..ఎంతో మంది సీనీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాలు తీసిన ఆ అసిస్టెంట్ డైరెక్టర్ కే సినిమా చూపించాడో ఫేస్ బుక్ తో పరిచయమైన దొంగ ప్రేమికుడు.. ఈ కేటుగాడు ఆ అసిస్టెంట్ డైరెక్టర్ని నిండా ముంచి లక్షల రూపాయలు లాక్కున్నాడు. ఆమెను శారీరకంగానూ, ఆర్ధికంగానూ వాడేసుకున్నాడు.

కర్ణాటక లోని బెంగళూరు నగరంలో ఉన్న మారుతినగర్ లో నివాసం ఉంటున్న 32 ఏళ్ల అందమైన అసిస్టెంట్ డైరెక్టర్ కన్నడ శాండిల్ వుడ్ లోని ప్రముఖ దర్శకుడి దగ్గర సహాయ దర్శకురాలిగా పనిచేస్తోంది. దర్శకురాలిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది.

ఈమెకు 2018లో ఫేస్ బుక్ ద్వారా ఓ యువకుడు పరిచయమయ్యాడు. పరిచయం స్నేహంగా మారి ఒకరోజు ఇద్దరూ కలుసుకున్నారు. ప్రేమ పేరుతో ఆ సహాయ దర్శకురాలిని యువకుడు ముగ్గులోకి దించాడు. పెళ్లి చేసుకుంటానని.. శారీరకంగా దగ్గరయ్యాడు. యువతితో ఎంజాయ్ చేస్తూ ఆమె దగ్గర అవసరాల కోసం లక్షల రూపాయలు తీసుకున్నాడు.

తన పరువాలను చూస్తూ ఉండిపో.. అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ!

తన పరువాలను చూస్తూ ఉండిపో.. అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ!
Stay-tuned-for-more-Ismart-Beauty-Andhra_talkies
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరంటే వారు హీరోయిన్ అయిపోరు. కొందరేమో అదృష్టం కొద్ది హీరోయిన్ అవుతారు. మరికొందరేమో ముందే అనుకొని హీరోయిన్ అవుతారు. ఇంకొందరేమో ఎక్స్పెక్ట్ చేయకుండానే హీరోయిన్ అయిపోతారు. ఇందులో రెండో కోవకు చెందిందే నిధి అగర్వాల్. అంటే ఈ అమ్మడు చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలని కలలు కంటూ పెరిగింది. అనుకున్నట్లుగానే మోడలింగ్ లో రాణించి సినిమా అవకాశాలు చేజిక్కించుకుంది. మున్నా మైకేల్ సినిమాతో హీరోయిన్ అయిన ఈ భామ ఆ వెంటనే సౌత్ ఇండస్ట్రీ వైపు మళ్ళింది. కానీ కొందరు హీరోయిన్లకి పట్టుదల పరువాలతో పాటు అదృష్టం కూడా కొంత కావాల్సి ఉంటుంది. నిధి విషయంలో మాత్రం అదృష్టం ఆవగింజంత కూడా లేదనే అనిపిస్తుంది. ఎందుకంటే నిధి ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఆమెకు కొంచం కూడా గుర్తింపు తీసుకు రాలేకపోయాయి.

అయితే తెలుగులో గతేడాది ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మొదటి హిట్టును తన ఖాతాలో వేసుకుంది నిధి. ఈ సినిమాతో గ్లామర్ డోస్ విపరీతంగా పెంచేసింది. ముఖ్యంగా జిల్లెలమ్మ జిట్టా.. ఉండిపో లాంటి పాటలలో ఆమె అందాల ఆరబోత మాములుగా లేదు. అందుకే కుర్రకారు అలా ప్లాట్ అయిపోయారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఇంటికే పరిమితం అయిన నిధి.. సోషల్ మీడియాలో వేడెక్కించే ఫోటోలు పోస్ట్ చేస్తుంది. ఫ్యాషన్ డ్రెస్సింగ్ స్టైల్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఈ భామ.. తాజాగా బ్లాక్ డ్రెస్ లో పిక్ పెట్టింది. అంతే అభిమానులకు కన్నుల పండుగే అవుతుందని చెప్పాలి. ఆ మోడరన్ డ్రెస్సులో అమ్మడి అందాలు కనిపించి కనిపించినట్లు.. చూపించి చూపించనట్లుగా ఊరిస్తున్నాయి. మరి కుర్ర హృదయాలు ఊరుకుంటాయా.. అలా కళ్లప్పగించి ఉండిపోతున్నారంతే. ప్రస్తుతం అమ్మడు గల్లా జయదేవ్ కొడుకు అశోక్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న కొత్త సినిమాలో నటిస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం భారీ ఖర్చుతో బ్యాంకు సెట్.. సిద్దమైందా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం భారీ ఖర్చుతో బ్యాంకు సెట్.. సిద్దమైందా..?
bank-set-at-huge-cost-for-Super-Star-Mahesh-babu-ready-Andhra_talkies
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో మహేష్ మరోసారి తన బాక్సాఫీస్ సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నాడు. పరశురామ్ - మహేష్ బాబుల కాంబినేషన్ ఖచ్చితంగా వెరైటీగా ఉండబోతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ సర్కారు వారి పాట టైటిల్ అయితే విపరీతంగా బజ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా చిత్ర యూనిట్ టైటిల్ పోస్టర్ విడుదల చేయగానే ప్రేక్షకుల నుండి ఊహించని రేంజిలో స్పందన లభించింది. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల పోస్టర్ విడుదల కాగా ఇందులో మహేష్ లాంగ్ హెయిర్ లైట్ బియర్డ్ తో ఇంతక ముందెప్పుడూ చూడని మాస్ లుక్‌లో కనిపించి కిక్ ఇచ్చాడు.

మధుబాబు 'షాడో' ని దృశ్యరూపంలోకి తీసుకురానున్న ప్రముఖ నిర్మాత...!

మధుబాబు 'షాడో' ని దృశ్యరూపంలోకి తీసుకురానున్న ప్రముఖ నిర్మాత...!

Leading-producer-Making-Madhu-babu-Shadow-into-screen-Andhra-Talkies
ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర 'బిందాస్' సినిమాతో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సినిమాలు తీయడం స్టార్ట్ చేసారు. ఈ బ్యానర్ పై 'అహనా పెళ్ళంట' 'యాక్షన్ 3డి' 'జేమ్స్ బాండ్' 'ఈడో రకం ఆడో రకం' 'రన్' 'అంధగాడు' 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' 'ఈడు గోల్డెహే' 'రాజుగాడు' 'కిరాక్ పార్టీ' 'సీత' 'చాణక్య' వంటి సినిమాలు నిర్మించారు. అయితే ఈ సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. కాకపోతే కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన 'రాజు గారి గది' 'చందమామ కథలు' సినిమాలు పర్వాలేదనిపించుకున్నాయి. ఒక సినిమా ఫ్లాప్ అయినా పర్వాలేదు కానీ చేపట్టిన ప్రతి ప్రాజెక్టు నష్టాల బాట పట్టిస్తుంటే ఎవరికైనా కష్టమే.. ఇలా వరసబెట్టి సినిమాలన్నీ ఫ్లాపులుగా నిలుస్తుండటంతో అనిల్ సుంకర ఇన్ని నష్టాల మధ్య ఇంకా సినిమాలు నిర్మిస్తారా లేక ఆపేస్తారా అని చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రారంభంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాతో సూపర్ హిట్ అందుకుని సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ క్రమంలో 'బంగారు బుల్లోడు' మరియు అబ్దుల్ కలామ్ బయోపిక్ నిర్మిస్తున్నారు. కాగా ఇప్పుడు అందరూ నిర్మాతలు వెబ్ వరల్డ్ వైపు అడుగులు వేస్తుండటంతో అనిల్ సుంకర కూడా అదే రూట్ లో వెళ్తున్నాడు. దీని కోసం సుప్రసిద్ధ రచయిత మధుబాబు ని ఆశ్రయించాడు.

