మేడంను కూడా వదలని థమన్

Sexy-Heroin-Pooja-Hegde-sing-a-samajavaragamana-song-in-avpl-success-Event-Andhra-Talkies

మేడంను కూడా వదలని థమన్

ఒకప్పుడు హీరోలు పాటలు పాడటం చాలా చాలా అరుదుగా జరిగేది. కాని ఇప్పుడు సంగీత దర్శకుడు థమన్ స్టార్ హీరోలందరితో కూడా పాటలు పాడించేందుకు కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే పలువురు హీరోలతో పాటలు పాడించిన థమన్ ఈసారి హీరోయిన్ తో పాట పాడించాడు. అది కూడా ఒక స్టేజ్ పై హీరోయిన్ తో పాట పాడించిన ఘనత థమన్ కు దక్కిందని చెప్పుకోవచ్చు. అల వైకుంఠపురంలో సినిమా సక్సెస్ వేడుకలో ఈ సంఘటన జరిగింది.

థమన్ అందించిన పాటలు అల వైకుంఠపురంలో సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సినిమా విజయం లో కీలక పాత్ర పోషించాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. థమన్ సక్సెస్ వేడుకలో పూజా హెగ్డేతో పాట పాడించాడు. ఆమె సామజవరగమన పాట పల్లవిని పాడి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది. పల్లవి లిరిక్స్ వరకు బాగానే గుర్తు పెట్టుకుని కాస్త కంగారు పడుతూ పాడినా బాగానే పాడింది. ఆమె పాటకు ప్రేక్షకులు ఫిదా అయ్యారని చెప్పుకోవచ్చు.

ఇప్పటి వరకు హీరోలతో పాటలు పాడించిన థమన్ ఇకపై హీరోయిన్స్ తో కూడా సినిమాల్లో పాడించవచ్చు అంటున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్. ఈ అమ్మడి పాట సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. భాష రాకున్నా కూడా లిరిక్స్ గుర్తు పెట్టుకుని పాడటంపై అంతా ప్రశంసిస్తున్నారు. ఏమాత్రం ప్రాక్టీస్ లేకుండానే థమన్ అడిగిన వెంటనే పూజా పాడటం అభినందనీయం.

Read More : ముంబై లో నన్ను తెలుగమ్మాయి అనేస్తున్నారు


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...