ఐశ్వర్యారాయ్ అమ్మ కాబోతుండటమే సర్ ప్రైజా అభిషేక్ బచ్చన్?

Aishwarya-Husbend-Abhishek-Bhachchan-Giving-Suprise-To-His-Fans-Andhra-Talkies

ఐశ్వర్యారాయ్ అమ్మ కాబోతుండటమే సర్ ప్రైజా అభిషేక్ బచ్చన్?

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఇటీవల సోషల్ మీడియాలో హాయ్ మీ అందరికి ఒక సర్ ప్రైజ్ వేచి చూస్తూ ఉండండి అంటూ పోస్ట్ చేశాడు. ఆ సర్ ప్రైజ్ ఏమై ఉంటుందా అంటూ ఆయన ఫాలోవర్స్ మరియు మీడియాలో చూసిన వారు అంతా కూడా జుట్టు పీక్కుంటున్నారు. ఎట్టకేలకు ఆ సర్ ప్రైజ్ ఏంటీ అనే విషయమై ఒక క్లారిటీ వచ్చింది. అధికారికంగా అయితే అభిషేక్ క్లారిటీ ఇవ్వకున్నా బాలీవుడ్ వర్గాలు మరియు బచ్చన్ ఫ్యామిలీ మెంబర్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆ సర్ ప్రైజ్ ఏంటీ అంటే ఐశ్వర్య మళ్లీ తల్లి కాబోతుండటమే.

ఔను గత కొన్ని రోజులుగా కెమెరాకు దూరంగా ఉన్న ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరి కొన్ని నెలల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుందట. ఈ విషయాన్ని అనధికారికంగా బచ్చన్ కుటుంబ సభ్యులు జాతీయ మీడియాతో చెప్పినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ వర్గాల్లో కూడా ఇదే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఐశ్వర్యరాయ్.. అభిషేక్ బచ్చన్ లకు ఒక పాప ఉంది. ఇప్పుడు ఆ పాప అక్క అవ్వబోతుంది. ఆమెకు బుల్లి తమ్ముడు లేదా చెల్లి రాబోతుంది.ఈ విషయాన్ని జూనియర్ బచ్చన్ సర్ ప్రైజ్ గా ఉంచాలని ఐశ్వర్య రాయ్ డెలవరీ అయిన తర్వాత రివీల్ చేయాలనుకున్నట్లుగా ఉన్నాడు. కాని అది అప్పుడే రివీల్ అయ్యింది. ఏమాత్రం అనుమానాలు లేకుండా బచ్చన్ ఫ్యామిలీ నుండి ఒకరు మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్ని అధికారికంగా క్లారిటీ ఇస్తే బాగుండు అంటూ కొందరు ఆశ పడుతున్నారు. అది చేస్తే జూనియర్ బచ్చన్ చేయాలి. ఆ సస్పెన్స్ ను రివీల్ చేస్తూ ఐశ్వర్య గర్బవతి అంటూ ఆయన ప్రకటన కోసం బచ్చన్ మరియు రాయ్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...