నాపై కామెంట్ చేసే ముందు నీ అమ్మ చెల్లిని గుర్తు తెచ్చుకో

actress-Kasthuri-sensational-comments-on-ajith-fans-and-questioned-about-sex-Andhra-Talkies
సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు సెలబ్రెటీలపై ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. వారి దృష్టిని ఆకర్షించేందుకు కొందరు.. వారిని మానసికంగా ఇబ్బంది పెట్టేందుకు కొందరు అన్నట్లుగా బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. సెలబ్రటీలు ప్రతి ఒక్కరు కూడా బ్యాడ్ కామెంట్స్ ను ఎదుర్కొంటూనే ఉంటారు. కాని కొందరు మాత్రమే ఆ బ్యాడ్ కామెంట్స్ పై సీరియస్ గా స్పందిస్తూ ఉంటారు. తాజాగా సీనియర్ నటి కస్తూరి తనపై ఒక వ్యక్తి చేసిన బ్యాడ్ కామెంట్స్ కు స్పందించింది.

తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈమె ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈమెను కొన్ని రోజుల క్రితం అజిత్ ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. తమ అభిమాన హీరోను అవమానించేలా మాట్లాడావు అంటూ కొన్ని రోజులుగా కస్తూరిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. వారి బ్యాడ్ కామెంట్స్ పై ఎప్పటికప్పుడు కస్తూరి స్పందిస్తూనే ఉంది.


తాజాగా నాపై బ్యాడ్ కామెంట్స్ పెట్టే వారు మొదట వారి తల్లిని మరియు చెల్లిని గుర్తు తెచ్చుకుంటే బాగుంటుంది అంటూ సలహా ఇచ్చింది. ఈ పోస్ట్ కు కూడా నెటిజన్స్ తీవ్రంగా కామెంట్స్ చేస్తున్నారు. ఆమెను మరోసారి టార్గెట్ చేసి నీవు చేసేలా మా అమ్మ చెల్లి ప్రవర్తించడం లేదు.. నీకు వారితో పోలిక ఏంటీ అంటూ మరింతగా రెచ్చి పోతున్నారు. అలాంటి కామెంట్స్ చేసే వారిని పట్టించుకోకుండా ఉండటం మంచిదని కొందరు సలహా ఇస్తున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...