ఘోరంగా హింసించారు: తండ్రీ కొడుకుల మృతిపై సింగర్ సుచిత్ర

ఘోరంగా హింసించారు: తండ్రీ కొడుకుల మృతిపై సింగర్ సుచిత్ర

Violently-tortured--Singer-Suchitra-on-father-son-death-Andhra-Talkies
ఓవైపు ప్రపంచమంతా అమెరికాలో జాత్యాహంకార హత్యపై నిరసనలు వ్యక్తం చేస్తోంది. జార్జ్ ఫ్లాయిట్ హత్య అమెరికాను కుదిపేస్తోన్న విషయం తెలిసిందే. తమిళనాడులోని టుటికోరిన్లో జరిగిన ఓ తండ్రీకొడుకులు జయరాజ్ ఫినిక్స్ల మృతి కుదిపేస్తోంది. ఈ మృతిపై ప్రముఖ సింగర్ సుచిత్ర స్పందించారు. వారిని దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపించినట్లుగా అర్థమవుతోందని ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు.

జయరాజ్ ఫినిక్స్‌లో మోకాళ్లను స్టిక్స్‌తో విరగ్గొట్టారని ముఖాన్ని గోడకేసి కొట్టారని వారి ఒంటిపై దుస్తులు లేకుండా కొట్టానట్లుగా తెలుస్తోందన్నారు. చెప్పలేని విధంగా హింసించినట్లు తెలిపారు. జస్టిస్ జయరాజ్ ఫీనిక్స్ అంటూ ట్వీట్ చేశారు. దక్షిణాది సమస్యలు ఎప్పుడూ దక్షిణాదికే పరిమితమవుతున్నాయని అందుకు ఇంగ్లీష్‌లో మాట్లాడకపోవడమే ప్రధాన కారణమని వీడియోలో మొదట చెప్పారు. అందుకే ఈ వివరాలను పోలీసుల దాడి ఘటనను ఇంగ్లీష్‌లో వివరించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె జార్జ్ ఫ్లాయిడ్ హత్యను గుర్తు చేశారు.

టాలీవుడ్ లో పాజిటివ్ కేసులున్నా బయటకి చెప్పడం లేదా...?

టాలీవుడ్ లో పాజిటివ్ కేసులున్నా బయటకి చెప్పడం లేదా...?

Tollywood-People-Not-Reveals-New-Dangerous-Virus-Cases-Andhra-Talkies
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా తన ఉగ్రరూపాన్ని చూపిస్తూ వస్తోంది. ఈ వైరస్ అన్ని రంగాలను ప్రభావితం చేస్తూ వస్తోంది. దీని నివారణకు ఎన్నో ప్రయత్నాలు చేసిన ప్రభుత్వాలు కొన్నాళ్ల పాటు ఈ మహమ్మారితో సహజీవనం సాగించాలనే నిర్ణయానికి వచ్చేసారు. దీంతో లాక్ డౌన్ లో సడలింపులు విధిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా కరోనా నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా నిర్వహించడంతో కేసులు కూడా ఎక్కువగా బయటపడుతున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు డాక్టర్లు కరోనా బారిన పడగా తాజాగా సినీ ప్రముఖులకు కరోనా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. నటుడు నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్ గా తేలింది.

షాక్: చందమామ పెళ్లికి గ్రీన్ సిగ్నల్

షాక్: చందమామ పెళ్లికి గ్రీన్ సిగ్నల్

Heroin-Kajal-Agarwal-Talking-About-Her-Marriage-Andhra-Talkies
30 ప్లస్ భామలంతా పెళ్లి కోసం ఆరాటపడుతున్నారా? అంటే అవుననే అర్థమవుతోంది. ఇప్పటికే స్వీటీ అనుష్క శెట్టి .. తమన్నా లాంటి సీనియర్లు పెళ్లి మూడ్ లో ఉన్నారని ప్రచారమవుతోంది. ఈలోగానే చందమామ కాజల్ పెళ్లి గురించి ఆసక్తికర సమాచారం ఫిలింసర్కిల్స్ ని వేడెక్కిస్తోంది. ఇటీవలే 35వ పడిలోకి అడుగుపెట్టేసింది. అందుకే ఇప్పుడు అనూహ్యంగా మూడ్ ఛేంజ్ అయ్యిందట.

ఇంతకుముందు పెళ్లిపై ఆసక్తి లేదని .. ప్రేమ వైఫల్యమే అందుకు కారణమని కాజల్ వెల్లడించినట్టు టాలీవుడ్ మీడియాలో కథనాలొచ్చాయి. ఆ తర్వాత అవన్నీ రూమర్లేనని తేలింది. ఒకవేళ నిజమే అయినా కానీ ఎట్టకేలకు కాజల్ మూడ్ మారిందన్నది ఇన్ సైడ్ టాక్. సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇచ్చి పెళ్లాడేసే ఆలోచనలో ఉందిట చందమామ.

హృదయాలను కలిచి వేస్తున్న సుశాంత్ లాస్ట్ పోస్ట్...!

హృదయాలను కలిచి వేస్తున్న సుశాంత్ లాస్ట్ పోస్ట్...!

Sushant-Singh-Rajput-Last-Post-in-His-Social-Media-Andhra-Talkies
ప్రముఖ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ బయోపిక్ ''ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ'' చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్. ఆయన ఈ రోజు అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం సినీ లోకాన్ని షాక్ కి గురి చేసింది. సుశాంత్ ముంబై బంద్రాలోని తన నివాసంలో ఫ్యాన్ కి ఉరేసుకొని బలవన్మరణం చెందినట్లు గుర్తించారు. 34 ఏళ్ళ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి యావత్ సినీ అభిమనుల హృదయాలను కలచి వేసింది. సుశాంత్ గతకొంత కాలంగా బాంద్రాలోని తన నివాసంలో ఒంటరిగా ఉంటున్నాడు. కొన్ని రోజులుగా అతని మానసిక పరిస్థితి ఏమీ బాగాలేదని.. అందుకే ఉరేసుకుని చనిపోయి ఉండొచ్చని పోలీసుల ప్రాథమిక విచారణలో పేర్కొన్నారు.

కాగా 2008 నుండి అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై తన హవా చూపించిన సుశాంత్ తన నటనతో డ్యాన్స్ లతో అందరినీ ఆకట్టుకున్నాడు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండేవారు. సుశాంత్ సింగ్ జూన్ 3న ఇంస్టాగ్రామ్ లో చివరి పోస్ట్ పెట్టారు. 

సుశాంత్ ఆత్మహత్యపై సీబీఐ దర్యాప్తు?

సుశాంత్ ఆత్మహత్యపై సీబీఐ దర్యాప్తు?

Bollywood-star-Sushant-Singh-Rajput-dead-at-Andhra-Talkies
బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య సంచలనమైన సంగతి తెలిసిందే. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన పరిణామం. ఈ ఆదివారం ఉదయం ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. 34 ఏళ్ల నటుడి మృతికి సంబంధించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు అదనపు పోలీసు కమిషనర్ మనోజ్ శర్మ తెలిపారు.

