ఇంట్లోంచి పారిపోయిన నటవారసుడు!

Actor-Sanjay-Rao-Talking-About-O-Pitta-Katha-Story-Line-Andhra-Talkies
ఇంట్లోంచి పారిపోయిన నటవారసుడు!

ఇంట్లోంచి పారిపోయిన నటవారసుడు!

ఏదో ఒక ఎమోషనల్ మూవ్ మెంట్ లో కొందరు చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోతుంటారు. ఆ కోవకే తాను కూడా చెందుతానని చెప్పాడు బ్రహ్మాజీ నట వారసుడు సంజయ్ రావు. ఓ పిట్ట కథ సినిమాతో హీరో అవుతున్న సంజయ్ చిన్నప్పుడు తనని ఇంట్లో ఏదో అంటే ఇల్లు వదిలి పారిపోయాడట. పదిరోజులు బయటే గడిపాడు. దాంతో అందరూ దిగొచ్చారట.

అసలు మర్చంట్ నావీ ఉద్యోగం వదిలేసి ఇటెందుకొచ్చారు? అని ప్రశ్నిస్తే .. డబ్బు సంపాదన కంటే ఇంకేదైనా కావాలనే క్రియేటివ్ సైడ్ వచ్చానని తెలిపాడు. ఉద్యోగం వదిలేశాక... నటనలోకి రావాలనుకున్నప్పుడు ఆరు నెలలు ముంబై వెళ్లా. ఇక్కడ కమ్యూనికేషన్ లేదు. కానీ చాలా నేర్చుకున్నా. ఇక పరిశ్రమలో నాన్న (బ్రహ్మాజీ)గారి మార్గదర్శనం ఉంటుంది. తప్పా ఒప్పా కాదు పడి లేస్తూ నేర్చుకో అని చెబుతారు. సలహాలిస్తారు.ఓ పిట్ట కథ స్టోరీ లైన్ గురించి చెబుతూ.. ఇది ముక్కోణపు ప్రేమ కథ అనుకుంటున్నారు కానీ కాదు. ఇందులో కేవలం ప్రేమకథే కాదు చాలా ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి అని వెల్లడించారు. దర్శకుడు చందుతో అనుబంధం గురించి చెబుతూ.. చందు సర్ తో మూడేళ్ల ప్రయాణం సాగించాను. దాంతో కంఫర్ట్ లెవల్ ఉంది. ఇతర నటీనటులతోనూ ట్రావెల్ అయ్యాను కాబట్టి సౌకర్యంగానే సాగింది. చిన్న సమస్యలు ఉన్నా చందు కరెక్ట్ చేశారు. కెమెరాని ప్రేమించి నటిస్తాను. చిన్న స్టేజ్ ఫియర్ ఉంది. కెమెరా ముందు ఫెయింట్ అవుతాను. కానీ కరెక్టయ్యాను... అని వెల్లడించారు.

ఇందులో తన రోల్ గురించి చెబుతూ... అమలాపురంలో ఒక లోకల్ అబ్బాయి... థియేటర్ లో పని చేసే కుర్రాడి కథ.. సింగిల్ స్క్రీన్ థియేటర్ క్లీనింగ్ నుంచి టిక్కెట్లు అమ్మడం వరకూ అన్నీ నేనే. అమలాపురం పక్కనే మా డాడీ ఊరు. అందుకే పండగలకు వెళ్లేవాడిని. ప్రతి సంక్రాంతికి పదిరోజులు అక్కడే. అమ్మ ఊరు పశ్చిమ బెంగాళ్ లో ఉంది. అక్కడికి కూడా వెళ్లాను. మూవీలో రోల్ కోసం హోంవర్క్ చేశాను... అని తెలిపారు. క్యారెక్టర్ ప్రిపరేషన్ గురించి మాట్లాడుతూ.. పాత్ర కోసం సిటీలో సింగిల్ స్క్రీన్స్ కి వెళ్లి అక్కడి పనివారిని చూశాను. పదిమందినీ పరిశీలించి నేర్చుకో.. ఏది నచ్చితే అదే క్యారెక్టర్ కి ఆపాదించుకో అదే ఫాలో అవ్వు అని చందు తెలిపారు. అదే చేశానని వెల్లడించారు. ఇంట్లో మిమ్మల్ని ఏదైనా అంటే? ఓసారి చిన్నప్పుడు ఇంట్లోంచి పారిపోయానని... పది రోజులు బయటే ఉన్నానని తెలిపాడు. నేను అంత సెన్సిటివ్. అందువల్ల జాగ్రత్తగానే ఉంటారని వెల్లడించాడు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...