బ్యాడ్ న్యూస్ చెప్పిన స్టార్ నటుడు

Bollywood-Actor-Irrfan-khan-disease-Andhra-talkies
బ్యాడ్ న్యూస్ చెప్పిన స్టార్ నటుడు

బ్యాడ్ న్యూస్ చెప్పిన స్టార్ నటుడు

బాలీవుడ్ విలక్షన నటుడిగా గుర్తింపు దక్కించుకున్న ఇర్ఫాన్ ఖాన్ 2017 నుండి క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెల్సిందే. అప్పట్లోనే తనకు క్యాన్సర్ ఎటాక్ అయినట్లుగా ప్రకటించాడు. అయినా కూడా సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా ప్రధాన పాత్రల్లో హీరోగా కూడా ఈయన నటించాడు.. నటిస్తూనే ఉన్నాడు. ఇర్ఫాన్ ఖాన్ ప్రస్తుతం వెబ్ సిరీస్ ను చేస్తున్నాడు. ఆ వెబ్ సిరీస్ దాదాపుగా పూర్తి అయ్యింది. ఇక కొన్ని రోజులుగా కొత్త ప్రాజెక్ట్ లకు ఇర్ఫాన్ నో చెబుతూ వచ్చాడు.

క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటూనే ఇర్ఫాన్ ఇన్నాళ్లు నటించాడు మరి ఉన్నట్లుండి ఇప్పుడు ఎందుకు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నాడా అంటూ అంతా అనుకున్నారు. ఇలాంటి సమయంలోనే ఇర్ఫాన్ ఖాన్ షాకింగ్ వార్తను ప్రకటించాడు. తన ఆరోగ్యం ఏమాత్రం సరిగా లేదని.. అందుకే అమెరికాలో చికిత్స నిమిత్తం వెళ్తున్నాను. అక్కడ 9 నెలల పాటు చికిత్స తీసుకోబోతున్నట్లుగా ప్రకటించాడు. సినిమాలకు 8 నెలల పాటు బ్రేక్ ఇవ్వబోతున్నట్లుగా కూడా ఇర్ఫాన్ ప్రకటించాడు. ఈ వార్త ఆయన అభిమానులకు తీవ్ర నిరాశను కలిగిస్తుంది.


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...