అయితే ఇది ఆత్మహత్య కాదు.. హత్య!! అంటూ సుశాంత్ మేనమామ ఆరోపించారు. తన మేనల్లుడు ఆకస్మిక మరణంపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. పీఎం నరేంద్ర మోదీ స్వయంగా పూనుకుని సీబీఐ దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేసారు.

మూడు నెలలకు మొదలైన షూటింగుల సందడి..!

మూడు నెలలకు మొదలైన షూటింగుల సందడి..!

Telangana-allows-Tollywood-to-resume-movie-shootings-Andhra-Talkies
ఏపీ-తెలంగాణ ప్రభుత్వాలు షూటింగులకు అనుమతులివ్వడంలో సానుకూలంగా వ్యవహరించడంతో హర్షం వ్యక్తమైంది. మరో వారం రెండు వారాల్లో సినిమాల షూటింగులకు సన్నాహకాల్లో ఉన్నారు దర్శకనిర్మాతలు. ఈలోగా టీవీ సీరియళ్ల షూటింగులు ప్రారంభమయ్యాయి. సెట్స్ కెళ్లేందుకు నటీనటులు సహా కార్మికులు సిద్ధమవ్వడంతో టాలీవుడ్ లో దాదాపు మూడు నెలల విరామం తర్వాత కొత్త కళ కనిపించింది. దాదాపు అరడజను సీరియళ్ల షూటింగులకు ఇప్పటికే సన్నాహకాల్లో ఉన్నాయి యూనిట్లు.

టీవీ సీరియళ్లకు పరిమిత సిబ్బందితో ఫర్వాలేదు కానీ సినిమాల విషయంలోనే కాస్త ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని అంచనా. ఇప్పటివరకూ ఒక్కరూ షూటింగ్ ప్రారంభించలేదు. అందరికంటే ముందుగా జక్కన్న ఆర్.ఆర్.ఆర్ షూట్ ప్రారంభించాలని అనుకుంటున్నారు. మరో వారంలోనే ఆయన సెట్స్ కెళ్లనున్నారు. సక్సెసైతే అతడిని ఫాలో చేసేందుకు ఇతరులు వేచి చూస్తున్నారు.

టాలీవుడ్ లో ఆర్తి అగర్వాల్ విషాదాంతం స్టోరీ

టాలీవుడ్ లో ఆర్తి అగర్వాల్ విషాదాంతం స్టోరీ

Heroin-Arthi-Agarwal-Vardhanthi--Winning-a-Cine-Life-Andhra-Talkies
టాలీవుడ్ లో ఆర్తి అగర్వాల్ విషాదాంతం స్టోరీ
ఆర్తి అగర్వాల్.. తెలుగు తెరపై ఎంత వేగంగా దూసుకొచ్చిందో.. అంతే వేగంగా కనుమరుగైన హీరోయిన్. తక్కువ సమయంలోనే అగ్రహీరోలందరితో కలిసి నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కానీ అనూహ్యంగా గ్రాఫ్ పోగొట్టుకొని ప్రాణాలే కోల్పోయింది.

ఈ మధ్యలోనే ప్రేమ విఫలం కావడం.. వేరే పెళ్లి చేసుకోవడం.. వైద్య చికిత్స వికటించడంతో స్టార్ హీరోయిన్ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఈరోజు ఆర్తి అగర్వాల్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం..

అమెరికాలోని గుజరాతీ కుటుంబంలో మార్చి 5వ తేదీన ఆర్తి అగర్వాల్ జన్మించారు. తండ్రి శశాంక్ వ్యాపారవేత్త. తల్లి వీమా గృహిణి. హీరోయిన్ అవ్వాలన్న ఆశ ఆర్తి అగర్వాల్ లో ఉండేది. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి అమెరికాలో పర్యటించగా.. ఆర్తిని గుర్తించి ప్రశంసించారు. బాలీవుడ్ లో ‘పాగల్ పన్’ చిత్రంతో ఆర్తి సినీ జీవితం ప్రారంభమైంది.

ఆ తర్వాత వెంకటేశ్ తో ‘నువ్వు నాకు నచ్చావ్’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తరుణ్ ఎన్టీఆర్ చిరంజీవితో ‘ఇంద్ర’ ఉదయ్ కిరణ్ మహేష్ బాబుతో బాబీ బాలయ్య తో అగ్రహీరోలందరితో చేసి స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ముద్ర వేసింది.

భారీ ఫైట్స్ కోసం సిద్ధమవుతున్న ఎన్టీఆర్.. తెరపై రచ్చేనట!

భారీ ఫైట్స్ కోసం సిద్ధమవుతున్న ఎన్టీఆర్.. తెరపై రచ్చేనట!

Hero-jr-NTR-preparing-for-the-big-fights-Andhra-Talkies
భారీ ఫైట్స్ కోసం సిద్ధమవుతున్న ఎన్టీఆర్.. తెరపై రచ్చేనట!
తెలుగు స్టార్ హీరోలు ఎన్టీఆర్-రామ్‌చరణ్ కథానాయకులుగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకోవాలని సిద్ధం అవుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. పీరియాడిక్ డ్రామాగా బ్రిటిష్ కాలంలో జరిగిన కథతో దీన్ని రూపొందిస్తున్నారు జక్కన్న. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర రెండు వైవిధ్యమైన షేడ్స్‌ను కలిగి ఉంటుందని ఇదివరకే రాజమౌళి టీమ్ చెప్పింది. ఒక లుక్‌లో ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేయగా మూడో షెడ్యూల్ కోసం ఇంకాస్త బాడీ పెంచే పనిలో ఉన్నాడు తారక్. పాత్ర కోసం ఎంతటి రిస్క్ అయినా చేస్తాడు ఎన్టీఆర్.

అయితే ఎన్టీఆర్‌ను సరికొత్తగా చూపించేందుకు రాజమౌళి అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని టాక్. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిపేసి ఇళ్లకే పరిమితమయ్యారు రాజమౌళి టీమ్.

లాక్ డౌన్ రూల్ బ్రేక్ చేసిన శృంగార తార అరెస్ట్

Sexy-Heroin-Poonam-Pandey-Arrested-For-Violating-Coronavirus-Lockdown-Rules-Andhra-Talkies

లాక్ డౌన్ రూల్ బ్రేక్ చేసిన శృంగార తార అరెస్ట్

అందాల ఆరబోతలో పాశ్చాత్య ధోరణితో రచ్చిపోయే శృంగార తారగా పూనమ్ పాండే స్పీడ్ గురించి తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో శ్రుతిమించిన ఫోటోషూట్లు వీడియో షూట్లను అభిమానులకు షేర్ చేస్తూ ఫాలోయింగ్ ని పెంచుకుంది. నిరంతరం ఏదో ఒక వివాదాస్పద వ్యవహారంతో పూనమ్ టచ్ లో ఉంటుంది. రకరకాల వేడెక్కించే కామెంట్లతో నెటిజనుల నుంచి అక్షింతలు వేయించుకుంది పలుమార్లు. సోషల్ మీడియాల్లో అర్థనగ్న ప్రదర్శనలు.. వేడెక్కించే కామెంట్లు ఇవన్నీ కమర్షియల్ ప్రకటనల ఆదాయ ఆర్జన కోసం పూనమ్ ఆడిన నాటకాలు అంటూ నెటిజనులు ఇప్పటికే గ్రహించారు.

'కేజీఎఫ్'ను అక్రమంగా ప్రసారం చేసిన టీవీ ఛానల్..

