అస్వస్థత కు గురైన సునీల్..ఆసుపత్రిలో చేరిక

Actor-and-comedian-Sunil-admitted-in-Hospital-andhra-talkies
ప్రముఖ కమెడియన్ కమ్ హీరో సునీల్ ఈ రోజు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రి లో చేరారు. ప్రస్తుతం ఆయన కు డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అయితే సునీల్ కు అస్వస్థత అంటూ మీడియాలో వార్తలు రావడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ వార్తలపై సునీల్ స్పందించారు. అభిమానులు.. శ్రేయోభిలాషులు తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..సైనస్.. ఇన్ఫెక్షన్ కారణంగా వైద్యుల సూచనతో ఆసుపత్రి లో చేరినట్లు వెల్లడించారు.కమెడియన్ గా ఒక దశలో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్న సునీల్ తర్వాత హీరోగా సినిమాలు చేయడం ప్రారంభించారు. మొదట్లో సునీల్ సినిమాలకు ఆదరణ లభించింది.. మంచి విజయాలు కూడా సాధించారు. అయితే వరస ఫ్లాపులతో ఇబ్బందిపడడంతో హీరోగా నటించే సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్లీ కమెడియన్ గా రీ-ఎంట్రీ ఇచ్చారు. ఈ మధ్య సంక్రాంతికి విడుదలైన అల్లు అర్జున్ సినిమా 'అల వైకుంఠపురములో' సినిమాలో నటించారు.

ఇదిలా ఉంటే రేపు విడుదల కానున్న రవితేజ 'డిస్కోరాజా' సినిమాలో సునీల్ ఒక కీలక పాత్ర పోషించారు. కమెడియన్ గానే కాకుండా సునీల్ విభిన్నమైన పాత్రలు పోషించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 'కలర్ ఫోటో' అనే సినిమాలో సునీల్ విలన్ పాత్ర లో నటిస్తున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...