రూపాయికి రూపాయి లాభం ఎక్కడండీ!

Director-Anil-Ravipudi-On-About-Sarileru-Neekevvaru-Movie-Andhra-Talkies

రూపాయికి రూపాయి లాభం ఎక్కడండీ!

సంక్రాంతి బరిలో రిలీజైన చిత్రాల్లో `అల వైకుంఠపురములో` క్లీన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే సంక్రాంతి సెలవుల్ని క్యాష్ చేసుకోవడంలో సరిలేరు నీకెవ్వరు ప్రతాపం చూపించింది. కంటెంట్ వీక్ అని క్రిటిక్స్ తేల్చేసినా పండగ సెలవులు ఈ సినిమాని 100 కోట్ల షేర్ వరకూ లేపాయని ట్రేడ్ విశ్లేషించింది. అయినా కొన్నిచోట్ల డెఫిషిట్ పడిందన్న టాక్ కూడా వినిపించింది. 50 డేస్ బ్లాక్ బస్టర్ కా బాప్! అంటూ నేడు కొత్త పోస్టర్ వేసి సరిలేరు టీమ్ పండగ చేసుకోవడం మరోసారి చర్చకు వచ్చింది. ఎన్ని థియేటర్లలో ఆడిందో పోస్టర్ పై  మాత్రం వేయలేదు.

ఇంట్లోంచి పారిపోయిన నటవారసుడు!

Actor-Sanjay-Rao-Talking-About-O-Pitta-Katha-Story-Line-Andhra-Talkies
ఇంట్లోంచి పారిపోయిన నటవారసుడు!

ఇంట్లోంచి పారిపోయిన నటవారసుడు!

ఏదో ఒక ఎమోషనల్ మూవ్ మెంట్ లో కొందరు చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోతుంటారు. ఆ కోవకే తాను కూడా చెందుతానని చెప్పాడు బ్రహ్మాజీ నట వారసుడు సంజయ్ రావు. ఓ పిట్ట కథ సినిమాతో హీరో అవుతున్న సంజయ్ చిన్నప్పుడు తనని ఇంట్లో ఏదో అంటే ఇల్లు వదిలి పారిపోయాడట. పదిరోజులు బయటే గడిపాడు. దాంతో అందరూ దిగొచ్చారట.

అసలు మర్చంట్ నావీ ఉద్యోగం వదిలేసి ఇటెందుకొచ్చారు? అని ప్రశ్నిస్తే .. డబ్బు సంపాదన కంటే ఇంకేదైనా కావాలనే క్రియేటివ్ సైడ్ వచ్చానని తెలిపాడు. ఉద్యోగం వదిలేశాక... నటనలోకి రావాలనుకున్నప్పుడు ఆరు నెలలు ముంబై వెళ్లా. ఇక్కడ కమ్యూనికేషన్ లేదు. కానీ చాలా నేర్చుకున్నా. ఇక పరిశ్రమలో నాన్న (బ్రహ్మాజీ)గారి మార్గదర్శనం ఉంటుంది. తప్పా ఒప్పా కాదు పడి లేస్తూ నేర్చుకో అని చెబుతారు. సలహాలిస్తారు.

పాపం రాశిఖన్నా గుడ్డి దీపం కూడా ఆరిపోయింది

Heroin-Raashi-Khanna-Career-In-Dilemma-Andhra-Talkies
పాపం రాశిఖన్నా గుడ్డి దీపం కూడా ఆరిపోయింది

పాపం రాశిఖన్నా గుడ్డి దీపం కూడా ఆరిపోయింది

ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశిఖన్నా మొదటి సినిమాతో బాగానే నటిస్తుంది కాని బాగా లావుగా ఉందని విమర్శలు ఎదుర్కొంది. దాంతో కష్టపడి బరువు తగ్గి నాజూకుగా తయారు అయ్యింది. నాజూకుగా అయిన తర్వాత ఈమెకు మంచి ఆఫర్లే వచ్చాయి. కాని దురదృష్టమో ఏమో కాని ఈమె చేసిన సినిమాలు సక్సెస్ అయినా ఫ్లాప్ అయినా కూడా ఈమె కెరీర్ మాత్రం అలాగే ఉండి పోయింది.

రాశిఖన్నా కెరీర్ లో ఒక ఎదుగు లేదు బొదుగు లేకుండా తయారు అయ్యింది. దాంతో తెలుగులో ఆమెకు అవకాశాలు రావడమే గగనం అయ్యింది. ప్రతి రోజు పండుగతో గత ఏడాది చివర్లో కాస్త పర్వాలేదు అన్నట్లుగా సక్సెస్ దక్కించుకున్నా కూడా రాశిఖన్నాకు ఛాన్స్ లు రాలేదు. ఇక విజయ్ దేవరకొండతో చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతో ఖచ్చితంగా సక్సెస్ దక్కుతుందని ఆశ పెట్టుకుంది. ఈ చిత్రంతో మళ్లీ బిజీ అవ్వొచ్చు అని ఆశించింది. కాని ఆమె ఆశ నిరాశ అయ్యింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - దర్శకుడు క్రిష్ సినిమాకు ఆ హీరోయిన్ ఫిక్స్

Savithri-fame-Heroin-Keerthy-Suresh-Is-Heroine-For-Pawan-Kalyan-Andhra-Talkies
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - దర్శకుడు క్రిష్ సినిమాకు ఆ హీరోయిన్ ఫిక్స్

పవన్ - క్రిష్ సినిమాకు ఆ హీరోయిన్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన రీఎంట్రీ చిత్రం 'పింక్' రీమేక్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.  ఈ సినిమాకు 'వకీల్ సాబ్' అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం.  ఇదిలా ఉంటే పవన్ ఈ సినిమాతో పాటు మరో సినిమాకు తన పచ్చజెండా ఊపారు. అభిరుచి కల చిత్రాలను రూపొందించే క్రిష్ ఈ సినిమాకు దర్శకుడు. 'వకీల్ సాబ్' పూర్తి కాగానే ఈ భారీ బడ్జెట్ చిత్రం సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు.

ఈ సినిమా పీరియడ్ కథాంశంతో తెరకెక్కనుందని.. పవన్ ఒక బందిపోటుగా కనిపిస్తాడని ఇప్పటికే ఈ సినిమా గురించి ఆసక్తికరమైన సంగతులు బయటకు వచ్చాయి.  ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే విషయంపై పలు రకాల వార్తలు వినిపిసించాయి.  మొదట 'కంచె' ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ ను ఎంపిక చేసినట్టు టాక్ వినిపించింది.  తర్వాత ఒక బాలీవుడ్ హీరోయిన్ ను ఫైనలైజ్ చేశారని కూడా అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం అవేవీ నిజం కాదని ఈ సినిమాకు కీర్తి సురేష్ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం.

ఐపీఎల్ నుండి సూపర్ స్టార్ స్థాయికి..!

Ayushmann-Khurrana-got-money-from-passengers-for-singing-Andhra-Talkies
ఐపీఎల్ నుండి సూపర్ స్టార్ స్థాయికి..!

ఐపీఎల్ నుండి సూపర్ స్టార్ స్థాయికి..!

ట్యాలెంట్ ఉంటే ఇప్పుడు కాకున్నా ఇంకొన్నాళ్లకు అయినా అదృష్టం వరిస్తుందని ఎంతో మంది సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే సినిమాలపైనే పూర్తిగా శ్రద్ద పెట్టకుండా తనకు ఛాన్స్ వచ్చిన.. డబ్బులు వచ్చే రంగంలో ముందుకు వెళ్తూ ఉండాలి. అదే సమయంలో సినిమాల్లో కూడా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. అలా తాను అనుకున్న లక్ష్యంను సాధించడంతో పాటు ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరో స్థాయికి చేరుకున్నాడు యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా.

