పవన్ 27వ సినిమా రియల్ బందిపోటు కథేనా?

Power-Star-Pawan-kalyan-And-Krish-movie-Script-Andhra-Talkies

పవన్ 27వ సినిమా రియల్ బందిపోటు కథేనా?

ఓపక్క రాజకీయాలు మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీ కావాలని భావిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇందులో భాగంగా దిల్ రాజు నిర్మిస్తున్న హిందీ పింక్ మూవీలో లాయర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ తో పాటు.. అతి తక్కువ కాల్షీట్లు ఇచ్చిన వైనం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఉదయం రాజకీయాలు.. రాత్రి వేళ సినిమా షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ఇప్పటికే పట్టాలకెక్కటం.. ఈ సినిమాలో పవన్ గెటప్ ఫోటోలు కొన్ని బయటకు రావటం తెలిసిందే. ఇదిలా ఉంటే..దిల్ రాజు సినిమా ఓపక్క సాగుతున్న వేళలోనే.. పవన్ మరో సినిమా షురూ కానుంది. క్రిష్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర సమాచారం తాజాగా బయటకు వచ్చింది.

నిర్మాత దిల్ రాజు కి ఏమైనా మెంటలా?

Producer-Dil-Raju-on-about-Jaan-Movie-Andhra-Talkies

నిర్మాత దిల్ రాజు కి ఏమైనా మెంటలా?

రెండేళ్ళ క్రితం తమిళ్ లో వచ్చిన సూపర్ హిట్టయిన '96' సినిమాను దిల్ రాజు తెలుగులో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ కి రెడీ చేసారు కూడా. ఫిబ్రవరి 7 న సినిమా థియేటర్స్ లోకి వస్తుంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ ను హడావుడిగా రిలీజ్ చేసారు. ఈ ఈవెంట్ లోనే రాజు గారు తనను తిట్టుకున్నా విషయాన్ని చెప్పుకున్నారు.

"ఇన్నేళ్ళ నా కెరీర్ లో ఎప్పుడూ రీమేక్ సినిమా చేయలేదు. ఒకటి రెండు అనుకున్నా ఎందుకులే ఏముంటుంది అని పక్కన పెట్టేసాను. కానీ '96' సినిమాను రిలీజ్ కంటే ముందు చెన్నై వెళ్లి చూసాను. ప్రీవ్యూ థియేటర్ నుండి బయటికి రాగానే అప్పుడే ఈ సినిమాను రీమేక్ చేద్దామని డిసైడ్ అయ్యాను. నేను '96'  రీమేక్ చేస్తున్నా అని బయటికి రాగానే అందరూ దిల్ రాజు కి ఏమైనా మెంటలా ? క్లాసిక్ ను ఇప్పుడు రీమేక్ చేయడం అవసరమా అనుకున్నారు. కానీ నేను పొందిన ఆ అనుభూతి మన తెలుగు ప్రేక్షకులందరూ పొందాలని ఫైనల్ గా చేసేసాను. ఫిబ్రవరి 7 న నేను ఆడితే ఫీలయ్యానో అందరూ అదే ఫీలవుతారు" అంటూ చెప్పుకున్నాడు.

కావాల్సినంత ఎక్స్ పోజ్ చేసి అబద్దం అంటే ఎలా ఆంటీ?

Pachamanga-Fame-Sona-Denies-Being-Glamourous-Andhra-Talkies

కావాల్సినంత ఎక్స్ పోజ్ చేసి అబద్దం అంటే ఎలా ఆంటీ?

భాష ఏదైనా.. ఏ రకం సినిమా అయినా.. ఎలాంటి కంటెంట్ అయినా కూడా సినిమాలో కాస్త బూతు ఉంటేనే ప్రేక్షకులు ఆధరిస్తున్నారు అనేది అందరు ఒప్పుకునే నిష్ఠుర నిజం. మంచి కాన్సెప్ట్ తో చేసే సినిమాలకు పబ్లిసిటీ కావాలంటే కాస్త గ్లామర్ టచ్ ఇవ్వాల్సిందే. అది తెలుగులో అయినా లేదంటే మరే ఇతర భాషలో తెరకెక్కిన సినిమా అయినా కాస్త రొమాంటిక్ సీన్స్ ఉన్నాయంటూ ట్రైలర్ లో చూపిస్తే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి ఉంది. అందుకే మలయాళ చిత్రం పచ్చమాంగ ట్రైలర్ లో సీనియర్ నటి సోన ఎక్స్ పోజింగ్ సీన్స్ చూపించారు.

