కావాల్సినంత ఎక్స్ పోజ్ చేసి అబద్దం అంటే ఎలా ఆంటీ?

Pachamanga-Fame-Sona-Denies-Being-Glamourous-Andhra-Talkies

కావాల్సినంత ఎక్స్ పోజ్ చేసి అబద్దం అంటే ఎలా ఆంటీ?

భాష ఏదైనా.. ఏ రకం సినిమా అయినా.. ఎలాంటి కంటెంట్ అయినా కూడా సినిమాలో కాస్త బూతు ఉంటేనే ప్రేక్షకులు ఆధరిస్తున్నారు అనేది అందరు ఒప్పుకునే నిష్ఠుర నిజం. మంచి కాన్సెప్ట్ తో చేసే సినిమాలకు పబ్లిసిటీ కావాలంటే కాస్త గ్లామర్ టచ్ ఇవ్వాల్సిందే. అది తెలుగులో అయినా లేదంటే మరే ఇతర భాషలో తెరకెక్కిన సినిమా అయినా కాస్త రొమాంటిక్ సీన్స్ ఉన్నాయంటూ ట్రైలర్ లో చూపిస్తే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి ఉంది. అందుకే మలయాళ చిత్రం పచ్చమాంగ ట్రైలర్ లో సీనియర్ నటి సోన ఎక్స్ పోజింగ్ సీన్స్ చూపించారు.

పచ్చమాంగ ట్రైలర్ చాలా వైరల్ అయ్యింది. ఆ ట్రైలర్ ను భారీ ఎత్తున ప్రేక్షకులు చూశారు.. ఇంకా చూస్తూనే ఉన్నారు. ఆ ట్రైలర్ చూసిన తర్వాత సౌత్ ఇండియాకు మరో షకీలా దొరికింది అంటూ కామెంట్స్ చేస్తున్నారట. ఇన్నాళ్లకు షకీలాకు వారసురాలు లభించింది ఇండస్ట్రీకి అంటూ మలయాళ ప్రేక్షకులు కామెంట్స్ తో రెచ్చి పోతున్నారు. పచ్చమాంగ ట్రైలర్ లో సోనా కాస్ట్యూమ్స్ మరియు ఆమె ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ కాస్త అప్పటి షకీలాను తలపించేలా ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా కొందరు గుసగుసలాడుకుంటున్నారు.తనను కొత్త షకీలా అంటూ కామెంట్స్ చేస్తున్న వారి నోళ్లు మూయించేందుకు సోనా మీడియా ముందుకు వచ్చింది. అది ఒక క్లాస్ మూవీ అని.. కథకు అవసరం కనుక తాను అలా నటించాను తప్ప సినిమాలో ఎలాంటి బూతు ఉండదని.. ఎలాంటి అశ్లీల సీన్స్ లో తాను నటించలేదు అంటూ సోనా చెప్పుకొచ్చింది. దయచేసి ఎవరు తప్పుగా కామెంట్స్ చేయవద్దని వేడుకుంటుంది.

ట్రైలర్ లోనే అంత ఎక్స్ పోజింగ్ తో కనిపిస్తే సినిమాలో ఇంకెంత ఎక్స్ పోజ్ చేసి ఉంటుందో అనుకుంటున్నారు. అంతగా ఎక్స్ పోజ్ చేసి అదంతా కూడా నిజం కాదు.. ఎలాంటి అశ్లీలత లేదు అంటే ఎలా సోనా ఆంటీ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సినిమా విడుదల అయితే ఆమె పూర్తి పాత్రను తెలుసుకున్న తర్వాత ఈ కామెంట్స్ ఏమైనా తగ్గుతాయేమో చూడాలి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...