ఒకప్పుడు ఐపీఎల్ లో వ్యాఖ్యాతగా.. రేడియో జాకీగా కూడా చేసిన ఈయన పలు సింగింగ్ కాంటెస్ట్ లకు హాజరు అయ్యాడు. సింగర్ గా చేసిన ప్రయత్నాలు విఫలం అయినా కూడా నిరుత్సాహ పడలేదు. ఒకానొక సమయంలో రైల్లో పాట పాడగా ఒక వ్యక్తి ఇంప్రెస్ అయ్యి డబ్బులు ఇస్తే తీసుకున్నాడు. ఆ డబ్బులను ఆ నెల ఖర్చులకు వాడుకున్న పరిస్థితి నుండి ఆయుష్మాన్ ఇప్పుడు వందల కోట్ల సినిమాలు చేసే స్థితికి వచ్చాడు.

ఇది ప్రస్తుతం మన టాలీవుడ్ స్థాయి

Bollywood-Heroin-Deepika-Padukone-Wants-to-Do-Telugu-Movie-Andhra-Talkies
ఇది ప్రస్తుతం మన టాలీవుడ్ స్థాయి

ఇది ప్రస్తుతం మన టాలీవుడ్ స్థాయి

గతంతో పోల్చితే ప్రస్తుతం మన టాలీవుడ్ స్థాయి చాలా పెరిగింది. గతంలో తెలుగు సినిమాలనే కాకుండా సౌత్ భాషల సినిమాలన్నింటిని కూడా హిందీ ఫిల్మ్ మేకర్స్ మరియు స్టార్స్ చిన్న చూపు చూసేవారు. మణిరత్నం.. శంకర్.. రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్స్ మన తెలుగు సినిమా స్థాయిని బాలీవుడ్ ను మించేలా చేశారు. అందుకే ఇప్పుడు పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా సౌత్ లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్స్ సౌత్ ఫిల్మ్ మేకర్స్ తో కలిసి వర్క్ చేస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె కూడా చేరిపోయింది. ఈమె తాజాగా 83 చిత్రంలో నటించింది. ఆ సినిమా విడుదల నేపథ్యంలో మీడియాతో ఇంట్రాక్షన్ అయ్యింది. ఆ సందర్బంగా ఈమె మాట్లాడుతూ టాలీవుడ్ లో నటించాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. తెలుగు సినిమాలు నచ్చుతాయి అన్న దీపిక మహేష్ బాబు అంటే ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది.

హీరోయిన్ గురించి సోదరి భజన ఎక్కువైపోతోంది!

Heroin-Kangana-Ranaut-shares-latest-look-on-Jayalalitha-birth-anniversary-Andhra-Talkies
హీరోయిన్ గురించి సోదరి భజన ఎక్కువైపోతోంది!

హీరోయిన్ గురించి సోదరి భజన ఎక్కువైపోతోంది!

బాలీవుడ్ లో తన సోదరి కంగనా రనౌత్ తప్ప.. అంతా వ్యర్థమే! అన్నట్టుగా స్పందిస్తూ ఉంటుంది రంగోలీ చందాల్. ఇప్పటికే ఈమె వివిధ సందర్భాల్లో చేసినా కామెంట్లు వివాదాస్పదం అయ్యాయి. విడ్డూరంగా మారాయి. కేవలం తన సోదరిని పొగడటం ఆమెను కీర్తించడం ఆమె గురించి గొప్పలు చెప్పడమే కాదు ఇతరులను కించపరిచే పోస్టులు కూడా పెడుతూ ఉంటుంది ఈమె.

తన సోదరి గురించి పొగుడుకుంటే ఒక రకం దాని కోసమని ఇతరులను దూషిస్తూ తక్కువ చేస్తూ పోస్టులు పెట్టడం మాత్రం ఈ రంగోలీ అహంకారానికి నిదర్శనంగా మారింది. ఆ మధ్య దర్శకుడు కరణ్ జొహార్ ను కూడా గేలి చేసినట్టుగా మాట్లాడింది. కంగనా తో సినిమా తీయాలనుందని అతడు ప్రకటిస్తే మంచి స్క్రిప్ట్ తో రావాలని లేకపోతే కంగనా అస్సలు పట్టించుకోదు అన్నట్టుగా ఈమె చెప్పుకొచ్చింది. ఐశ్వర్యరాయ్ తో కరణ్ చేసిన ఇటీవలి సినిమా పేరును ప్రస్తావించి అలాంటి సబ్జెక్ట్ తో వస్తే తన చెల్లి చేతిలో దెబ్బలు తినాల్సి ఉంటుందన్నట్టుగా ఈమె చెప్పుకురావడం టూ మచ్ అనిపించుకుంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఆ లెవల్లో పంచ్ లేసిన ఆర్జీవీ

Rgv-Punches-On-Us-President-Donald-Trump-Andhratalkies
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఆ లెవల్లో పంచ్ లేసిన ఆర్జీవీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఆ లెవల్లో పంచ్ లేసిన ఆర్జీవీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన గురించి తెలిసిందే. ఆయనను ఇప్పటికే విమనాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రిసీవ్ చేసుకున్నారు. అయితే ట్రంప్ పర్యటనపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. నిన్నటి నుంచే ఆర్జీవీ ఎటాక్ స్టార్టయ్యింది. అది ఇప్పటికి పీక్స్ కి చేరుకుంది.

ట్రంప్ కోసం జనాల్ని పోగేయడంపైనా.. ఈ పర్యటన పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేయడంపైనా ఆయన పంచ్ లు వేసేశాడు. ఇక ఈ పంచ్ ల వెల్లువలో ఆర్జీవీ ఏమాత్రం జంకకుండా విరుచుకుపడుతున్నాడు. తాజా ట్వీట్ లో అతడు చెలరేగాడు. ``ట్రంప్ కు స్వాగతం పలికే సమయం లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను చూసి అతడు బోర్ ఫీలవుతాడని.. అతడి ఎక్స్ ప్రెషన్ చూడాలనుంద``ని ఆర్జీవీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.

పురుషాధిక్యాన్ని గెలవాలని ధీవించు సామీ!

Bollywood-Heroin-Kangana-Ranaut-Turns-as-Devotional-Andhra-Talkies
పురుషాధిక్యాన్ని గెలవాలని ధీవించు సామీ!

పురుషాధిక్యాన్ని గెలవాలని ధీవించు సామీ!

అవును.. ఇది నిజమే.. క్వీన్ కంగనను ఇలా చూస్తే.. తన శత్రువులందరికీ గుర్తుకొచ్చేది ఇదే. పురుషాధిక్య ప్రపంచం అంటే గిట్టని పరమ శివభక్తురాలిగా తనని తలచుకుని వేదనకు గురవ్వడం ఖాయం. ఫిబ్రవరి 21  (శుక్రవారం) మహాశివరాత్రిని పురస్కరించుకుని సెలబ్రిటీలతో పాటు దేశ ప్రజంలంతా పూజలు పునస్కారాల్లో తరించిన సంగతి తెలిసిందే. ప్రజలంతా పరమశివుని సేవలో తరించారు. ఈ శుభ దినోత్సవాన సెలబ్రిటీల భక్తి వ్యహారం తక్కువేమీ కాదు. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి - సురేఖ దంపతులు ఆరోజు ప్రత్యేకించి శివలింగార్చన చేశారు. పలువురు సెలబ్రిటీలు శివభక్తులుగా ఎంతో నిష్ఠతో పూజలాచరించారన్న సమాచారం ఉంది.