'కేజీఎఫ్'ను అక్రమంగా ప్రసారం చేసిన టీవీ ఛానల్..
అసలు ఎలాంటి అంచనాలు లేకుండా దేశంలో చరిత్ర సృష్టించిన సినిమా కేజీఎఫ్. బాహుబలి తర్వాత దేశంలో సంచలనం రేపింది కేజీఎఫ్. కన్నడ స్టార్ యశ్ హీరోగా నటించిన ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందురు నిర్మించారు. 2018 డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా మాములు విజయం సాధించలేదు. విడుదలైన అన్నీ బాషలలో మంచి విజయం అందుకుంది. అయితే కేజీఎఫ్ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ ఆధిక ధరకు కొనుగోలు చేసి ప్రేక్షకులకు అందుబాటులో ఉంచింది. అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. కేజీఎఫ్ సినిమా తెలుగు సాటిలైట్ హక్కులను ఇంతవరకు ఏ తెలుగు ఛానల్ కొనుగోలు చేయలేదట.

అయితే ప్రస్తుతం కేజీఎఫ్ సాటిలైట్ హక్కులను కొనుగోలు చేయడానికి కొన్ని టాప్ చానెల్స్ పోటీ పడుతున్నాయట. ఇక ఈ సినిమా తెలుగు సాటిలైట్ హక్కులు చర్చల దశలో ఉండగానే.. ఓ తెలుగు లోకల్ ఛానల్ కేజీఎఫ్ సినిమాను అక్రమంగా ప్రసారం చేసిందట. ఈ విషయాన్నీ కేజీఎఫ్ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కార్తీక్ గౌడ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. అంతేగాక ఆ ఛానల్ స్ట్రీమింగ్ స్క్రీన్ షాట్ కూడా పోస్ట్ చేశారు. ఇలా సినిమా హక్కులు చర్చల దశలో ఉండగానే అక్రమంగా ప్రసారం చేయడం పై నిర్మాతలు మండిపడుతున్నారు. ప్రసారం చేసిన ఆ లోకల్ ఛానల్ పై లీగల్ చార్జెస్ తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం కేజీఎఫ్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉండేసరికి సాటిలైట్ హక్కులు ఎవరు కొనలేదని టాక్. ఇదిలా ఉండగా ప్రస్తుతం కేజీఎఫ్ కి కొనసాగింపుగా కేజీఎఫ్2 రూపొందుతున్న విషయం తెలిసిందే. విడుదలకు ముందే కేజీఎఫ్2 భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది..

అలనాటి అందాలనటి జ్ఞాపకాలలో అమితాబ్..

Bollywood-Hero-Amitabh-in-the-memory-of-old-beauty-Andhra-Talkies
అలనాటి అందాలనటి జ్ఞాపకాలలో అమితాబ్..
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం తన మిత్రులు తోటి నటులు అయినటువంటి దివంగత అందాల తార శ్రీదేవి టాలెంటెడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ లను గుర్తుచేసుకుంటూ వారితో కూడిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. గతంలో శ్రీదేవితో నటించిన 'ఖుదాగవా' సినిమాను గుర్తుచేసుకొని.. నేను శ్రీదేవి కలిసి నటించిన ఈ సినిమా 1992 మే8 రోజున విడుదలైంది. అయితే ఈ సినిమా విడుదలై నిన్నటికి 28 సంవత్సరాలు పూర్తయింది. ఆమె ఎంతో గొప్ప నటి. కానీ ఇలా ఇంత త్వరగా ఈ లోకాన్ని సినీ లోకాన్ని విడిచి వెళ్తుందని ఊహించలేదు. ఆమె ఖుదాగవా సినిమా టైంలో ఎంత సౌమ్యంగా ఉందో.. మరణించే వరకు అలాగే ఉందని తెలిపి ఖుదాగవా సినిమాలోని ఓ ఫోటో షేర్ చేశారు.

ఇక రీసెంట్ గా ఇద్దరు టాప్ యాక్టర్లను కోల్పోయి బాలీవుడ్ ఇండస్ట్రీ ఇంకా ఆ బాధలో నుండి కోలుకోలేదు. అందులో ఇర్ఫాన్ ఖాన్ గురించి బిగ్ బి గుర్తుచేసుకుంటూ.. తనతో వర్క్ చేసిన స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశారు. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం మే8న నేను ఇర్ఫాన్ కలిసి నటించిన 'పీకూ' సినిమా రిలీజ్ అయింది. కానీ ఈ సంతోషాన్ని పంచుకోవడానికి ప్రస్తుతం ఇర్ఫాన్ మనతో లేరు. వెరీ టాలెంటెడ్ యాక్టర్ అని చెప్పారు. ఇర్ఫాన్ కూడా ఆకస్మాత్తుగా లోకాన్ని విడిచి మనందరినీ బాధలోకి నెట్టేసి వెళ్లిపోయారు. కానీ వారి జ్ఞాపకాలు మనతోనే ఉన్నాయంటూ బిగ్ బి తెలిపారు. అందాల నటి శ్రీదేవి ఇర్ఫాన్ ఖాన్ లతో దిగిన స్టిల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసి అందరినీ పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లారు అమితాబ్. ఇద్దరు లెజెండ్స్ ని కోల్పోవడం బాధాకరమే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సూపర్ సీనియర్లను టార్గెట్ చేసిన గోవా బ్యూటీ...!సూపర్ సీనియర్లను టార్గెట్ చేసిన గోవా బ్యూటీ...!

Goa-Beauty-Ileana-Targets-Super-Seniors-Andhra-Talkies
సూపర్ సీనియర్లను టార్గెట్ చేసిన గోవా బ్యూటీ...!
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ హోదాలో కొన్నేళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీని ఏలిన బ్యూటీ ఇలియానా. 'దేవదాసు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ గోవా బ్యూటీ ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ - పూరి కాంబినేషన్లో వచ్చిన 'పోకిరి' సినిమాలో నటించి ఒకే సినిమాతో స్టార్ హీరోయిన్గా మారింది. ఆ సినిమాలో ఇల్లీ బేబీ తన నడుమందాలతో ఇక్కడి కుర్రకారుకి నిద్ర లేకుండా చేసింది. టాలీవుడ్ స్టార్ హీరోలైన మహేష్ ప్రభాస్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ రవితేజ వంటి హీరోలందరి సరసన యాక్ట్ చేసింది. ఓ పక్క ఇటు తెలుగు తమిళంలో నటిస్తూనే.. మరోవైపు హిందీ సినిమాలపై కన్నేసిన ఇల్లీ బేబీ అక్కడ కూడా అదరగొట్టింది. బాలీవుడ్ లో అవకాశాలు వెల్లువలా వచ్చి పడటంతో మన తెలుగు సినిమాలను పక్కన పెట్టేసింది. తర్వాత రోజుల్లో అక్కడ కూడా అవకాశాలు సన్నగిల్లడంతో మళ్ళీ టాలీవుడ్ వైపు చూపు మళ్లించింది. ఎన్నో ఆశలతో రవితేజ హీరోగా తెరకెక్కిన 'అమర్ అక్బర్ ఆంటోని' మూవీతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా ఆమెకు నిరాశనే కలిగించింది. దీంతో ఛాన్సెస్ కోసం సోషల్ మీడియాను ఆశ్రయించింది. ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తోంది. ఇప్పుడు ఈ గోవా బ్యూటీ తిరిగి ఫామ్ లోకి రావడానికి తెగ ట్రై చేస్తోంది.

