ఐపీఎల్ నుండి సూపర్ స్టార్ స్థాయికి..!

Ayushmann-Khurrana-got-money-from-passengers-for-singing-Andhra-Talkies
ఐపీఎల్ నుండి సూపర్ స్టార్ స్థాయికి..!

ఐపీఎల్ నుండి సూపర్ స్టార్ స్థాయికి..!

ట్యాలెంట్ ఉంటే ఇప్పుడు కాకున్నా ఇంకొన్నాళ్లకు అయినా అదృష్టం వరిస్తుందని ఎంతో మంది సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే సినిమాలపైనే పూర్తిగా శ్రద్ద పెట్టకుండా తనకు ఛాన్స్ వచ్చిన.. డబ్బులు వచ్చే రంగంలో ముందుకు వెళ్తూ ఉండాలి. అదే సమయంలో సినిమాల్లో కూడా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. అలా తాను అనుకున్న లక్ష్యంను సాధించడంతో పాటు ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరో స్థాయికి చేరుకున్నాడు యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా.

ఒకప్పుడు ఐపీఎల్ లో వ్యాఖ్యాతగా.. రేడియో జాకీగా కూడా చేసిన ఈయన పలు సింగింగ్ కాంటెస్ట్ లకు హాజరు అయ్యాడు. సింగర్ గా చేసిన ప్రయత్నాలు విఫలం అయినా కూడా నిరుత్సాహ పడలేదు. ఒకానొక సమయంలో రైల్లో పాట పాడగా ఒక వ్యక్తి ఇంప్రెస్ అయ్యి డబ్బులు ఇస్తే తీసుకున్నాడు. ఆ డబ్బులను ఆ నెల ఖర్చులకు వాడుకున్న పరిస్థితి నుండి ఆయుష్మాన్ ఇప్పుడు వందల కోట్ల సినిమాలు చేసే స్థితికి వచ్చాడు.విక్కీడోనర్ కు ముందు ఆయుష్మాన్ పడ్డ కష్టాల గురించి తాజాగా ఒక టాక్ షో లో చెప్పాడు. అందరిని కదిలించిన ఆయుష్మాన్ గతంను తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఆయన స్టార్ డంను చూస్తుంటే ఆయన పడ్డ కష్టంకు ప్రతిఫలం దక్కిందని అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ఎంతో మందికి ఆయుష్మాన్ ఆదర్శం అంటూ నెటిజన్స్ కితాబిస్తున్నారు. ఐపీఎల్ రేడియో జాకీ నుండి ఏకంగా సూపర్ స్టార్ స్థాయికి చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు. అది ఆయుష్మాన్ ఖురానాకే సాధ్యం అయ్యిందని ఆయన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...