అటు బాలీవుడ్ లోనూ టాప్ సెలబ్రిటీలు శివరాత్రి రోజున జాగారం చేశారు. అలాగే ఉత్తరాదిన క్వీన్ కంగనా రనౌత్ భక్తి తత్పరత నిరంతరం చర్చకు వస్తుంటుంది. ఆధ్యాత్మికత.. మతపరమైన భావజాలం ఉన్న నటిగా తను ఆమె బాగా పాపులర్. కంగన తరచుగా పవిత్ర స్థలాలను సందర్శిస్తుంటుంది.  మొన్న శివరాత్రి సందర్భంగా రామేశ్వరం జ్యోతిర్లింగాన్ని సందర్శించింది. శివుని పరమ భక్తుడైన రావణుడిని చంపిన పాపానికి విముక్తి కల్పించడానికి రాముడు స్వయంగా ఈ శివలింగాన్ని స్థాపించారన్న ప్రాచుర్యం ఉంది.

ఎవరీ చిట్టిబాబు 2.0 ఏమిటా విలాసం?

Super-Chilled-Sunday-With-Ram-Charan-Andhra-Talkies
ఎవరీ చిట్టిబాబు 2.0 ఏమిటా విలాసం?

ఎవరీ చిట్టిబాబు 2.0 ఏమిటా విలాసం?

చిట్టిబాబు కూల్ హ్యాబిట్స్ గురించి ఎందరికి తెలుసు?  అతడు  పెద్ద స్టార్ అని మాత్రమే అభిమానులకు తెలుసు. అంతకుమించి అతడు ప్రకృతి ప్రేమికుడు. అలాగే మూగ జీవాల విషయంలో చరణ్ కి ఉండే ఆప్యాయత అంతా ఇంతా కాదని సన్నిహితులు చెబుతుంటారు. తన అభిరుచి మేరకు వైల్డ్ లైఫ్ సాంక్చువరీని ప్రారంభించారు. అది కూడా తన ఇంటి పరిసరాల్లోనే దీనిని ఏర్పాటు చేయడం ఆ స్పాట్ ని టాలీవుడ్ స్టార్లు విజిట్ చేయడం తెలిసిందే.

ఇకపోతే చరణ్ ఇంట్లో పెట్ డాగ్స్ గురించి బయటకు తెలిసింది తక్కువే. ఇంట్లో ఉన్నప్పుడు జాగింగ్ కి వెళ్లేప్పుడు చరణ్ తనతో పాటే పెట్ డాగ్స్ ని వెంట తీసుకెళుతుంటారట. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగైదు పెట్ డాగ్స్ తనతో పాటే ఉంటాయి. ఇక వీటికి చరణ్ పర్సనల్ స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసే అనుమతి ఉందట. వాటితో పాటే చరణ్ కూడా ఈత కొడుతూ ఆస్వాధించే ఫోటోలు వీడియోలు ఇప్పటికే యూట్యూబ్ లో కోకొల్లలు. ఇక పెట్స్ లో రకరకాల బ్రాండ్లు చెర్రీ ఇంట దర్శనమిస్తుంటాయి.

శంకర్ పై రాధారవి ఎదురు దాడి

Actor-Radharavi-criticizes-Shankar-after-Indian-2-accident-Andhra-talkies
శంకర్ పై రాధారవి ఎదురు దాడి

శంకర్ పై రాధారవి ఎదురు దాడి

`ఇండియన్ -2` సెట్స్ లో జరిగిన క్రేన్ ప్రమాదం దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు  చనిపోగా..10 మంది తీవ్రగాయాల బారినపడ్డారు. కమల్ హాసన్- శంకర్- కాజల్ అగర్వాల్ తృటిలో తప్పించుకున్నారు. చనిపోయిన ముగ్గురుకి యావత్ పరిశ్రమ నివాళులు అర్పించింది. కమల్ హాసన్ తన భావోద్వేగపు వ్యాఖ్యలతో నివాళిని అర్పించారు. ఆ కుటుంబాలను ఆదుకునేందుకు కోటి రూపాయాల విరాళం ప్రకటించారు. ఇక చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ రెండు కోట్ల రూపాయాలు ఆర్ధిక సాయం చేసింది. అయితే ఇప్పటి వరకూ శంకర్ ఈ ఘటన పై నోరు విప్పలేదు.

బాధిత కుటుంబాలను పరావమర్శించిందే లేదు. కనీసం చనిపోయిన ముగ్గురి భౌతిక కాయాలకు శ్రద్ధాంజలి ఘటించినట్లు కూడా వార్తలు రాలేదు. ఘటన జరిగిన నాటి నుంచి శంకర్ స్తబ్ధుగానే ఉన్నారు. తాజాగా చిత్ర యూనిట్ తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని తమిళనాడులో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది రూపాయాలు ఖర్చు చేసి షూటింగ్ చేస్తారు.  మనుషులు ప్రాణాలకు ఆ మాత్రం రక్షణ కల్పించలేరా? అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

క్లిష్ట మైన పరిస్థితిలో సునీల్ కెరీర్!

Hero-Sunil-s-career-in-critical-condition-Andhra-Talkies
క్లిష్ట మైన పరిస్థితిలో సునీల్ కెరీర్!

క్లిష్ట మైన పరిస్థితిలో సునీల్ కెరీర్!

స్టార్ కమెడియన్ గా చాలాకాలంపాటు టాలీవుడ్ ను ఏలిన సునీల్ కు ఇప్పటికీ మంచి ఫాలోయింగ్ ఉంది.  అయితే మన టాలీవుడ్ కమెడియన్ల పంథాలోనే సునీల్ కూడా హీరోగా మారడంతో కమెడియన్ పాత్రలకు చాలా కాలం పాటు దూరంగా ఉన్నాడు.  హీరోగా మొదట్లో మంచి హిట్లు దక్కినప్పటికీ తర్వాత మాత్రం వరస ఫ్లాపులతో మొదటికే మోసం వచ్చింది. దీంతో రూటు మార్చిన సునీల్ కమెడియన్ గా రీఎంట్రీ ఇచ్చాడు.  రీ ఎంట్రీలో మంచి ఆఫర్లే వచ్చాయి కానీ బ్రేక్ మాత్రం దక్కలేదు.

గతంలో నవ్వించినట్టుగా సునీల్ నవ్వించలేకపోతున్నాడనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.  సునీల్ ఆప్త మిత్రుడు త్రివిక్రమ్ బ్రేక్ ఇవ్వడం ఖాయమని అనుకుంటే అది కూడా జరగడం లేదు.  'అరవింద సమేత' లో ఎక్కువ స్కోప్ లేదు.. ఈమధ్య సంక్రాంతి హిట్టుగా నిలిచిన 'అల వైకుంఠపురములో' సినిమాలో నటించినప్పటికీ సునీల్ పాత్రకు పెద్దగా గుర్తింపు దక్కలేదు.  హాస్యనటుడిగా సెకండ్ ఇన్నింగ్స్ లో బ్రేక్ దక్కకపోవడంతో సునీల్ విలన్ పాత్రలను కూడా యాక్సెప్ట్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చాడు. అయితే అది కూడా సునీల్ కు బ్రేక్ ఇవ్వడం లేదు.