హీరో కం విలన్ గారి 4 సినిమాలు రెడీ.. రిలీజ్ సంగతి అడక్కండి!హీరో కం విలన్ గారి 4 సినిమాలు రెడీ.. రిలీజ్ సంగతి అడక్కండి!

4-Movies-Ready-But-No-Release-Andhra-Talkies
హీరో కం విలన్ గారి 4 సినిమాలు రెడీ.. రిలీజ్ సంగతి అడక్కండి!
ఆయనో యువ హీరో కం విలన్. ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ హిట్టు రాలేదు.. కెరీర్లో బ్రేక్ కూడా రాలేదు. అలా అని అవకాశాలకు లోటేమీ లేదు. హీరోగా నటిస్తూనే విలన్ గా.. కీలకమైన క్యారెక్టర్లు వచ్చినప్పుడు ఒప్పుకుంటూ తన కెరీర్లో ముందుకు సాగిపోతున్నాడు. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఈ హీరో నటించిన నాలుగు సినిమాలు ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడంటే కరోనా క్రైసిస్ కారణంగా థియేటర్లు మూత పడ్డాయి.. విడుదలకు అవకాశం లేదు. కానీ ఈ హీరో నటించిన ఆ నాలుగు సినిమాలు మాత్రం డిసెంబర్ నుంచే రిలీజ్ కు నోచుకోవడం లేదట.

ఈ సినిమాల నిర్మాతలు వేసవి సీజన్ పైనే ఆశలు పెట్టుకొని ఉన్నారట. ఈ సమ్మర్ లోనే డెడ్ వీకెండ్స్ చూసుకొని.. ఈ సినిమాలను విడుదల చేసే ప్లాన్ వేసుకున్నారట. కరోనా.. లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు ఆ ప్లానింగ్ కాస్త తల్లక్రిందులుగా మారింది. ఆ నిర్మాతలకు రూపాయి కూడా డా వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. ఈ నిర్మాతలు రిలీజ్ డేట్ ఖరారు చేసుకునేందుకు ఛాంబర్ కు వెళ్ళిన సమయంలో "ఎందుకయ్యా ఇలాంటి సినిమాలు తీసి నష్టాలు కొని తెచ్చుకుంటారు" అని మొహం పైనే చెబుతున్నారట.

కరోనాకు కారణం 5జీ టవర్లే : హాలీవుడ్ స్టార్ ఊడీ హారెల్సన్!కరోనాకు కారణం 5జీ టవర్లే : హాలీవుడ్ స్టార్ ఊడీ హారెల్సన్!

Corona-Cause-Because-Of-5G-Towers--Hollywood-Star-Andhra-talkies
కరోనాకు కారణం 5జీ టవర్లే : హాలీవుడ్ స్టార్ ఊడీ హారెల్సన్!
కరోనావైరస్ తో ప్రపంచం వణికిపోతుంటే హాలీవుడ్ యాక్టర్ తాజాగా మరో భారీ బాంబు పేల్చాడు. భయాందోళనల మధ్య బతుకుతున్న ప్రజలు తాజాగా హాలీవుడ్ యాక్టర్ చేసిన కామెంట్లు - పోస్టులపై ఇప్పుడు దృష్టిసారించారు. కరోనావైరస్కు అసలు కారణం అదే అంటూ నటుడు ఊడీ హారెల్సన్ విసిరిన బాంబు ఏమిటంటే.. కరోనావైరస్ కు 5జీ నెట్ వర్క్ కు సంబంధం అంటగడుతూ హాలీవుడ్ యాక్టర్ హారెల్సన్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి.

కరోనా వ్యాప్తికి అసలు కారణం 5జీ వైర్ లెస్ నెట్ వర్క్స్ అంటూ చేసిన పోస్టు సోషల్ మీడియా లో వైరల్ అయింది. అయితే ఈ పోస్టుపై కొందరు స్పందిస్తూ.. బొడిగుండుకు మోకాలుకు లింకు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కరోనావైరస్ కు అసలు కారణం 5జీ వైర్ లెస్ నెట్ వర్క్స్ ఊడీ హారెల్సన్ షేర్ చేసిన పోస్టులో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. చైనాలో వుహాన్ తొలి 5జీ స్మార్ట్ సిటీగా ఎంపికైంది. దాంతో ప్రపంచంలోనే తొలి 5జీ స్మార్ట్ హైవేగా పేరుతెచ్చుకొన్నది. అంతలోనే వుహాన్ లో ప్రాణాంతక వ్యాధి కరోనా వైరస్ గణనీయంగా వ్యాప్తి చెందింది అని ఊడీ హారెల్సన్ షేర్ చేసిన రిపోర్టులో పొందుపరిచాడు.

విలన్ వేషాలు వేయడానికి రెడీ అంటున్న స్టార్ హీరో..?


విలన్ వేషాలు వేయడానికి రెడీ అంటున్న స్టార్ హీరో..?

Popular-Hero-Upendra-Ready-For-Villain-Roles-in-Telugu-Movies-Andhra-Talkies
విలన్ వేషాలు వేయడానికి రెడీ అంటున్న స్టార్ హీరో..?
కాలంతో పాటు సినీ ఇండస్ట్రీలో కూడా ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు విలన్లుగా చేసి హీరోలు అవ్వాలని ఆశ పడేవారు. ఇప్పుడు హీరోలు విలన్ వేషాలు వేయాలని ఆశ పడుతున్నారు. స్టార్ హీరోలు సైతం ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర అయితే విలన్ రోల్ అయినా ఓకే అంటున్నారు. సినీ ఇండస్ట్రీలో హీరోగా ఒక వెలుగు వెలిగి కెరీర్ కాస్త స్లోగా ఉంటే విలన్ గా ట్రై చేయడం లేదా హీరోగా అవకాశాలున్న సమయంలోనే పక్క భాషల్లో విలన్ గా చేయడం ఈ మధ్య హీరోలకు బాగా కలిసి వస్తోంది. స్టైలిష్ విలన్స్ గా - హీరోకు ఏమాత్రం తగ్గని స్టైల్స్ అండ్ క్యారెక్టర్ వెయిట్ తోనే నెగటివ్ షేడ్స్ అద్భుతంగా పోషిస్తున్నారు. ఫేడ్ అవుట్ అయిపోయే హీరోలకు కెరీర్ మళ్లీ ప్రారంభమవుతుంటే - విలన్ గా సొంతభాషలో ప్రేక్షకులు ఒప్పుకోని హీరోలు పక్కభాషల్లో నెగటివ్ రోల్స్ లో రెచ్చిపోతున్నారు. హీరోలుగా డిజాస్టర్ల బాట పట్టి మళ్లీ విలన్ గా లైఫ్ సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లలో మన టాలీవుడ్ లో తారకరత్న - జగపతిబాబు లాంటి వాళ్లుంటే - ఒక భాషలో హీరోగా చేస్తూనే మరో భాషలో విలన్ గా చేస్తున్నారు ఆది పినిశెట్టి - అరుణ్ విజయ్ - ఉపేంద్ర లాంటి వారు ఉన్నారు.

ఆ హీరోయిన్లు దుకాణం సర్దాల్సిందేనా..?


ఆ హీరోయిన్లు దుకాణం సర్దాల్సిందేనా..?