పచ్చమాంగ ట్రైలర్ చాలా వైరల్ అయ్యింది. ఆ ట్రైలర్ ను భారీ ఎత్తున ప్రేక్షకులు చూశారు.. ఇంకా చూస్తూనే ఉన్నారు. ఆ ట్రైలర్ చూసిన తర్వాత సౌత్ ఇండియాకు మరో షకీలా దొరికింది అంటూ కామెంట్స్ చేస్తున్నారట. ఇన్నాళ్లకు షకీలాకు వారసురాలు లభించింది ఇండస్ట్రీకి అంటూ మలయాళ ప్రేక్షకులు కామెంట్స్ తో రెచ్చి పోతున్నారు. పచ్చమాంగ ట్రైలర్ లో సోనా కాస్ట్యూమ్స్ మరియు ఆమె ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ కాస్త అప్పటి షకీలాను తలపించేలా ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా కొందరు గుసగుసలాడుకుంటున్నారు.

ఐశ్వర్యారాయ్ అమ్మ కాబోతుండటమే సర్ ప్రైజా అభిషేక్ బచ్చన్?

Aishwarya-Husbend-Abhishek-Bhachchan-Giving-Suprise-To-His-Fans-Andhra-Talkies

ఐశ్వర్యారాయ్ అమ్మ కాబోతుండటమే సర్ ప్రైజా అభిషేక్ బచ్చన్?

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఇటీవల సోషల్ మీడియాలో హాయ్ మీ అందరికి ఒక సర్ ప్రైజ్ వేచి చూస్తూ ఉండండి అంటూ పోస్ట్ చేశాడు. ఆ సర్ ప్రైజ్ ఏమై ఉంటుందా అంటూ ఆయన ఫాలోవర్స్ మరియు మీడియాలో చూసిన వారు అంతా కూడా జుట్టు పీక్కుంటున్నారు. ఎట్టకేలకు ఆ సర్ ప్రైజ్ ఏంటీ అనే విషయమై ఒక క్లారిటీ వచ్చింది. అధికారికంగా అయితే అభిషేక్ క్లారిటీ ఇవ్వకున్నా బాలీవుడ్ వర్గాలు మరియు బచ్చన్ ఫ్యామిలీ మెంబర్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆ సర్ ప్రైజ్ ఏంటీ అంటే ఐశ్వర్య మళ్లీ తల్లి కాబోతుండటమే.

ఔను గత కొన్ని రోజులుగా కెమెరాకు దూరంగా ఉన్న ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరి కొన్ని నెలల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుందట. ఈ విషయాన్ని అనధికారికంగా బచ్చన్ కుటుంబ సభ్యులు జాతీయ మీడియాతో చెప్పినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ వర్గాల్లో కూడా ఇదే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఐశ్వర్యరాయ్.. అభిషేక్ బచ్చన్ లకు ఒక పాప ఉంది. ఇప్పుడు ఆ పాప అక్క అవ్వబోతుంది. ఆమెకు బుల్లి తమ్ముడు లేదా చెల్లి రాబోతుంది.

ఫేక్ కలెక్షన్స్ ట్రెండ్.. అక్కడే మార్చేస్తున్నారట

Sankranti-Tollywood-Movies-Fake-Collections-Andhra-Talkies

ఫేక్ కలెక్షన్స్ ట్రెండ్.. అక్కడే మార్చేస్తున్నారట

ఈసారి సంక్రాంతి సినిమాల సందడి మామూలుగా లేదు. పోటీ తారాస్థాయికి చేరడంతో కలెక్షన్స్ విషయంలో ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి ఫేక్ నంబర్లు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. తమ సినిమా నాన్ బాహుబలి రికార్డులు బ్రేక్ చేసిందని ఒకరంటే. తమ సినిమా నాన్ బాహుబలి -2 రికార్డులను బద్దలు కొట్టిందని అంటూ పోటీని రక్తికట్టించారు. తాజాగా ఈ పోటీ ఇంకా ఎక్కువై 200 కోట్ల గ్రాస్ సాధించిందని ఒకరు అంటే.. మరొకరు 220 కోట్లు అని గొప్పలు చెప్పుకున్నారు.