టాలీవుడ్ వేరు కుంపట్లు

Tollywood-Producer-Dil-Raju-and-His-Brother-Sirish-Andhra-Talkies
టాలీవుడ్ వేరు కుంపట్లు

టాలీవుడ్ వేరు కుంపట్లు

తల్లి వేరు నుంచి పిల్ల వేరు .. వేరుపడకపోతే దాని ఎదుగుదల కుదురుతుందా?  వేరు కాపురం పెట్టని కొడుకు ఎక్కడైనా ఉంటాడా?  ఇంతకుముందులా ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ఆస్కారం ఎక్కడుంది?  ఇక వ్యాపార భాగస్వాముల్లోనూ నిరంతరం కలిసి ఉండడం అన్నది కల్ల. వ్యాపారల్లో ఏదో ఒక లొల్లు కూడా ఉంటుంది. అయితే అలాంటి కారణాలు ఉన్నా లేకపోయినా కానీ.. టాలీవుడ్ లో అగ్ర బ్యానర్లలోంచి భాగస్వాములు విడిపోయి వేరు కుంపట్లు  పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఇంతకుముందు మైత్రి మూవీ మేకర్స్ నుంచి సి.వి.మోహన్ వేరు పడ్డారు. రవి- నవీన్ కలిసి ఆ బ్యానర్ ని నడిపిస్తుంటే వీళ్లకు అల్లు అర్జున్ బంధువు అయిన ముత్తంశెట్టి కలిసారు. అయితే ఆయన ఇటీవలే కాలం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మైత్రి లానే మరో అగ్ర నిర్మాణ సంస్థ నుంచి భాగస్వామి వేరుపడడం ప్రముఖంగా చర్చకు వచ్చింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అంటే దిల్ రాజు- శిరీష్ -లక్ష్మణ్ అంటూ మూడు పేర్లు వినిపిస్తాయి. ఇందులోంచి లక్ష్మణ్ వేరు కుంపటి పెట్టుకుంటున్నారట. ఐదారు నెలలుగా లక్ష్మణ్ సొంత బ్యానర్ స్థాపించి సినిమాలు తీయాలన్న ప్రణాళికల్ని విస్తరిస్తున్నారట. కుమారుడు ఇప్పటికే లైన్ ప్రొడ్యూసర్ గా అనుభవం ఘడిస్తున్నారు. కాబట్టి తనతో కలిసి సినిమాలు నిర్మిస్తారన్నమాట. ఇకపై శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ లో దిల్ రాజు - శిరీష్ కలిసి సినిమాలు నిర్మిస్తారు. ఇక ఆ ఇద్దరూ అన్నదమ్ములు అన్న సంగతి తెలిసిందే. అయితే బ్రదర్స్ అయినంత మాత్రాన .. వేరుకుంపటి పెట్టుకోరు అన్న గ్యారెంటీ అయితే లేదు.  ఎవరికి వారు సొంతంగా ప్రణాళికలతో ఎదగాల్సి ఉంటుంది ఎక్కడైనా. ఆ క్రమంలోనే శిరీష్ కూడా సొంత బ్యానర్ పెట్టుకునే అవకాశం లేకపోలేదు.

రాశి ఖన్నా కెరీర్ ఇక అయిపోయినట్టేనా?

Dilemma-On-Heroin-Raashi-Khanna-Career-Andhra-Talkies
రాశి ఖన్నా కెరీర్ ఇక అయిపోయినట్టేనా?

రాశి ఖన్నా కెరీర్ ఇక అయిపోయినట్టేనా?

టాలీవుడ్లో హీరోయిన్లు చాలామందే ఉన్నారు కానీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉండేవారు మాత్రం తక్కువ. అలాంటి గుర్తింపు తెచ్చుకున్న భామ రాశి ఖన్నా. మొదట్లో గ్లామర్ కు కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న రాశి నటన విషయంలో యావరేజ్ అనిపించుకుంది. అయితే వరుణ్ తేజ్ తో నటించిన 'తొలిప్రేమ' తో మంచి గుర్తింపు సాధించింది. ఇక స్టార్ హీరోయిన్ అయినట్టేనని అందరూ అనుకున్నారు కానీ అప్పటి నుంచి సాలిడ్ బ్లాక్ బస్టర్ ఒక్కటి కూడా దక్కడం లేదు. దీంతో రాశి స్టార్ లీగ్ కు కూడా చేరలేక పోతోంది. కెరీర్ నత్త నడకన సాగుతోంది.

ఎన్టీఆర్ పై వెబ్ సిరీస్.. టైటిల్ పాత్రలో ఎవరు?

Tollywood-Hero-Srikanth-As-NTR-In-Manchu-Chadarangam-Andhra-Talkies
ఎన్టీఆర్ పై వెబ్ సిరీస్.. టైటిల్ పాత్రలో ఎవరు?
ఎన్టీఆర్ పై వెబ్ సిరీస్.. టైటిల్ పాత్రలో ఎవరు?
ఎన్టీఆర్ జీవిత కథతో మూడు బయోపిక్ లు వచ్చాయి. వీటిలో రెండిటి (ఎన్టీఆర్-కథానాయకుడు.. మహానాయకుడు)లో బాలకృష్ణ నటించగా.. ఒకదాంట్లో(లక్ష్మీస్ ఎన్టీఆర్) ఒక డ్రామా ఆర్టిస్టు నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ పాత్రలో నటించే అరుదైన అవకాశం శతాధిక చిత్రాల కథానాయకుడు శ్రీకాంత్ దక్కించుకున్నారు. అతడు అన్నగారిగా అభినయించేందుకు రెడీ అవ్వడం ఆసక్తికరం.

అయితే ఇది వెండితెరపైనేనా? అంటే సినిమా కాదు.. వెబ్ సిరీస్ ప్రయత్నం. అది కూడా ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడైన మంచు మోహన్ బాబు ఈ సిరీస్ ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ జీవితం లో బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో చీకటి కోణాల్ని.. కఠోర నిజాల్ని ఈ వెబ్ సిరీస్ లో ఓపెన్ గా చూపిస్తున్నారట. ఇక అన్నగారు ఎన్టీఆర్ తో మోహన్ బాబు అనుబంధం గురించి తెలిసిందే. తన రాజకీయ రంగ ప్రవేశం సహా సినిమాల పరంగానూ ఆ ఇద్దరి మధ్యా అనుబంధం ఎంతో గొప్పది. ఎన్టీఆర్ నటించిన చివరి చిత్రం `మేజర్ చంద్రకాంత్` ని మోహన్ బాబు నిర్మించారు. ఇప్పుడు మోహన్ బాబు కుటుంబం ఎన్టీఆర్ పై వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఇందులో మంచు విష్ణు పాలు పంచుకుంటున్నారు. ఆసక్తికరంగా ఈ సిరీస్ కి చదరంగం అనే టైటిల్ ని పెట్టారు.

ఎవరు ఖాళీగా ఉన్నా ప్రభాస్ తో లింకు

Tollywood-Hero-Prabhas-movie-with-Arjun-Reddy-director-Andhra-Talkies
ఎవరు ఖాళీగా ఉన్నా ప్రభాస్ తో లింకు
ఫలానా దర్శకుడికి ప్రభాస్ కమిటయ్యారు అంటూ హాట్ డిబేట్ కి తెరపైకి తెస్తుండడం రకరకాల సందేహాలకు తావిస్తోంది. ఇప్పటికే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్.. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ప్రభాస్ కోసం వెయిటింగ్ లో ఉన్నారన్న ప్రచారం సాగింది. అలాగే కొరటాల మిర్చి తర్వాత మళ్లీ అదిరిపోయే స్క్రిప్టును ప్రభాస్ కోసం రెడీ చేశారని.. డాషింగ్ డైరెక్టర్ పూరి సైతం ప్రభాస్ కి స్కెచ్ వేశాడని బోలెడంత ప్రచారం సాగిపోయింది. రాజమౌళి సైతం మళ్లీ ప్రభాస్ ని బరిలో దించుతాడని ఇటీవల సీనియర్ దర్శకుడు ఇమంది రామారావు యూట్యూబ్ కథనాలు వేడెక్కించాయి.