Tollywood-Producers-Interested-With-New-Heroines-Andhra-Talkies
ఆ హీరోయిన్లు దుకాణం సర్దాల్సిందేనా..?
హీరోయిన్... సినిమాల్లో ఈ పదానికి చాలా ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉంటుంది. కానీ ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం హీరోయిన్ అంటే కేవలం అందాల ఆరబోతకు పరిమితం అవుతున్నారు అనేది నిజం. నటించే సత్తా ఉన్నా సరయిన అవకాశం రాక వచ్చిన గ్లామర్ పాత్రలు చేసే వాళ్ళు కొందరయితే - సినిమాల్లో ఉండాలి అనుకుని ఫిక్స్ అయ్యి నటన సరిగా రాక వచ్చిన పాత్రలే చేసుకుని పోయేవాళ్లు మరికొందరు. తమ అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీలో పాతుకుపోయిన వారు ఇంకొందరు. మన టాలీవుడ్ ఇండస్ట్రీ విషయానికొస్తే రోజుకో కొత్త హీరోయిన్ ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటుంది. వాళ్లలో కొందరు అందం - అభినయంతో గుర్తింపు తెచ్చుకోగా - మరికొందరు ఆ ఒక్క సినిమాతోనే సరిపెట్టుకొని తట్టా బుట్టా సర్దుకొని వెళ్లిపోతుంటారు. రోజకో కొత్త హీరోయిన్ వస్తున్న ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకుని ఉండటం అంటే మాటలు కాదు.

కానీ కొంతమంది హీరోయిన్లు బ్యూటీతో పాటు తమ యాక్టింగ్ కలిపి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వెంటనే స్టార్ డమ్ సొంతం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళు వచ్చిన వరుస అవకాశాలు సద్వినియోగం చేసుకోలేక - పాత్ర కంటే రెమ్యూనరేషన్ కే ఇంపార్టెన్స్ ఇచ్చి ఇండస్ట్రీ నుండి ఫేడ్ అవుట్ అయ్యే పరిస్థితి తెచ్చుకున్నారు. హెబ్బా పటేల్ - శ్రద్ధాదాస్ - ప్రగ్యా జైస్వాల్ - రెజీనా కసాండ్ర - అను ఇమ్మాన్యుయేల్ లాంటి హీరోయిన్లు ఈ కోవకే చెందుతారు. వీరితో పాటు ఇంకా కొంతమంది హీరోయిన్లు ఇప్పుడు టాలీవుడ్ నుండి తమ దుకాణం మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది.

నువ్వు వర్జినా అడిగిన వాడిపై హీరోయిన్ ఫైర్


నువ్వు వర్జినా అడిగిన వాడిపై హీరోయిన్ ఫైర్

The-Heroine-Fires-On-Netigen-Andhra-Talkies
నువ్వు వర్జినా అడిగిన వాడిపై హీరోయిన్ ఫైర్
సోషల్ మీడియానే ఇప్పుడు ఆయుధమైంది. దాంతో నే తమ భావాలను అందరూ వ్యక్త పరుస్తున్నారు. సినిమా ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారానే అభిమానులతో కనెక్ట్ అవుతున్నారు. చిరంజీవి కూడా తాజాగా ట్విట్టర్ ఇన్ స్టాగ్రామ్ లలోకి వచ్చాడు.

అయితే హీరోయిన్లను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో రెచ్చిపోయే నెటిజన్లు కోకొల్లలు. ఈ క్రమంలోనే తాజాగా మలయాళీ హీరోయిన్ సంయుక్త మీనన్ తో ఓ నెటిజన్ అసభ్యంగా ప్రవర్తించాడు. అందరి ముందే ఆ హీరోయిన్ ను 'నువ్వు వర్జినా కాదా' అని ప్రశ్నించాడు. దీంతో షాక్ కు గురైన హీరోయిన్ సంయుక్త అతడికి దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది. ఓ రేంజ్ లో పైర్ అయ్యింది.

నీలాంటి వాళ్ల వల్లే అమ్మాయిలు ఆటబొమ్మలా కనిపిస్తున్నారు. మీరు వర్జినిటీ సెక్స్ ఆల్కహాల్ గురించే ఆలోచిస్తారు. మీతోనే అమ్మాయిలకు డేంజర్ అంటూ నిప్పులు చెరిగింది సంయుక్త. అనంతరం చెడామడా తిట్టేసింది. జాగ్రత్తగా ఉండు.. నీ చెంప పగులకొట్టే అమ్మాయి ఎక్కడో ఉండే ఉంటుందని సంయుక్త వార్నింగ్ ఇచ్చింది.

2016లో మలయాళ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్ తొలి చిత్రంతోనే గుర్తింపు తెచ్చుకొని అక్కడ పెద్ద హీరోయిన్ గా ఎదిగింది.తమిళనాట కూడా సినిమాల్లో నటిస్తూ సత్తా చాటుతోంది.

రాబోయే రోజుల్లో స్టార్ హీరోల సినిమాల రిలీజ్ కష్టమే...!


రాబోయే రోజుల్లో స్టార్ హీరోల సినిమాల రిలీజ్ కష్టమే...!

Plans-Of-Star-Heroes-Shattered-By-Corona-Andhra-Talkies
రాబోయే రోజుల్లో స్టార్ హీరోల సినిమాల రిలీజ్ కష్టమే...!
కరోనా మహమ్మారి మూలంగా అందరి తలరాతలు మారుతూ వస్తున్నాయి. డబ్బున్నోడు పేదోడు మధ్య తరగతి అని తేడా లేకుండా అందర్నీ అల్లాడిస్తున్నది. ఇంక ప్రపంచ వ్యాప్తంగా దీని వల్ల అన్ని రంగాలకు నష్టం వాటిల్లింది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో మన దేశంలో కూడా చాలా ప్రభావం చూపింది. ముఖ్యంగా పర్యాటక రంగం సినీ రంగం మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడింది. సినీ ఇండస్ట్రీ షూటింగులు అన్నీ ఆపుకొని థియేటర్స్ మల్టీప్లెక్స్ మూతవేసి లాక్ డౌన్ చేసుకుంది. దీంతో ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాలు తమ విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాను. షూటింగులు ఆగిపోవడంతో ఈ ఏడాది విడుదలయ్యే సినిమాలు కూడా తగ్గే అవకాశం ఉంది. మన టాలీవుడ్ లో ఈ ఏడాది అల్లు అర్జున్ బాలయ్య నిఖిల్ నాగచైతన్య లాంటి హీరోలు రెండు రెండు సినిమాలను రెడీ చేయాలని అనుకున్నారు. కానీ కరోనా వచ్చి మీద పడటంతో ఇప్పుడు అన్ని లెక్కలు మారి పోయాయి. ఒక్క సినిమా రిలీజ్ కి రెడీ చాలు అనుకుంటున్నారు.

ఇటలీలో ఇరుక్కుపోయిన ఇండియన్ ఫేమస్ సింగర్..


ఇటలీలో ఇరుక్కుపోయిన ఇండియన్ ఫేమస్ సింగర్..

