తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పెడితే చేరతానన్న శ్రీరెడ్డి

Sexy-Actor-Sri-Reddy-Gives-clarity-on-About-Her-Political-Entry-Andhra-Talkies
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ నిత్యం వార్తల్లో నిలిచే ఆమె తాజాగా తన ఫేస్ బుక్ లైవ్ లో కీలక వ్యాఖ్యలు చేసింది. పొట్టి దుస్తులకు హాట్ గా కనిపించే శ్రీరెడ్డి..కొన్నిసార్లు అందుకు భిన్నంగా పరమ వీర భక్తురాలి మాదిరి కనిపిస్తారు. పెద్ద ఎత్తున పూజలు చేయించటం.. అమ్మోరిలో తయారై తనలోని షేడ్స్ ను ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తుంటారు.

తాజాగా తన పొలిటికల్ ఎంట్రీ మీద ఆసక్తికర వ్యాఖ్యల్ని చేసింది. తనకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఇష్టమని.. ఆయన కానీ పార్టీ పెడితే ఆ పార్టీలో చేరతానని స్పష్టం చేసింది. వివాదాలకు దూరంగా ఉండే రజనీకాంత్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఆయన శాంత స్వభావం నచ్చుతుందన్నారు. ప్రస్తుతం తాను రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.రజనీ కానీ పార్టీ పెడితే తాను ఆ పార్టీలో చేరతానన్న శ్రీరెడ్డి.. ఒకవేళ ఆయన ఏదైనా పార్టీకి తన మద్దతు ఇస్తే.. తాను ఆ పార్టీలో చేరతానని చెప్పింది. తనకు మాదిరే రజనీకి దైవభక్తి ఎక్కువని.. అందుకే ఆయన ఆలోచనకు తన మద్దతు ఇస్తానని చెప్పుకొచ్చింది. దేవుడి మీద భక్తి విషయంలో రజనీకాంత్ ను తనతో పోల్చుకోవటం శ్రీరెడ్డికి మాత్రమే సాధ్యమవుతుందేమో?

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...