యాంకర్ ని హీరోయిన్ ని చేస్తున్న మనోజ్

Anchor-Priya-Bhavani-Shankar-in-Manchu-Manoj-Aham-Brahmasmi-Andhra-Talkies
యాంకర్ ని హీరోయిన్ ని చేస్తున్న మనోజ్

యాంకర్ ని హీరోయిన్ ని చేస్తున్న మనోజ్

మంచు మనోజ్ మూడేళ్ల గ్యాప్ తర్వాత సొంత బ్యానర్ సినిమాతో కంబ్యాక్ అవుతున్నసంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఒక్క హిట్టు కొట్టి దేశం మొత్తం మార్మోగిపోవాలని పక్కా ప్లానింగ్ బరిలోకి దిగుతున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ ను ఎంపిక చేసుకుని గెలుపు రేసులోకి దిగుతున్నాడు. ఈ చిత్రానికి శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త కుర్రాడు దర్శకత్వ వహిస్తున్నాడు. తాజాగా మనోజ్ సరసన హీరోయిన్ కూడా ఫైనల్ అయింది.

స్ర్కిప్ట్ డిమాడ్ మేరకు కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన దర్శక-హీరోలు ఓ టీవీ యాంకర్ ని హీరోయిన్ గా ఎంపిక చేసారు. పలు తమిళ టెలివిజన్ షో వ్యాఖ్యాతగా వ్యవరించిన ప్రియా భవానీ శంకర్ అనే యాంకర్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. కోలీవుడ్ టీవీ షోల్లో అమ్మడు హాటీగా ఓ వెలుగు వెలిగిపోయింది. తమిళ వెర్షన్ సూపర్ సింగర్ ప్రొగ్రామ్ ద్వారా ఈ 30 ఏళ్ల అమ్మడు బాగా పాపులర్ అయింది. ఆ క్రేజ్ తోనే సెకెండ్ ఛాన్స్ పాన్ ఇండియా సినిమాలో వరించింది. ప్రస్తుతం విశ్వనటుడు కమల్ హాస్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఇండియన్-2 లో ఓ చిన్న పోషిస్తుంది. ఇప్పుడా క్రేజ్ నే మనోజ్ ఎన్ క్యాష్ చేసుకుంటున్నాడు. ఇండియన్ -2 పాన్ ఇండియా లో రిలీజ్ అవుతుంది.

ఆమెతో సినిమా చేస్తే చాలు.. మధ్యలోనే పెళ్లి అయి పోతుందట

Tollywood-Heroin-Rashmika-Mandanna-Talking-About-Nithin-Marriage-Andhra-Talkies
ఆమెతో సినిమా చేస్తే చాలు.. మధ్యలోనే పెళ్లి అయి పోతుందట

ఆమెతో సినిమా చేస్తే చాలు.. మధ్యలోనే పెళ్లి అయి పోతుందట

అదృష్టాన్ని అరచేతిలో పెట్టుకొని తిరుగుతుంటారన్న సామెతను తరచూ వింటుంటాం. చిత్రపరిశ్రమలో అలాంటోళ్లు కొందరు ఉంటారు. ఆ కోవకే చెందుతారు రష్మిక మందాడ. అలా అని ఆమె అందం.. టాలెంట్ తక్కువన్నది మా ఉద్దేశం కాదు. ఇవన్నీ చాలా ఉన్నా.. తాను చేసిన ప్రతి సినిమా హిట్ కావటం కొందరికి మాత్రమే సాధ్యం. ఒకవేళ హిట్ అయినా.. ఆ క్రెడిట్ మరెవరికో వెళ్లకుండా తనకు రావాల్సిన దాని కంటే ఎక్కువ క్రెడిట్ సొంతం చేసుకోవటం ఈ బ్యూటీ గొప్పతనం గా చెప్పాలి.

తాజాగా తనకు సంబంధించిన సెంటిమెంట్ ను రివీల్ చేశారు. వినేందుకు విచిత్రంగా ఉన్నప్పటికీ.. ఇప్పటికే ఇద్దరు హీరోల విషయం లో జరిగిన పరిణామాల్ని చూస్తే.. ఆమె చెప్పింది నిజమనిపించక మానదు. ఆమె నటించే సినిమాల్లో హీరోల పెళ్లిళ్లు తనతో సినిమా చేసే సమయంలోనే ఫిక్స్ అయిపోతాయని చెప్పింది.

Heroin Shweta Basu Prasad and Rohit Mittal file for divorce | పెళ్లి పాయె సినిమాలు పాయె డాం డాం!

Heroin Shweta Basu Prasad and Rohit Mittal file for divorce

Heroin Shweta Basu Prasad and Rohit Mittal file for divorce | పెళ్లి పాయె సినిమాలు పాయె డాం డాం!

'కొత్త బంగారు లోకం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది బాలీవుడ్ బ్యూటీ శ్వేత బసు ప్రసాద్. తొలి సినిమానే సూపర్ హిట్ కావడంతో అప్పట్లో మంచి ఆఫర్లే వచ్చాయి. కానీ ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. అప్పట్లో ఓ సెక్స్ స్కాండల్ లో శ్వేత పేరు బయటకు రావడం సంచలనం సృష్టించింది. ఈ హంగామా పూర్తయిన తర్వాత హిందీ సీరియల్స్ తో బిజీ అయిపోయింది. హిందీలో సినిమాలు కూడా చేసింది. ఆ తర్వాత ఫిలిం మేకర్ రోహిత్ మిట్టల్ ను ప్రేమించి పెళ్ళాడింది. అయితే ఏడాదిలోపే తర్వాత విడాకులు తీసుకుని సింగిల్ గా మారిపోయింది.

అయితే ఈ మెరుగైన సమాజంలో.. ఆధునిక భావాలు రాజ్యమేలుతున్న ఈ అంతర్జాల తరంలో బ్రేకప్ అనేది చాలాచాలా కామన్. అందుకే ఆ పాస్ట్ ను పక్కనబెట్టి బికినీ ఫోటో షూట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ న్యూ జెనరేషన్ భామ అనిపించుకుంటోంది. గత మూడేళ్లలో కాలంలో శ్వేత బసు 'బద్రినాథ్ కి దుల్హనియా'.. 'మర్ద్ కో దర్ద్ నహీ హోతా'.. 'ది తాష్కెంట్ ఫైల్స్' సినిమాలలో నటించింది. తన చివరి చిత్తరం 'ది తాష్కెంట్ ఫైల్స్' పోయినేడాది రిలీజ్ అయింది. ఆ తర్వాత శ్వేత చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేదు. ఇటు టాలీవుడ్ లో ఆఫర్లు లేవు. అటు బాలీవుడ్ లో ఆఫర్లు రావడం లేదు.

The funny moments of Heroin Kartik Aaryan and Sara Ali Khan | హీరోయిన్ రొమాంటిక్ గొడవ వీడియో వైరల్-Andhra Talkies

The-funny-moments-of-Heroin-Kartik-Aaryan-and-Sara-Ali-Khan-Andhra-Talkies.jpg
The funny moments of Heroin Kartik Aaryan and Sara Ali Khan

The funny moments of Heroin Kartik Aaryan and Sara Ali Khan | హీరోయిన్ రొమాంటిక్ గొడవ వీడియో వైరల్

బాలీవుడ్ యంగ్ కపుల్ కార్తీక్ ఆర్యన్.. సారా అలీ ఖాన్ ల గురించి ప్రస్తుతం మీడియాలో తెగ పుకార్లు పుట్టుకు వస్తున్నాయి. వీరిద్దరి మద్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని.. ఇద్దరి మద్య సినిమాకు మించిన సంబంధం ఇంకా ఏదో ఉందంటూ నెటిజన్స్ వారిపై కామెంట్స్ చేస్తున్నారు. లవ్ ఆజ్ కల్ చిత్రం షూటింగ్ సమయంలో వీరిద్దరి ఔటింగ్ లు... సినిమా ప్రమోషన్ అంటూ వీరిద్దరు చేస్తున్న రైడ్ లు బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.

