పంచ్ లు వేసినంత తేలికకాదు ఆది పోస్ట్ లు పెట్టడం

Hyper-Aadhi-Remembering-MS-Narayana-Death-Anniversary-Andhra-Talkies

పంచ్ లు వేసినంత తేలికకాదు ఆది పోస్ట్ లు పెట్టడం

తెలుగు ప్రేక్షకులుకు హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుల్లి తెర సెన్షేషన్ కామెడీ షో జబర్దస్ లో ప్రస్తుతం టాప్ కమెడియన్ గా ఉండటంతో పాటు వరుసగా చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు. హీరోగా కూడా అవకాశాలు వస్తున్నాయి. కాని వెయిట్ అండ్ సీ దోరణిలో ఉన్నాడు. ఆది కామెడీ స్కిట్ లో కాన్సెప్ట్ కంటే పంచ్ లు ఎక్కువ ఉంటాయనే విషయం తెల్సిందే. ప్రతి దానికి పంచ్ లు వేస్తూ ప్రేక్షకులను నవ్వించే ఆది తాజాగా నవ్వులపాలయ్యాడు.

నేడు ప్రముఖ దివంగత కమెడియన్ ఎంఎస్ నారాయణ వర్ధంతి. ఆయన వర్ధంతి సందర్బంగా శ్రేయాస్ మీడియా సంస్థ వారు తమ సోషల్ మీడియాలో పేజ్ లలో ఆయన వర్థంతి సందర్బంగా ఆయన్న జ్ఞాపకాల్లో అంటూ పోస్ట్ చేశారు. ఆ ఫొటోను ఉన్నది ఉన్నట్లుగా పోస్ట్ చేసిన ఆది పైన మాత్రం హ్యాపీ బర్త్ డే సర్ అంటూ పోస్ట్ చేశాడు. ఎంఎస్ నారాయణ చనిపోయి అయిదు సంవత్సరాలు అయ్యింది. అయినా బర్త్ డే అయినా కూడా చనిపోయారు కనుక జయంతి అనాలి. చనిపోయిన రోజును వర్థంతి అనే విషయం ఆది మర్చిపోయాడా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


ఆది పోస్ట్ చేసిన కొద్ది సేపట్లోనే అది కాస్త వైరల్ అయ్యింది. చనిపోయిన వ్యక్తికి వర్ధంతి రోజు హ్యాపీ బర్త్ డే అంటూ పోస్ట్ చేయడం ఏంటీ బాసూ అంటూ ఆది పోస్ట్ కి కామెంట్స్ చేశారు. దాంతో వెంటనే ఆది ఆ పోస్ట్ ను డిలీట్ చేసి వర్థంతి అంటూ పోస్ట్ చేశాడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఆదిని ఏదైనా పోస్ట్ చేసే ముందు కాస్త చూసుకోవాలంటూ నెటిజన్స్ సలహా ఇస్తున్నారు. పంచ్ లు వేసినంత తేలికగా పోస్ట్ లు పెడతానంటే ఇలాగే జరుగుతుంది. కాస్త చూసుకుని పెట్టు అంటూ ఆదికి నెటిజన్స్ సూచిస్తున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...