చిత్రమైన విషయం ఏంటంటే ఈ కలెక్షన్లు ఫేక్ అని దాదాపుగా అందరికీ తెలుసు అయినా భారీ గా ప్రచారం లోకి తీసుకొస్తున్నారు. కొందరు ఫ్యాన్స్ మాత్రం తమ హీరో సినిమా కలెక్షన్స్ నమ్ముతూ పోటీలో ఉన్న మరో హీరో సినిమాలపై విమర్శలు సంధిస్తున్నారు. నిజానికి ఈ కలెక్షన్స్ ఫిగర్స్ ఎలా ఉన్నప్పటికీ అసలు కలెక్షన్స్ మాత్రం అతి తక్కువ మందికే తెలుసనే అభిప్రాయం వినిపిస్తోంది. వారెవరో కాదు.. నిర్మాతలే. 'అల వైకుంఠపురములో' కలెక్షన్స్ సంగతి అల్లు అరవింద్.. రాధా కృష్ణలకు తెలుసని.. 'సరిలేరు నీకెవ్వరు' కలెక్షన్స్ అనిల్ సుంకర.. దిల్ రాజుకు మాత్రమే తెలుసని అనుకుంటున్నారు.

పంచ్ లు వేసినంత తేలికకాదు ఆది పోస్ట్ లు పెట్టడం

Hyper-Aadhi-Remembering-MS-Narayana-Death-Anniversary-Andhra-Talkies

పంచ్ లు వేసినంత తేలికకాదు ఆది పోస్ట్ లు పెట్టడం

తెలుగు ప్రేక్షకులుకు హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుల్లి తెర సెన్షేషన్ కామెడీ షో జబర్దస్ లో ప్రస్తుతం టాప్ కమెడియన్ గా ఉండటంతో పాటు వరుసగా చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు. హీరోగా కూడా అవకాశాలు వస్తున్నాయి. కాని వెయిట్ అండ్ సీ దోరణిలో ఉన్నాడు. ఆది కామెడీ స్కిట్ లో కాన్సెప్ట్ కంటే పంచ్ లు ఎక్కువ ఉంటాయనే విషయం తెల్సిందే. ప్రతి దానికి పంచ్ లు వేస్తూ ప్రేక్షకులను నవ్వించే ఆది తాజాగా నవ్వులపాలయ్యాడు.

నేడు ప్రముఖ దివంగత కమెడియన్ ఎంఎస్ నారాయణ వర్ధంతి. ఆయన వర్ధంతి సందర్బంగా శ్రేయాస్ మీడియా సంస్థ వారు తమ సోషల్ మీడియాలో పేజ్ లలో ఆయన వర్థంతి సందర్బంగా ఆయన్న జ్ఞాపకాల్లో అంటూ పోస్ట్ చేశారు. ఆ ఫొటోను ఉన్నది ఉన్నట్లుగా పోస్ట్ చేసిన ఆది పైన మాత్రం హ్యాపీ బర్త్ డే సర్ అంటూ పోస్ట్ చేశాడు. ఎంఎస్ నారాయణ చనిపోయి అయిదు సంవత్సరాలు అయ్యింది. అయినా బర్త్ డే అయినా కూడా చనిపోయారు కనుక జయంతి అనాలి. చనిపోయిన రోజును వర్థంతి అనే విషయం ఆది మర్చిపోయాడా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఆరోజే రంజితకు నేను చెప్పి ఉంటే బాగుండేది

paruchuri-gopala-krishna-about-ranjitha-Andhra-Talkies
తెలుగు మరియు తమిళంలో పలు చిత్రాల్లో నటించి ఒకప్పుడు నటిగా మంచి గుర్తింపు దక్కించుకున్న హీరోయిన్ రంజిత. ఈమె నటిగా మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే నిత్యానందతో రాసలీలలు వీడియో బయటకు వచ్చి కెరీర్ నాశనం అయ్యింది. అతడి భక్తి పారవశ్యంలో మునిగి పోయి అతడికి సేవ చేస్తున్నాను అనుకుని తన కెరీర్ ను నాశనం చెసుకుంది. ప్రస్తుతం రంజిత ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. అలాంటి రంజిత గురించి పరుచూరి గోపాల కృష్ణ ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు.