తాజాగా మరో వీడియో వీరిద్దరి మద్య సన్నిహిత సంబంధాన్ని చెప్పకనే చెబుతోంది. వ్ ఆజ్ కల్ ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ సభ్యులు టూర్ లో ఉన్నారు. ఆ సందర్బంగా ఒక చోట కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) కుర్రాడి తో ఫుట్ బాల్ ఆడుతూ ఉంటాడు. ఆ సమయంలో అటుగా సారా వెళ్లగా ఆ కుర్రాడు అన్న వదిన వచ్చింది అన్నాడు. ఆ కుర్రాడు వదిన అంటూ పిలవడం తో సారా షాక్ అయ్యి అతడి తో నువ్వే కదా అలా అనిపించింది అంటూ కార్తీక్ ఆర్యన్ ను చిలిపిగా కొట్టింది.

Bava O sari rava | Folk song | "బావా ఓసారి రావా " అద్బుతమైన జానపదం

Bava O sari rava | Folk song | "బావా ఓసారి రావా " అద్బుతమైన జానపదం

YEME PILLA | Latest FolkSong 2020 | "యేమే పిల్లా " అద్భుతమైన జానపదం

YEME PILLA | Latest FolkSong 2020 | "యేమే పిల్లా " అద్భుతమైన జానపదం

కలవర పెడుతున్న జాన్ కొత్త అప్ డేట్

No-Bollywood-villains-for-Prabhas-this-time-Andhra-Talkies

కలవర పెడుతున్న జాన్ కొత్త అప్ డేట్

ప్రభాస్ సాహో చిత్రం విడుదలకు ముందే రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టాడు. మొదట ఆ సినిమాకు జాన్ టైటిల్ అనుకున్నారు. సినిమా షూటింగ్ గత ఏడాది కాలంగా సాగుతూనే ఉంది. భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెల్సిందే. గత ఏడాది ఈ సినిమా 2020 ఆరంభంలో వస్తుందని వార్తలు వచ్చాయి. 2020 వచ్చింది ఆరంభం కూడా అయిపోయింది. రెండవ నెల కాదు కదా మూడవ నెలలో కూడా వచ్చే పరిస్థితి లేదు.

సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చి ఉంటుంది. సమ్మర్ లేదా ఆ తర్వాత దసరాకు అయినా వస్తుందిలే అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ సినిమాలో మెయిన్ విలన్ రోల్ కోసం జగపతిబాబును ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చిందనుకుంటే జగపతిబాబును ఇప్పుడు ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయేంటి అంటూ ఫ్యాన్స్ గందర గోళంలో ఉన్నారు.

హన్సిక ఏంటి ఇలా తయారయ్యింది?

Breaking-news-What-Happened-To-Hansika-andhra-talkies

హన్సిక ఏంటి ఇలా అయ్యింది?

హన్సిక మోత్వాని తెలుగు ప్రేక్షకులకు పరిచయం గుర్తింపు ఉన్న భామే. 2007 లో అల్లు అర్జున్ - పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ ఫిలిం 'దేశముదురు' సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సాధించింది. ఆ సినిమా తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో నటించింది. తెలుగులో ఆఫర్లు తగ్గడంతో అప్పట్లో కోలీవుడ్ కు మకాం మార్చింది. ఈమధ్య కొంత గ్యాప్ తర్వాత సందీప్ కిషన్ సినిమా 'తెనాలి రామకృష్ణ BA BL' సినిమా లో నటించింది. కానీ లక్కు మాత్రం వర్క్ అవుట్ కాలేదు.

ఈమధ్య తమిళంలో కూడా ఆఫర్లు తగ్గాయి. ఇదంతా ఒక ఎత్తైతే ఈమధ్య హన్సిక లుక్స్ విషయంలో కూడా కొంత విమర్శలు ఎదుర్కుంటోంది. తెనాలి రామకృష్ణ సినిమాలో హన్సికలో మునుపటి గ్లామర్ లేదని కామెంట్లు వినిపించాయి. రీసెంట్ గా హన్సిక ముంబైలోని బాంద్రా ఏరియాలో ఫోటోగ్రాఫర్ల కంట పడింది. సెలబ్రిటీలు కనిపిస్తే వెంటనే క్లిక్కుమనిపిస్తారు కదా? అలానే హన్సిక ఫోటోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలలో హన్సిక స్లిమ్ గా కనిపిస్తోంది కానీ ఫేస్ లో మాత్రం మునుపటి గ్లో లేదు. స్పష్టంగా వయసు కనిపిస్తోంది.

తేజ స్పీడ్ కు ముక్కున వేలేసుకుంటున్నారు

Director-Teja-on-About-His-Upcoming-Films-Andhra-Talkies

తేజ స్పీడ్ కు ముక్కున వేలేసుకుంటున్నారు

ఒకప్పుడు ప్రేమ కథ చిత్రాలకు పెట్టింది పేరు తేజ. ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలను.. హీరోలను మరియు క్యారెక్టర్ ఆర్టిస్టులను పరిచయం చేసిన స్టార్ ఫిల్మ్ మేకర్ తేజ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాని మద్యలో ఒక పది సంవత్సరాలు తేజకు గ్యాప్ వచ్చింది. ఆ పదేళ్లలో చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో సక్సెస్ ట్రాక్ లో పడ్డాడు.

ఇప్పుడిప్పుడే తేజ మళ్లీ హిట్ లు అందుకుంటున్నాడు. అయినా కూడా ఈయన్ను ఔట్ డేటెడ్ డైరెక్టర్ అంటూ కొందరు విమర్శిస్తూ ఉంటారు. కాని కొందరు హీరోలు మాత్రం ఈయనపై నమ్మకంతో సినిమాలు చేస్తున్నారు. తనకు నేనే రాజు నేనే మంత్రి వంటి సక్సెస్ ను ఇచ్చినందుకు గాను తేజతో మరో సినిమాను చేసేందుకు రానా సిద్దం అయ్యాడు. ఆ సినిమాకు విభిన్నంగా ‘రాక్షస రాజు రావణుడు’ అనే టైటిల్ ను రిజిస్ట్రర్ చేయించాడు. త్వరలోనే ఆ సినిమా ప్రారంభం అవ్వబోతుంది.

వారి నోరు మూయించిన #WFL బుకింగ్స్

WFL-bookings-showing-Vijay-Devara-Konda-craze-Andhra-Talkies

వారి నోరు మూయించిన #WFL బుకింగ్స్

అర్జున్ రెడ్డి.. గీత గోవిందం చిత్రాలతో విజయ్ దేవరకొండ టాలీవుడ్ టాప్ స్టార్ హీరోల సరసన చేరి పోయాడు. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు నిరాశ పర్చడంతో ముఖ్యంగా డియర్ కామ్రేడ్ చిత్రం నిరాశ పర్చడంతో ఆయన క్రేజ్ తగ్గిందని.. ఆయనకు గతంలో ఉన్నంత స్టార్ డం లేదు అంటూ కొందరు సోషల్ మీడియా లో ప్రచారం చేయడం మొదలు పెట్టారు. కాని విజయ్ దేవరకొండ స్టార్ డం ఏంటో డియర్ కామ్రేడ్ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ ను చూస్తే అర్థం అవుతుంది.

క్రాంతి మాధవ్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రానికి విజయ్ గతంలో తన సినిమాలకు చేసినట్లుగా చాలా అగ్రెసివ్ గా పబ్లిసిటీ కూడా చేయలేదు. అయినా కూడా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసేందుకు ఎగబడుతున్నారు. హైదరాబాద్ లో ఈ చిత్రం మొదటి రోజు 190 షోలు ఉన్నాయి. మొదటి రోజు 190 షోలకు గాను ఇప్పటికే 120 షోలకు బుకింగ్స్ క్లోజ్ అయ్యాయి. విడుదలకు ఇన్ని రోజుల ముందే 120 షోల బుకింగ్స్ క్లోజ్ అవ్వడం నిజంగా చాలా పెద్ద విషయం.

