ఆరోజే రంజితకు నేను చెప్పి ఉంటే బాగుండేది

paruchuri-gopala-krishna-about-ranjitha-Andhra-Talkies
తెలుగు మరియు తమిళంలో పలు చిత్రాల్లో నటించి ఒకప్పుడు నటిగా మంచి గుర్తింపు దక్కించుకున్న హీరోయిన్ రంజిత. ఈమె నటిగా మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే నిత్యానందతో రాసలీలలు వీడియో బయటకు వచ్చి కెరీర్ నాశనం అయ్యింది. అతడి భక్తి పారవశ్యంలో మునిగి పోయి అతడికి సేవ చేస్తున్నాను అనుకుని తన కెరీర్ ను నాశనం చెసుకుంది. ప్రస్తుతం రంజిత ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. అలాంటి రంజిత గురించి పరుచూరి గోపాల కృష్ణ ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు.పరుచూరి గోపాల కృష్ణ తన యూట్యూబ్ ఛానెల్ లో తాజా ఎపిసోడ్ లో మాట్లాడుతూ.. నా చిన్న కూతురు స్నేహితురాలు రంజిత. ఆమె ఒకసారి నా కూతురు తో ఇంటికి వచ్చిన సమయం లో ఆమెను చూసి హీరోయిన్ అయ్యే ఫీచర్స్ ఉన్నాయనుకున్నాను. కడప రెడ్డమ్మ అనే చిత్రంతో ఆమెను హీరోయిన్ గా నేను పరిచయం చేశాను. ఆమె మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత తమిళంలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఒకసారి రైల్వే స్టేషన్ లో కలిసిన సందర్బంగా చిన్న పిల్ల మాదిరిగా నా వద్దకు వచ్చి థ్యాంక్స్ అంకుల్ మీ వల్లే ఈ కెరీర్ అంటూ కృతజ్ఞతలు చెప్పింది.

ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు రంజితను కలవడం జరిగింది. ఆ సమయంలో నిత్యానందకు సంబంధించిన ఒక బుక్ ను తీసుకు వచ్చిన ఆమె అతడి గురించి తెలుసుకోవాల్సిందిగా కోరింది. కాని నాకు అలాంటి వారిపై నమ్మకం లేదని చెప్పాను. ఆ సమయంలోనే నేను ఆమెకు నువ్వు కూడా ఇలాంటివి నమ్మకుండా కెరీర్ పై దృష్టి పెట్టు అని చెప్పాల్సింది. ఆమె అతడి భక్తి మత్తు లో మరీ అంతగా మునిగి పోతుందని అనుకోలేదు అంటూ పరుచూరి ఆవేదన వ్యక్తం చేశాడు.

నిత్యానందతో ఆమె వీడియో బయట కు వచ్చిన సమయం లో నా గుండె పగిలి పోయినంత పనైంది. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న ఆమెకు ఇలాంటి పరిస్థితి ఏంటీ అనుకున్నాను. భక్తి అనే భావనతో ఆమె మోసపోయింది. కాని రంజిత ఎక్కడున్నా బాగుండాలి.. ఆమె నాకు కూతురులా అంటూ పరుచూరి పలుకులులో పేర్కొన్నాడు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...