అస్వస్థత కు గురైన సునీల్..ఆసుపత్రిలో చేరిక

Actor-and-comedian-Sunil-admitted-in-Hospital-andhra-talkies
ప్రముఖ కమెడియన్ కమ్ హీరో సునీల్ ఈ రోజు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రి లో చేరారు. ప్రస్తుతం ఆయన కు డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అయితే సునీల్ కు అస్వస్థత అంటూ మీడియాలో వార్తలు రావడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ వార్తలపై సునీల్ స్పందించారు. అభిమానులు.. శ్రేయోభిలాషులు తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..సైనస్.. ఇన్ఫెక్షన్ కారణంగా వైద్యుల సూచనతో ఆసుపత్రి లో చేరినట్లు వెల్లడించారు.

నాపై కామెంట్ చేసే ముందు నీ అమ్మ చెల్లిని గుర్తు తెచ్చుకో

actress-Kasthuri-sensational-comments-on-ajith-fans-and-questioned-about-sex-Andhra-Talkies
సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు సెలబ్రెటీలపై ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. వారి దృష్టిని ఆకర్షించేందుకు కొందరు.. వారిని మానసికంగా ఇబ్బంది పెట్టేందుకు కొందరు అన్నట్లుగా బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. సెలబ్రటీలు ప్రతి ఒక్కరు కూడా బ్యాడ్ కామెంట్స్ ను ఎదుర్కొంటూనే ఉంటారు. కాని కొందరు మాత్రమే ఆ బ్యాడ్ కామెంట్స్ పై సీరియస్ గా స్పందిస్తూ ఉంటారు. తాజాగా సీనియర్ నటి కస్తూరి తనపై ఒక వ్యక్తి చేసిన బ్యాడ్ కామెంట్స్ కు స్పందించింది.

తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈమె ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈమెను కొన్ని రోజుల క్రితం అజిత్ ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. తమ అభిమాన హీరోను అవమానించేలా మాట్లాడావు అంటూ కొన్ని రోజులుగా కస్తూరిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. వారి బ్యాడ్ కామెంట్స్ పై ఎప్పటికప్పుడు కస్తూరి స్పందిస్తూనే ఉంది.

మై లవ్.. సూపర్ మెలోడీతో వచ్చిన రౌడీ

My-Love-Lyrical-Video-Song-From-Vijay-Deverakonda-World-Famous-Lover-Andhra-Talkies
క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా ఫిబ్రవరి 14 న రిలీజ్ కానుంది.  విడుదలకు నెలరోజులే ఉండడంతో ప్రమోషన్స్ ఊపందుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమా నుండి మై లవ్ అంటూ సాగే మొదటి లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.

ఈ సినిమాకు గోపి సుందర్ సంగీత దర్శకుడు. రెహమాన్ ఈ పాటకు సాహిత్యం అందించారు. పాడినవారు శ్రీకృష్ణ.. రమ్య బెహరా.   'ఐ యామ్ సో క్రేజీ బేబీ లైఫ్ ఈజ్ సింగింగ్ లవ్ మెలోడీ' అంటూ కోరస్ తో స్టార్ట్ అయిన పాట 'మై లవ్ మనసును మీటే ఏదో తియ్యని పాటే యదలో ఎపుడూ వినని యదలో ఎపుడూ జరిగే సింఫనీ.. ఐ ఫీల్ నౌ" అంటూ ఎంతో ఆహ్లాదకరంగా సాగింది.  గోపి సుందర్ ఈ పాటకు మంచి లవ్ మూడ్ లో సాగే ఒక మెలోడీ ట్యూన్ అందించగా రమ్య.. శ్రీకృష్ణ ఎంతో చక్కని ఫీల్ తో పాడారు. యూత్ కు వెంటనే కనెక్ట్ అయ్యే పాట ఇది. మేము యూత్ అనుకునేవారికి మాత్రం నాలుగు సార్లు వింటే కనెక్ట్ అవుతుంది.

ముంబై లో నన్ను తెలుగమ్మాయి అనేస్తున్నారు

Sexy-Heroin-Pooja-Hegde-Known-As-Telugu-Girl-In-Mumbai-Andhra-talkies
పూజా హెగ్డేని ఇన్నాళ్లు ముంబై గాళ్ అనే భావిస్తున్నారు. కానీ తన మూలాల్లోకి వెళితే అసలు గుట్టు తెలిసింది. అసలు ముంబైతో కానీ.. నార్త్ తో కానీ ఏ సంబంధం లేదట. పూజా కన్నడ గాళ్. పేరెంట్ వృత్తి రీత్యా ముంబైలో స్థిరపడింది అంతే. ఆర్థిక రాజధానిలో ఫ్యాషన్ ప్రపంచం పోకడలతో తొలి నుంచి అనుబంధం ఉంది కాబట్టి తనని ఓ కన్నడిగ అని భావించలేదు. అయితే తన రూపురేఖలు మాత్రం సౌత్ కి అవినాభావ సంబంధం కలిగి ఉండడం అభిమానుల్లో సందేహం రేకెత్తించింది. తెలుగులో నటిస్తే తెలుగమ్మాయే అంతగా కనెక్టయిపోయింది. అందుకే తనకు స్టార్ డమ్ అంతగా వెలిగిపోతోందిక్కడ.