హీరో హీరోయిన్లను కలిపిన తెలివైన నిర్మాత!

Star-Producer-Behind-Hero-Heroine-Patchup-Andhra-Talkies

హీరో హీరోయిన్లను కలిపిన తెలివైన నిర్మాత!

ఆయన మీడియం రేంజ్ హీరోలలో టాప్. ఆయనతో కలిసి ఓ సూపర్ టాలెంటెడ్ హీరోయిన్ ఒక సినిమాలో నటించింది. ఆ సూపర్ టాలెంటెడ్ హీరోయిన్ చేసేవే తక్కువ సినిమాలు. తూతూమంత్రం పాత్రలను అసలు ఒప్పుకోదు. పైగా స్ట్రాంగ్ లేడీ అని కూడా టాక్ ఉంది. ఈ హీరోయిన్ కు.. అ హీరోకు షూటింగ్ సమయం లో ఈగో క్లాషెస్ వచ్చాయిని ఎడమొహం పెడమొహంగా ఉంటూ ఫిలిం యూనిట్ ను ఏడిపించారని టాక్ ఉంది. అయితే ఆ సినిమాను నిర్మించిన వ్యక్తి ఓక స్టార్ ప్రొడ్యూసర్.. ఆయన ముదుర్లకే ముదురు మహాముదురు కావడంతో ఇద్దరికి అయన శైలిలో నచ్చజెప్పి రాజీ కుదిర్చి సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమా మూడేళ్ళ క్రితం రిలీజ్ అయింది. సూపర్ హిట్ గా నిలిచింది.

ఇదిలా ఉంటే ఆ హీరోయిన్ ఇకపై ఆ హీరోతో నటించదని అందరూ అనుకున్నారు. కానీ మనం అనుకున్నవి జరగకపోవడం.. అనుకోనివి జరగడమే జీవితం. ఇప్పుడు అలానే జరిగిందట. ఆ సినిమా తర్వాత ఆ హీరోయిన్ కు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు. కెరీర్ చాలా డల్లుగా సాగుతోంది. ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్ కాలేక పోయింది. చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. ఈ సమయంలో ఆ ముదురు ప్రొడ్యూసర్ ఒక ప్రాజెక్ట్ సెట్ చేశాడట. ఆ హీరో ఈ హీరోయిన్ ను జోడీగా ఒప్పించాడట. అసలు ఆ హీరో హీరోయిన్ కలిసి నటించడం అనేది అసాధ్యం అని వాదించిన వ్యక్తులు ఇప్పుడు ఈ ప్రాజెక్టు గురించి తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారు.

వరల్డ్ ఫేమస్ లవర్ లో విషయం చెప్పేసింది

No-such-scenes-in-the-World-Famous-Lover-Andhra-Talkies

వరల్డ్ ఫేమస్ లవర్ లో విషయం చెప్పేసింది

అందానికి అందం.. అభినయానికి ఏ మాత్రం లోటు లేనప్పటికీ కేథరిన్ కు అవకాశాలు కాస్త తక్కువనే చెప్పాలి. అయితే.. ఆమెకు ఆఫర్లు వచ్చినా.. ఓకే చెప్పే విషయంలో ఆమె అనుసరించే పద్దతే దీనికి కారణంగా కొందరు చెబుతుంటారు. ఈ వాదనను బలపర్చేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిందీ ముద్దు గుమ్మ. తనకు ఒక సినిమా లో చేసిన పాత్ర మాదిరే మరో సినిమాలో ఆఫర్ ఇస్తే నో చెబుతానని.. ఇది తన అలవాటుగా చెప్పింది.

ఆమె నటించిన తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. విజయదేవర కొండతో స్క్రీన్ షేర్ చేసుకున్న కేథరిన్.. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు ఉన్నప్పటికీ.. అందరికి సమాన ప్రాధాన్యత లభించిందని.. పాత్ర చిన్నదే అయినా.. ప్రతి ఒక్కరికి కథలో ప్రయారిటీ ఉంటుందని చెప్పింది.

మహేష్ నా తమ్ముడు..బన్నీ ఎవరో తెలీదు!

Hero-Allu-Arjun-Fans-Fires-on-Shakeela-Andhra-Talkies
మహేష్ నా తమ్ముడు..బన్నీ ఎవరో తెలీదు!

మహేష్ నా తమ్ముడు..బన్నీ ఎవరో తెలీదు!

ఒకప్పుడు అడల్ట్ చిత్రాలతో అలరించిన షకీలా  అడపాదడపా తెలుగు  సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మార్కెట్లో లోకల్ అడల్ట్ చిత్రాలకు గిట్టుబాటు కాకపోవడంతో పంథా మార్చి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. ఇటీవలే  ఆమె నటించిన `షకీలా రాసిన మొట్ట మొదటి కుటుంబ కథా చిత్రం` టీజర్ లో ఏపీ మూడు రాజధానులపై పంచ్ లేసే ప్రయత్నం చేసింది. తన సినిమా ప్రచారం కోసమే ఇలా దిగజారుడు టీజర్లు వదుల్తోంది! అంటూ నెటి జనులచే అక్షింతలు వేయించుకుంది.

తాజాగా మరోసారి టాలీవుడ్  స్టార్ హీరోలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈసారి ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు....స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లను టార్గెట్ చేసి మాట్లాడింది. ఓ ఇంటర్వూలో ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ లో భాగంగా అడిగిన వాటికి వచ్చిన సమాధానాలు హాట్ టాపిక్ గా మారాయి. టాలీవుడ్ లో మహేష్ బాబు నా తమ్ముడు లాంటోడు....బన్నీ ఎవరో నాకు తెలియదు! అంటూ వ్యాఖ్యానించింది.  దీంతో  సోషల్ మీడియాల్లో బన్ని ఫ్యాన్స్ భగ్గుమన్నారు.

ప్రేమలో నిండా మునిగానని హింటిచ్చిందా?

Bollywood-Heroin-Kriti-Sanon-makes-style-statement-in-blue-jump-suit-Andhra-Talkies

ప్రేమలో నిండా మునిగానని హింటిచ్చిందా?

బాలీవుడ్ యువకథానాయిక కృతి సనోన్ ప్రేమాయణాల గురించి చెప్పాల్సిన పనే లేదు. కెరీర్ లో చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ ఏదీ లేకపోయినా ఈ అమ్మడి ఎఫైర్లకు కొదవేమీ లేదు. సినిమాల్ని మించి నిరంతరం ఏదో ఒక వేడెక్కించే టాపిక్ తో నిరంతరం వార్తల్లో నానుతోంది. గత కొంతకాలంగా యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో ప్రేమాయణం సాగిస్తూ కృతి హెడ్ లైన్స్ లో హైలైట్ అయ్యింది. కుర్రహీరోని వీడి క్షణమైనా గడపలేని సన్నివేశంలో ఉందన్న ప్రచారం అంతకంతకు వేడెక్కించింది.

సుశాంత్ - కృతి జంట షికార్లకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పటికే అభిమానుల్లో జోరుగా వైరల్ అయ్యాయి. అయితే ఇంత జరిగాక కృతి అకస్మాత్తుగా సుశాంత్ కి బ్రేకప్ చెప్పేయడంపైనా గుసగుసలు వినిపించాయి. సుశాంత్ ప్లేట్ ఫిరాయించి మరో అందాల భామ రియా చక్రవర్తి (తూనీగ తూనీగ)తో కమిటైపోవడంతో అలిగిన కృతి ప్రస్తుతం అతడికి దూరంగా ఉంటోంది. అంతేకాదు సుశాంత్ పై పంతానికి పోయి మరో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో చెట్టా పట్టాల్ వేసుకుని తిరిగేయడం పైనా ఇటీవల రకరకాలుగా ప్రచారమైంది. చెల్లుకు చెల్లు తరహా లో కృతి మాజీకి సమాధానమిస్తోందన్న గుసగుసలు వేడెక్కించాయి.

