యాంకర్ ని హీరోయిన్ ని చేస్తున్న మనోజ్

Anchor-Priya-Bhavani-Shankar-in-Manchu-Manoj-Aham-Brahmasmi-Andhra-Talkies
యాంకర్ ని హీరోయిన్ ని చేస్తున్న మనోజ్

యాంకర్ ని హీరోయిన్ ని చేస్తున్న మనోజ్

మంచు మనోజ్ మూడేళ్ల గ్యాప్ తర్వాత సొంత బ్యానర్ సినిమాతో కంబ్యాక్ అవుతున్నసంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఒక్క హిట్టు కొట్టి దేశం మొత్తం మార్మోగిపోవాలని పక్కా ప్లానింగ్ బరిలోకి దిగుతున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ ను ఎంపిక చేసుకుని గెలుపు రేసులోకి దిగుతున్నాడు. ఈ చిత్రానికి శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త కుర్రాడు దర్శకత్వ వహిస్తున్నాడు. తాజాగా మనోజ్ సరసన హీరోయిన్ కూడా ఫైనల్ అయింది.

స్ర్కిప్ట్ డిమాడ్ మేరకు కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన దర్శక-హీరోలు ఓ టీవీ యాంకర్ ని హీరోయిన్ గా ఎంపిక చేసారు. పలు తమిళ టెలివిజన్ షో వ్యాఖ్యాతగా వ్యవరించిన ప్రియా భవానీ శంకర్ అనే యాంకర్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. కోలీవుడ్ టీవీ షోల్లో అమ్మడు హాటీగా ఓ వెలుగు వెలిగిపోయింది. తమిళ వెర్షన్ సూపర్ సింగర్ ప్రొగ్రామ్ ద్వారా ఈ 30 ఏళ్ల అమ్మడు బాగా పాపులర్ అయింది. ఆ క్రేజ్ తోనే సెకెండ్ ఛాన్స్ పాన్ ఇండియా సినిమాలో వరించింది. ప్రస్తుతం విశ్వనటుడు కమల్ హాస్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఇండియన్-2 లో ఓ చిన్న పోషిస్తుంది. ఇప్పుడా క్రేజ్ నే మనోజ్ ఎన్ క్యాష్ చేసుకుంటున్నాడు. ఇండియన్ -2 పాన్ ఇండియా లో రిలీజ్ అవుతుంది.విదేశాల్లోనూ శంకర్ -కమల్ సినిమాలకున్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అదీ భారతీయుడు సీక్వెల్ గా వస్తున్న సినిమా కాబట్టి ప్రియా భవానీ శంకర్ పేరు దేశ..విదేశాల్లోనూ మార్మోగిపోతుంది. ఆ ప్లానింగ్ తోనే మనోజ్ ఏరికోరి మరీ యాంకర్ హీరోయిన్ గా చేస్తున్నాడు. గతంలో మనోజ్ పలువురి భామల్ని టాలీవుడ్ కి పరిచయం చేసాడు. తమన్నా.. సిమ్రాన్ కౌర్ మండి.. లేఖవాషింగ్ టన్ సహా పలువరు భామల్ని మనోజ్ తెలుగు తెరకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అయితే తమన్నా తప్ప తక్కిన ఎవరూ నటిగా బిజీ కాలేకపోయారు. మరి ఈ తమిళ యాంకర్ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...