మేడంను కూడా వదలని థమన్

Sexy-Heroin-Pooja-Hegde-sing-a-samajavaragamana-song-in-avpl-success-Event-Andhra-Talkies

మేడంను కూడా వదలని థమన్

ఒకప్పుడు హీరోలు పాటలు పాడటం చాలా చాలా అరుదుగా జరిగేది. కాని ఇప్పుడు సంగీత దర్శకుడు థమన్ స్టార్ హీరోలందరితో కూడా పాటలు పాడించేందుకు కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే పలువురు హీరోలతో పాటలు పాడించిన థమన్ ఈసారి హీరోయిన్ తో పాట పాడించాడు. అది కూడా ఒక స్టేజ్ పై హీరోయిన్ తో పాట పాడించిన ఘనత థమన్ కు దక్కిందని చెప్పుకోవచ్చు. అల వైకుంఠపురంలో సినిమా సక్సెస్ వేడుకలో ఈ సంఘటన జరిగింది.

థమన్ అందించిన పాటలు అల వైకుంఠపురంలో సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సినిమా విజయం లో కీలక పాత్ర పోషించాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. థమన్ సక్సెస్ వేడుకలో పూజా హెగ్డేతో పాట పాడించాడు. ఆమె సామజవరగమన పాట పల్లవిని పాడి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది. పల్లవి లిరిక్స్ వరకు బాగానే గుర్తు పెట్టుకుని కాస్త కంగారు పడుతూ పాడినా బాగానే పాడింది. ఆమె పాటకు ప్రేక్షకులు ఫిదా అయ్యారని చెప్పుకోవచ్చు.

ఫస్ట్ లుక్ తోనే కట్టి పడేస్తున్న దేవి

Devi-Movie-First-look-Andhra-Talkies
ఈమద్య సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకు మరియు షార్ట్ ఫిల్మ్ లకు మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే స్టార్స్ కూడా వెబ్ సిరీస్ ల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. వెబ్ సిరీస్ లను కూడా కోట్లు పెట్టి నిర్మిస్తున్నారు. ఈ సమయంలోనే షార్ట్ ఫిల్మ్ లకు కూడా డిమాండ్ భారీగానే ఉంది. ఒకప్పుడు అంతా కొత్త వారు మాత్రమే షార్ట్ ఫిల్మ్ చేసేవారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. కొత్త వారు మాత్రమే కాకుండా స్టార్స్ కూడా షార్ట్ ఫిల్మ్ లు చేస్తున్నారు.

బాలీవుడ్ స్టార్స్ కాజోల్.. శృతి హాసన్.. నేహా దుపియా.. నైనా కుల్ కర్ని.. ముక్త భర్వే.. రమ జోషి.. శివానీ రఘువంశీలు ఈ షార్ట్ ఫిల్మ్ లో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఆడవారి యొక్క గొప్పతనంను చాటి చెప్పే విధంగా ఈ దేవి షార్ట్ ఫిల్మ్ ఉంటుందని చెబుతున్నారు. తాజాగా విడుదలైన దేవి ఫస్ట్ లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. విభిన్న తరహా ఆడవారి కలయికతో ఈ షార్ట్ ఫిల్మ్ ఉంటుందని.. ఆడవారికి ఆదర్శంగా కూడా ఉంటుదని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ కు ప్రియాంక బెనర్జీ దర్శకత్వం వహించారు. అతి త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

దీపికకు కంగనా కౌంటర్

Sexy-Heroin-Kangana-Raunat-Comments-on-Deepika-Padukone-Andhra-Talkies
పౌరసత్వ బిల్లు నేపథ్యంలో ఢిల్లీ జేఎన్ యూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనలో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెల్సిందే. జేఎన్ యూలో జరిగిన ఘటనపై పలువురు బాలీవుడ్ స్టార్స్ స్పందించారు. అయితే దీపిక పదుకునే మాత్రం ఏకంగా యూనివర్శిటీకి వెళ్లి జేఎన్ యూ విద్యార్థులకు మద్దతుగా నిలిచిన విషయం తెల్సిందే. దీపిక చేసిన పనిపై బీజేపీ నాయకులు మరియు కేంద్ర మంత్రులు పలువురు చాలా సీరియస్ అయ్యారు. ఆమె దేశ ద్రోహులకు మద్దతుగా నిలుస్తుందంటూ సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ వస్తున్నాయి.