చిరు ఐటెం క్లారిటీ ఇచ్చారు.. మరి హీరోయిన్?

Faded-out-Heroine-for-Megastar-Chiru-152-Andhra-Talkies
చిరంజీవి గత ఏడాది సైరా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఫలితంపై మిశ్రమ స్పందన వచ్చింది. ఇక ప్రస్తుతం అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ తన 152వ చిత్రాన్ని చేస్తున్నాడు. కేవలం 100 రోజుల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేస్తానంటూ హామీ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివ అందుకోసం చాలా స్పీడ్ గా చిత్రీకరణ చేస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంపై క్లారిటీ ఇంకా రాలేదు.

ఇటీవలే ఈ చిత్రం కోసం చిరంజీవి మరియు రెజీనాలపై ఒక ఐటెం సాంగ్ చేసినట్లుగా యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందింది. ఆ పాటలో చిరంజీవిని బ్యాలన్స్ చేస్తూ ఆయన స్థాయిలో రెజీనా డాన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చింది అంటూ వార్తలు వచ్చాయి. మెగా 152లో ఐటెంగా రెజీనా అంటూ క్లారిటీ వచ్చింది కాని మెయిన్ హీరోయిన్ ఎవరు అనే విషయం పై మాత్రం ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు.

క్రేజీ రూమర్.. చిరుతో మోహన్ బాబు

Tollywood-Hero-Mohan-Babu-to-play-villain-in-Chiranjeevi-film-Andhra-Talkies

క్రేజీ రూమర్.. చిరుతో మోహన్ బాబు

మెగాస్టార్ చిరంజీవి విలక్షణ నటుడు మోహన్ బాబులది విచిత్రమైన బంధం. కొన్నిసార్లు ఆప్తమిత్రుల్లా చాలా సన్నిహితంగా కనిపిస్తారు. కొన్నిసార్లు శత్రువుల్లా కలహించుకుంటారు. ఐతే వజ్రోత్సవ వేడుకలప్పుడు.. చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు వచ్చినపుడు ఇద్దరి మధ్య అనుకోకుండా అగాథం ఏర్పడింది కానీ.. ఆ తర్వాత కొన్నేళ్లకు ఇద్దరూ కలిసిపోయారు.

అప్పట్నుంచి చాలా సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇటీవల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యక్రమంలో చిరు-మోహన్ బాబు ఎంత సన్నిహితం గా మెలిగారో.. ఒకరి గురించి ఒకరు ఎంత గొప్పగా మాట్లాడుకున్నారో తెలిసిందే. ఆ సందర్భంగా వాళ్ల కెమిస్ట్రీ ఇండస్ట్రీ హాట్ టాపిక్గా మారింది. ఈ కెమిస్ట్రీని సినిమాల్లోనూ చూస్తే ఎంత బాగుంటుందో అన్న ఆలోచన కూడా కలిగింది కొందరికి. ఐతే ఇప్పుడు ఆ ఊహ నిజం కాబోతున్నట్లుగా ఒక క్రేజీ రూమర్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది.

బన్నీ పార్టీకి వెళ్ళాలంటే భయపడుతున్నారే!

బన్నీ పార్టీకి వెళ్ళాలంటే భయపడుతున్నారే!

నాన్ బాహుబలి రికార్డు కొట్టేసాం అంటూ గ్రాండ్ గా సెలెబ్రేషన్స్ మొదలెట్టేసారు 'అల వైకుంఠ పురములో' టీం. ఇప్పటికే రెండు ఈవెంట్ లు చేసారు. తాజాగా డిస్ట్రిబ్యూటర్స్ - ఎగ్జిబ్యూటర్స్ ను పిలిచి వారికి గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. అయితే ఇదే విధంగా తమ శ్రేయస్సు కోరిన ఇండస్ట్రీ జనానికి కూడా రేపు ఓ పార్టీ ఏర్పాటు చేయబోతుంది అల్లు ఫ్యామిలీ. ఈ పార్టీకి ఇండస్ట్రీ నుండి అందరినీ ఆహ్వానించబోతున్నారు.

ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న హీరోలు  - హీరోయిన్స్  - డైరెక్టర్స్ - నిర్మాతలకు అల టీం నుండి ఇన్విటేషన్ కూడా వెళ్ళింది. అయితే బన్నీ అండ్ ప్రొడ్యూసర్స్ ఇచ్చే  ఈ పార్టీ కి వెళ్ళాలంటే ఇండస్ట్రీలో కొందరు భయపడుతున్నారు. దీనికి కారణం మహేష్ బాబు. అవును అల - సరిలేరు నీకెవ్వరు' రెండు సినిమాలు సంక్రాంతి పోటీ గా వచ్చాయి. ఆ సినిమా కూడా భారీగానే కలెక్షన్స్ రాబట్టింది. అయితే బన్నీ అండ్ టీం మాత్రం ఇండస్ట్రీ హిట్ గా తమ సినిమాను ప్రొజెక్ట్ చేసుకొని 'సరిలేరు' టీం మీద కొన్ని ఇన్ డైరెక్ట్  గా సెటైర్స్ వేస్తున్నారు. అందుకే 'అల' సినిమాకు సంబందించిన సెలెబ్రేషన్స్ కి  నైజాం ఏరియా చేసిన దిల్ రాజు కూడా దూరంగా ఉంటున్నారు.

టాలీవుడ్ సమ్మర్ సినిమాలివే !

Tollywood-Movie-Releases-in-This-Summer-Andhra-Talkies
టాలీవుడ్ సమ్మర్ సినిమాలివే !
టాలీవుడ్ కి సంక్రాంతి తర్వాత కాసులు కురిపించే సీజన్ సమ్మర్. స్కూళ్ళు కాలేజీలకు సెలవలు ప్రకటించడంతో మ్యాగ్జిమం ఆడియన్స్ ఆ టైంలో సినిమాకే ముందుగా ప్రాధాన్యం ఇస్తారు. అందుకే ఈ సీజన్ లో రెండు నెలల పాటు దండిగా సినిమాలుంటాయి. ఏప్రిల్ మే రెండు నెలల్లో ఇప్పటి నుండే థియేటర్స్ బ్లాక్ చేసుకుంటున్నారు నిర్మాతలు. అయితే ఈ ఏడాది సమ్మర్ ను స్టార్ హీరోలు లైట్ తీసుకోవడంతో కుర్ర హీరోలు రంగంలోకి దిగబోతున్నారు.

ఏప్రిల్ లో నాగ చైతన్య చేస్తున్న 'లవ్ స్టోరి' రామ్ రీమేక్ సినిమా 'రెడ్' శర్వానంద్ ఎమోషనల్ డ్రామా 'శ్రీకారం' రాజ్ తరుణ్ 'ఒరేయ్ బుజ్జిగా' వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా 'ఉప్పెన' థియేటర్స్ లోకి వస్తున్నాయి. ఇక మేలో సాయి ధరం తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్' రవి తేజ 'క్రాక్' ప్లానింగ్ లో ఉన్నాయి. ఇలా ఇప్పటికే అరడజను పైనే సినిమాలు సమ్మర్ లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాయి. మరికొన్ని సినిమాలు ఈ లిస్టులో యాడ్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. మరి వీటిలో ఏ సినిమాలు సీజన్ ను పర్ఫెక్ట్ వాడుకొని నిర్మాతలకు కాసులు కురిపిస్తాయో చూడాలి.


Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...