Indian-Famous-Singer-Stucked-In-Italy-Andhra-Talkies
ఇటలీలో ఇరుక్కుపోయిన ఇండియన్ ఫేమస్ సింగర్..
గాన గంధర్వుడు పండిట్ జస్రాజ్కు మనవరాలు ప్రముఖ సినీ గాయని శ్వేతా పండిట్ ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉంది. నెలరోజుల కిందట ఇటలీకి వెళ్లిన ఆమె రోజురోజుకి అక్కడ కరోనా వ్యాప్తి పెరుగుతుండటం తో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయింది. మన దేశంలో కరోనా ప్రభావం లేనప్పటికీ.. ఇండియాకి వచ్చే అవకాశం ఉన్నా రాలేదు. 'కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది గనక ఇటలీ నుంచి బయటికి రావడం బాధ్యతా రాహిత్యమే అవుతుందంటుంది శ్వేత. ప్రస్తుత పరిస్థితుల్లో విమాన ప్రయాణం అంత మంచిది కాదు. అందుకే నెల రోజులుగా ఇటలీలో శ్వేత ఉంటున్న ఇంట్లోంచి బయటకు రాకుండా కాలక్షేపం చేస్తుందట. ఇటలీలో భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అంబులెన్స్ సైరన్ వింటూ నిద్రపోయి మళ్లీ ఆ సైరన్‌తోనే నిద్రలేస్తున్నానంటుంది శ్వేత. అంబులెన్స్ శబ్దం తప్ప ఇంకేదీ వినిపించడం లేదట. ఫ్రెండ్స్.. మీరంతా కూడా జాగ్రత్తగా ఉండండి. గవర్నమెంట్ చెప్పే సూచనలు పాటించండి.

సాయం చేయడానికి అనుష్క కి చేతులు రావా..?


.

సాయం చేయడానికి అనుష్క కి చేతులు రావా..?

Sexy-Heroin-Anushka-Not-Announced-Relief-Fund-for-TFI-Workers-Andhra-Talkies
సాయం చేయడానికి అనుష్క కి చేతులు రావా..?
మన టాలీవుడ్ హీరోయిన్ల రెమ్యూనరేషన్ ఆకాశాన్నంటేలా ఉంటాయి. ఒక్కొక సినిమాకి రెండు నుండి మూడు కోట్లు తీసుకునే స్టార్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. కొంతమంది హీరోయిన్లు ఒక్క ఐటమ్ సాంగ్ చేస్తేనే కోటి రూపాయల దాకా డిమాండ్ చేస్తుంటారు. గెస్ట్ రోల్స్ చేయడానికి వాళ్ళు వసూలు చేసేది లక్షల్లోనే. ఇంత భారీ మొత్తంలో సంపాదించే హీరోయిన్లు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ఇప్పుడు సగటు అభిమానికి వస్తున్న డౌట్. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించింది. ఈ వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా తన పంజాను చూపెడుతోంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వాలు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వైరస్ బాధితుల సహాయార్థం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా భారీ విరాళాలు అందిస్తున్నారు. టాలీవుడ్ లోని చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు హీరోలు తమకు తోచిన విధంగా సహాయం చేస్తున్నారు. కానీ ప్రణీత - లావణ్య త్రిపాఠి మినహా మిగతా హీరోయిన్లు స్పందించక పోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

లాక్ డౌన్ తర్వాత సినీ పరిశ్రమ పరిస్థితి ఏంటి.. భవిష్యత్తు ఎలా ఉంటుంది?లాక్ డౌన్ తర్వాత సినీ పరిశ్రమ పరిస్థితి ఏంటి.. భవిష్యత్తు ఎలా ఉంటుంది?

What-is-the-situation-of-the-film-industry-after-the-lockdown-Andhra-Talkies
లాక్ డౌన్ తర్వాత సినీ పరిశ్రమ పరిస్థితి ఏంటి.. భవిష్యత్తు ఎలా ఉంటుంది?
కోవిడ్-19 వ్యాప్తితో దాదాపుగా అన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. దీంతో అందరం ఒక్కసారిగా ఇంట్లో కూర్చుని భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం. ఈ లాక్ డౌన్ ప్రతి ఒక్క సంస్థపై ఆర్థికంగా ప్రభావం చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటలీ.. స్పెయిన్.. యూకె.. యూఎస్ఎ దేశాల్లో. కొన్ని ఇతర ఐరోపా దేశాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది.

ఈ వ్యాధి ప్రభావం మనదేశంపై కూడా ఉంది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఇది కొత్త మార్పులకు దారితీయవచ్చు. ప్రస్తుతం థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేందుకు ప్రజలు భయపడి ఇంట్లోనే అందుబాటులో ఉండే సినిమాలతోనో సరిపెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. లాక్ డౌన్ తర్వాత థియేటర్లకు ప్రజలు వెళ్తారేమో కాని యావరేజ్ సినిమాలు అనే పదం ఇకపై కనిపించకపోవచ్చు

RRR ప్రచారానికి వరంగా మారిన లాక్ డౌన్!


RRR ప్రచారానికి వరంగా మారిన లాక్ డౌన్!

Director-Rajamouli-Movie-RRR-Team-Using-Lockdown-For-Movie-Promotions-Andhra-Talkies
RRR ప్రచారానికి వరంగా మారిన లాక్ డౌన్!
ఒక సినిమాను నిర్మించడం వేరు.. దానికి సరైన ప్రచారం కల్పించి ప్రేక్షకులను థియేటర్ కు రప్పించడం వేరు. చాలామంది ఈ ప్రచారం విషయంలో వెనకబడతారు.  ఓపెనింగ్స్ లేక సినిమా హిట్ అయ్యే అవకాశాలు జారవిడుచుకుంటారు.  అయితే రాజమౌళి మార్కెటింగ్ టెక్నిక్స్ మాత్రం ఎప్పుడూ కొత్తపుంతలు తొక్కుతూ ఉంటాయి.  నిజానికి  రాజమౌళి మార్కెటింగ్ వల్లే తన సినిమాల క్రేజ్ ఆకాశాన్ని తాకుతుంది.  'బాహుబలి' సమయంలో రాజమౌళి అనుసరించిన మార్కెటింగ్ టెక్నిక్స్ చాలామందిని అబ్బురపరిచాయి.  ఇప్పుడు 'RRR' విషయంలో లో కూడా అలాంటి ఎత్తుగడతోనే ముందుకు వెళ్తున్నారు.

కరోనా దెబ్బకు షూటింగులు ఆగిపోయాయి. ప్రమోషన్లు కూడా ఆపారు. లాక్ డౌన్ కావడంతో దాదాపుగా ప్రజలంతా ఇంటిపట్టునే ఉంటూ కాలం గడుపుతున్నారు.  అయితే ఈ లాక్ డౌన్ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకునేందుకు రాజమౌళి టీమ్ రెడీ అయింది.  మొదట మోషన్ పోస్టర్ తో వచ్చారు. టైటిల్.. మోషన్ పోస్టర్ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. నిన్న చరణ్ పుట్టినరోజు సందర్భంగా 'భీమ్ ఫర్ రామరాజు' వీడియో విడుదల చేశారు.  ఇది కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. చరణ్ కు ఎన్టీఆర్ ఇచ్చిన గిఫ్టుకు యూట్యూబ్ లో భారీ రెస్పాన్స్ దక్కుతోంది.

మోస్ట్ పెయిడ్ హీరోయిన్స్ జాబితాలో పూజ..


మోస్ట్ పెయిడ్ హీరోయిన్స్ జాబితాలో పూజ..