ఆమె నటించిన తాజా చిత్రం ప్రమోషన్ కోసం ఆమె ఇలా చేసిందనే వారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో కంగనా స్పందిస్తూ తాను దీపిక జేఎన్ యూ వెళ్లడంపై స్పందించాలనుకోవడం లేదు. కాని దేశాన్ని విచ్చిన్నం చేసి మన సైనికులు చనిపోతే వేడుకలు చేసుకునే వారికి మద్దతుగా మాత్రం నేను నిలువను. తుక్డే గ్యాంగ్ వెనుక నిల్చోవాలని నేను అనుకోవడం లేదు. ఆమెకు ఎవరికి మద్దతు అయినా ఇచ్చే అర్హత ఉంది.. ఎక్కడకు వెళ్లి అయినా మద్దతు తెలిపే హక్కు ఉందని కంగనా కౌంటర్ వేసింది. కంగనా కౌంటర్ కు దీపిక ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

ఫేమస్ సింగర్ కి అరుదైన ప్రాణాంతక వ్యాధి

Famous-Singer-Justin-Bieber-has-been-suffering-from-Lyme-disease-Andhra-Talkies
ఫేమస్ సింగర్ కి అరుదైన ప్రాణాంతక వ్యాధి

ఫేమస్ సింగర్ కి అరుదైన ప్రాణాంతక వ్యాధి

రోగాలకు ఎవరూ ఎవరూ అతీతులు కారు. టైమ్ బ్యాడ్ అయితే రోగం తప్పదు. ప్రపంచం సాంకేతికంగా ఎంత వేగంగా ఎదుగుతున్నా అంతు చిక్కని రోగాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే అరుదైన వ్యాధులు ధనవంతులకే ఎక్కువగా వస్తున్నాయని చాలా సర్వేలు నిరూపించాయి. క్యానర్- ఎయిడ్స్ లాంటి ప్రాణాంతక జబ్బులకు శాశ్వత పరిష్కారం దొరకడం లేదు. ఈ జబ్బులపై కొన్ని దశాబ్ధాలుగా పరిశోధన జరుగుతోన్న మందు మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. ఇవన్నీ సైన్స్ కు దొరకనివి.

తాజాగా ఫేమస్ కెనెడియన్ సింగర్ జస్టిన్ బీబర్ లైమ్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యాధి వల్ల బీబర్ బక్క చిక్కిపోయాడు. బాగా నీరసించి కనిపిస్తున్నాడు. ఈ వ్యాధి మొదడు పనితీరు సహా శరీరంలో ఇతర అవయవాలపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుందిట. చర్మం కుంచించుకుపోయినట్లు అయిందిట. బీబర్ బాగా సన్నబడటంతో అభిమానులకు సందేహం రావడంతో ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఈ విశేషాలను బీబర్ పంచుకున్నాడు. ప్రస్తుతం ట్రీట్ మెంట్ జరుగుతోందని తెలిపాడు.

బ్యాడ్ న్యూస్ చెప్పిన స్టార్ నటుడు

Bollywood-Actor-Irrfan-khan-disease-Andhra-talkies
బ్యాడ్ న్యూస్ చెప్పిన స్టార్ నటుడు

బ్యాడ్ న్యూస్ చెప్పిన స్టార్ నటుడు

బాలీవుడ్ విలక్షన నటుడిగా గుర్తింపు దక్కించుకున్న ఇర్ఫాన్ ఖాన్ 2017 నుండి క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెల్సిందే. అప్పట్లోనే తనకు క్యాన్సర్ ఎటాక్ అయినట్లుగా ప్రకటించాడు. అయినా కూడా సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా ప్రధాన పాత్రల్లో హీరోగా కూడా ఈయన నటించాడు.. నటిస్తూనే ఉన్నాడు. ఇర్ఫాన్ ఖాన్ ప్రస్తుతం వెబ్ సిరీస్ ను చేస్తున్నాడు. ఆ వెబ్ సిరీస్ దాదాపుగా పూర్తి అయ్యింది. ఇక కొన్ని రోజులుగా కొత్త ప్రాజెక్ట్ లకు ఇర్ఫాన్ నో చెబుతూ వచ్చాడు.

