నిర్మాత దిల్ రాజు కి ఏమైనా మెంటలా?

Producer-Dil-Raju-on-about-Jaan-Movie-Andhra-Talkies

నిర్మాత దిల్ రాజు కి ఏమైనా మెంటలా?

రెండేళ్ళ క్రితం తమిళ్ లో వచ్చిన సూపర్ హిట్టయిన '96' సినిమాను దిల్ రాజు తెలుగులో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ కి రెడీ చేసారు కూడా. ఫిబ్రవరి 7 న సినిమా థియేటర్స్ లోకి వస్తుంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ ను హడావుడిగా రిలీజ్ చేసారు. ఈ ఈవెంట్ లోనే రాజు గారు తనను తిట్టుకున్నా విషయాన్ని చెప్పుకున్నారు.

"ఇన్నేళ్ళ నా కెరీర్ లో ఎప్పుడూ రీమేక్ సినిమా చేయలేదు. ఒకటి రెండు అనుకున్నా ఎందుకులే ఏముంటుంది అని పక్కన పెట్టేసాను. కానీ '96' సినిమాను రిలీజ్ కంటే ముందు చెన్నై వెళ్లి చూసాను. ప్రీవ్యూ థియేటర్ నుండి బయటికి రాగానే అప్పుడే ఈ సినిమాను రీమేక్ చేద్దామని డిసైడ్ అయ్యాను. నేను '96'  రీమేక్ చేస్తున్నా అని బయటికి రాగానే అందరూ దిల్ రాజు కి ఏమైనా మెంటలా ? క్లాసిక్ ను ఇప్పుడు రీమేక్ చేయడం అవసరమా అనుకున్నారు. కానీ నేను పొందిన ఆ అనుభూతి మన తెలుగు ప్రేక్షకులందరూ పొందాలని ఫైనల్ గా చేసేసాను. ఫిబ్రవరి 7 న నేను ఆడితే ఫీలయ్యానో అందరూ అదే ఫీలవుతారు" అంటూ చెప్పుకున్నాడు.నిజానికి ఈ సినిమా ఎంత హడావుడిగా పూర్తి చేసారో అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల పాటు రాజు గారు ఈ సినిమాను పట్టించుకోకుండా వదిలేసారు కూడా. మళ్ళీ ఫైనల్ అవుట్ పుట్ చూసి ప్రమోషన్స్ మొదలెట్టారు.  అయితే అనుకోకుండా డేట్ ఫిక్స్ చేసి అప్పటికప్పుడు ప్రమోషన్ ప్లాన్ చేసుకున్నారు. మరి వారం రోజుల్లో ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లోకి ఎలా తీసుకెళ్తారో చూడాలి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...