Popular-Heroin-Pooja-on-most-paid-heroines-list-Andhra-Talkies
మోస్ట్ పెయిడ్ హీరోయిన్స్ జాబితాలో పూజ..
ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా వెలిగిపోతుంది పూజ హెగ్డే. వరుస హిట్లతో టాప్ హీరోల సరసన అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో షూటింగ్ జరుపుకుంటున్న సినిమాతో పాటు అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అక్కినేని అఖిల్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే తాజా కథనాల సమాచారం మేరకు.. ఈ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో హీరోయిన్ గా నటించడానికి పూజ భారీ పారితోషికాన్ని తీసుకుంటుందట. అదికూడా హీరో అఖిల్ కంటే హీరోయిన్ పూజకే ఎక్కువ చెల్లిస్తున్నారట నిర్మాతలు బన్నీవాసు వాసు వర్మలు. ఇక హీరోకంటే ఎక్కువ పారితోషికాన్ని అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలోకి పూజ  చేరిందని ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఇప్పటికే వరుస హిట్లతో దూసుకుపోతున్న పూజ బ్యాంకు బ్యాలెన్స్ అమాంతం పెరుగుతుందని గుసగుసలాడుతున్నారు. మరి పూజ ఈ సోషల్ మీడియా వార్తలపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

ఎద సొంపులను ఎరగా వేస్తున్న ఆదా శర్మ


ఎద సొంపులను ఎరగా వేస్తున్న ఆదా శర్మ

sexy-heroin-Adah-Sharma-Glamourous-pose-Andhra-Talkies
ఎద సొంపులను ఎరగా వేస్తున్న ఆదా శర్మ
ఆదా శర్మ...ఈ పేరు వింటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది హార్ట్ ఎటాక్ అనే చెప్పాలి. తన నటనతో తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది. అల్లు అర్జున్ తో సన్ అఫ్ సత్యమూర్తి సినిమాలో కూడా నటించింది. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నా తెలుగులో మెయిన్ హీరోయిన్ అవకాశాలైతే రాలేదనే చెప్పాలి. కొన్ని చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ రోల్స్ కి మాత్రమే పరిమితం అయింది. ఆ తర్వాత బాలీవుడ్ కి చెక్కేసిన ఈ అమ్మడు అక్కడ అడపాదడపా చిత్రాలలో నటించింది.

 ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో కూడా మంచి పేరు ఉంది. ఈమె సినిమాలకన్నా ఎక్కువగా తన ఫోటోలతో ఫ్యాన్స్ కు మత్తెకిస్తుంది. ఎక్కువగా ఫోటోషూట్ లు చేస్తూ తన ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితమవుతున్నారు. ఎంతో కొంత వినోదం కలిగించడం కోసం తమ సోషల్ మీడియా ద్వారా సెలెబ్రెటీలు తమ అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఈ భామ కూడా తన అభిమానుల కోసం ఒక ఫొటో అప్ లోడ్ చేసి కుర్రకారుకు ఊపు తెప్పిస్తున్నది. ఎద సొంపులను చూపిస్తూ మత్తెక్కించే కళ్ళతో కుర్రాళ్లకు ఎర వేస్తున్నట్లు ఫొటోకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇండియన్ సినిమాలకు అక్కడ గేట్లు మూసేశారు


ఇండియన్ సినిమాలకు అక్కడ గేట్లు మూసేశారు

Gates-Are-Closed-For-Indian-Movies-Andhra-Talkies
ఇండియన్ సినిమాలకు అక్కడ గేట్లు మూసేశారు
కరోనా ధాటికి కుదేలవుతున్న రంగాల్లో సినీ పరిశ్రమ ఒకటి. మిగతా రంగాల కంటే ముందు దీనిపైనే కరోనా ప్రభావం పడింది. నెల కిందట్నుంచే సినిమాల వసూళ్లు పడిపోయాయి. తర్వాత ఏకంగా థియేటర్లే మూసేశారు. షూటింగులు ఆగిపోయాయి. రిలీజ్లు ఆగిపోయాయి. మళ్లీ ఎప్పుడు థియేటర్లు తెరుచుకుంటాయో తెలియట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ నెలాఖరు వరకు థియేటర్లను మూసేశారు. ఏప్రిల్ మొదటి వారంలోనూ థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆ నెల రెండో అర్ధంలో అయినా పరిస్థితి మారుతుందేమో అని చూస్తున్నారు. ఇండియా లో కరోనా ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. కనీసం మే ఆరంభం నుంచి అయినా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని.. వేసవిలో అత్యంత ముఖ్యమైన ఈ నెలలో అయినా వసూళ్ల పంట పండించుకోవచ్చని భావిస్తున్నారు.

బాహుబలి' హీరోయిన్ అనుష్క శెట్టి మెగా ఛాన్స్ అందుకే వద్దనుకుందా..??


బాహుబలి' హీరోయిన్ అనుష్క శెట్టి మెగా ఛాన్స్ అందుకే వద్దనుకుందా..??

heroin-anushka-shetty-mega-chance-so
బాహుబలి' హీరోయిన్ అనుష్క శెట్టి మెగా ఛాన్స్ అందుకే వద్దనుకుందా..?
'బాహుబలి' సినిమాతో దేశం మొత్తం తన వైపు చూసేలా చేసుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి. కింగ్ నాగార్జున నటించిన 'సూపర్' సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన అనుష్క తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ అనిపించుకుంది. అభిమానులు ముద్దుగా స్వీటీ అని పిలుచుకునే అనుష్క తన అందం అభినయంతో సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో కూడా నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోలందరితో నటించిన స్వీటీ శెట్టి తన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. అరుంధతి పంచాక్షరీ భాగమతి వంటి లేడీ ఓరియంటెడ్ మూవీల్లో నటించి తాను ఎలాంటి ఛాలెంజింగ్ పాత్ర అయిన చేయగలనని నిరూపించుకుంది. అయితే స్వతహాగా సౌమ్యురాలైన అనుష్క మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటించే ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందట.

పీకే రూటే సపరేటు.. అందరివీ చప్పట్లు ఈయనది గంటపీకే రూటే సపరేటు.. అందరివీ చప్పట్లు ఈయనది గంట

Power-Star-Pawan-Kalyan-Salute-to-All-For-Janata-Curfew-Success-Andhra-Talkies
పీకే రూటే సపరేటు.. అందరివీ చప్పట్లు ఈయనది గంట
సినిమాల్లో పవర్ స్టార్ రాజకీయాల్లో జనసేనాని పవన్ కల్యాణ్ నిజంగా ఏది చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. సినిమాల్లో తనదైన స్టైల్ తో లక్షలాది మంది అభిమాన ధనాన్ని సంపాదించుకున్న పవన్... రాజకీయాల్లోనూ తనదైన ప్రత్యేకతనే చాటుకునేందుకే యత్నించారు తప్పించి... అందరూ నడిచిన దారిలో మాత్రం నడవలేదు. ఈ క్రమంలో మొన్నటి ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలినా కూడా పవన్ వెనుకాడలేదనే చెప్పాలి. అయినా ఇప్పుడు ఈ సోది అంతా ఎందుకనుకుంటున్నారా? ఏ విషయంలో అయినా పవన్ రూటు సపరేటే. అందుకు నిదర్శనంగా నిలుస్తున్న ఘటన ఆదివారం జరిగింది కాబట్టే ఈ ఉపోద్ఘాతం చెప్పాల్సి వచ్చింది.

కరోనా వైరస్ విస్తరణను కట్టి చేసే క్రమంలో ఆదివారం జనతా కర్ఫ్యూ పాటిద్దామంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనకు దేశం మొత్తం మద్దతుగా నిలిచింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంటి నుంచి బయటకు రాకుండా అంతా స్వీయ నిర్బంధాన్నే పాటించారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఇళ్ల నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొట్టాలని మోదీ పిలుపు ఇవ్వగా... ఆదివారం సాయంత్రం 5 గంటలకు దేశం మొత్త చప్పట్లతో మారుమోగింది. దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన దాదాపుగా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు చప్పట్లు చరిచి మోదీ పిలుపునకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...