క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటూనే ఇర్ఫాన్ ఇన్నాళ్లు నటించాడు మరి ఉన్నట్లుండి ఇప్పుడు ఎందుకు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నాడా అంటూ అంతా అనుకున్నారు. ఇలాంటి సమయంలోనే ఇర్ఫాన్ ఖాన్ షాకింగ్ వార్తను ప్రకటించాడు. తన ఆరోగ్యం ఏమాత్రం సరిగా లేదని.. అందుకే అమెరికాలో చికిత్స నిమిత్తం వెళ్తున్నాను. అక్కడ 9 నెలల పాటు చికిత్స తీసుకోబోతున్నట్లుగా ప్రకటించాడు. సినిమాలకు 8 నెలల పాటు బ్రేక్ ఇవ్వబోతున్నట్లుగా కూడా ఇర్ఫాన్ ప్రకటించాడు. ఈ వార్త ఆయన అభిమానులకు తీవ్ర నిరాశను కలిగిస్తుంది.


తానే స్వంతంగా రన్ చేస్తానంటున్న శృతిహాసన్

Popular-Heroin-Shruthi-Hassan-Maintains-Her-Own-Social-Media-Accounts-By-Her-Andhra-Talkies
మీడియాను మించి పోతోంది సోషల్ మీడియా. హద్దులు లేని రీతిలో చెలరేగిపోతున్న సోషల్ మీడియాకు కళ్లాలు వేసే శక్తి ఇప్పుడెవరికి లేదు. ఎవరైనా సరే.. దాని తో పాటు అడుగులు వేయాల్సిందే. ఈ వాస్తవాన్ని గుర్తించిన ప్రముఖులు.. సెలబ్రిటీలు మూడు నాలుగేళ్ల కింద నుంచే తమ సోషల్ మీడియా ఖాతాల్ని నిర్వహించేందుకు ఎవరికి వారు.. ఒక టీంను ఏర్పాటు చేసుకున్న పరిస్థితి.

గతంలో కారు డ్రైవర్.. పర్సనల్ అసిస్టెంట్.. ఇలాంటివి ఎంత ముఖ్యమో.. ఇవాల్టి రోజున ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాల్ని నిర్వహించే టీం తప్పని సరిగా మారింది. సోషల్ మీడియా టీం లేని వారు ఇప్పుడు చాలా తక్కువ. అన్నింటికి మించి సోషల్ మీడియాను తమకుతాముగా సొంతంగా నిర్వహించేటోళ్లు చాలా తక్కువ మంది కనిపిస్తారు.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పెడితే చేరతానన్న శ్రీరెడ్డి

Sexy-Actor-Sri-Reddy-Gives-clarity-on-About-Her-Political-Entry-Andhra-Talkies
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ నిత్యం వార్తల్లో నిలిచే ఆమె తాజాగా తన ఫేస్ బుక్ లైవ్ లో కీలక వ్యాఖ్యలు చేసింది. పొట్టి దుస్తులకు హాట్ గా కనిపించే శ్రీరెడ్డి..కొన్నిసార్లు అందుకు భిన్నంగా పరమ వీర భక్తురాలి మాదిరి కనిపిస్తారు. పెద్ద ఎత్తున పూజలు చేయించటం.. అమ్మోరిలో తయారై తనలోని షేడ్స్ ను ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తుంటారు.

తాజాగా తన పొలిటికల్ ఎంట్రీ మీద ఆసక్తికర వ్యాఖ్యల్ని చేసింది. తనకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఇష్టమని.. ఆయన కానీ పార్టీ పెడితే ఆ పార్టీలో చేరతానని స్పష్టం చేసింది. వివాదాలకు దూరంగా ఉండే రజనీకాంత్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఆయన శాంత స్వభావం నచ్చుతుందన్నారు. ప్రస్తుతం తాను రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.

అదరగొట్టిన ఆది | Hyper Aadi Performance | Jabardasth

అదరగొట్టిన ఆది | Hyper Aadi, Raising Raju Performance | Jabardasth

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...