పురుషాధిక్యాన్ని గెలవాలని ధీవించు సామీ!

Bollywood-Heroin-Kangana-Ranaut-Turns-as-Devotional-Andhra-Talkies
పురుషాధిక్యాన్ని గెలవాలని ధీవించు సామీ!

పురుషాధిక్యాన్ని గెలవాలని ధీవించు సామీ!

అవును.. ఇది నిజమే.. క్వీన్ కంగనను ఇలా చూస్తే.. తన శత్రువులందరికీ గుర్తుకొచ్చేది ఇదే. పురుషాధిక్య ప్రపంచం అంటే గిట్టని పరమ శివభక్తురాలిగా తనని తలచుకుని వేదనకు గురవ్వడం ఖాయం. ఫిబ్రవరి 21  (శుక్రవారం) మహాశివరాత్రిని పురస్కరించుకుని సెలబ్రిటీలతో పాటు దేశ ప్రజంలంతా పూజలు పునస్కారాల్లో తరించిన సంగతి తెలిసిందే. ప్రజలంతా పరమశివుని సేవలో తరించారు. ఈ శుభ దినోత్సవాన సెలబ్రిటీల భక్తి వ్యహారం తక్కువేమీ కాదు. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి - సురేఖ దంపతులు ఆరోజు ప్రత్యేకించి శివలింగార్చన చేశారు. పలువురు సెలబ్రిటీలు శివభక్తులుగా ఎంతో నిష్ఠతో పూజలాచరించారన్న సమాచారం ఉంది.

అటు బాలీవుడ్ లోనూ టాప్ సెలబ్రిటీలు శివరాత్రి రోజున జాగారం చేశారు. అలాగే ఉత్తరాదిన క్వీన్ కంగనా రనౌత్ భక్తి తత్పరత నిరంతరం చర్చకు వస్తుంటుంది. ఆధ్యాత్మికత.. మతపరమైన భావజాలం ఉన్న నటిగా తను ఆమె బాగా పాపులర్. కంగన తరచుగా పవిత్ర స్థలాలను సందర్శిస్తుంటుంది.  మొన్న శివరాత్రి సందర్భంగా రామేశ్వరం జ్యోతిర్లింగాన్ని సందర్శించింది. శివుని పరమ భక్తుడైన రావణుడిని చంపిన పాపానికి విముక్తి కల్పించడానికి రాముడు స్వయంగా ఈ శివలింగాన్ని స్థాపించారన్న ప్రాచుర్యం ఉంది.మహా పవిత్ర స్థలంలో క్వీన్ ప్రార్థనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో కంగన ఎంతో ప్రశాంత చిత్తంతో కనిపిస్తోంది. పింక్ చీరను ధరించిన కంగన తెల్లవారుఝామున సూర్యకిరణాల కాంతిలో శివుని ప్రార్థించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక కంగన సోదరి రంగోలి చందేల్ ఓ కుమార్తెను దత్తత తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ``ఇతరుల్లా సర్రోగసీకి బదులుగా దత్తత తీసుకోవడానికి తనకు స్ఫూర్తినిచ్చింది తన సోదరి కంగన`` అని వెల్లడించిన సంగతి తెలిసిందే. తమ ఇంట అడుగు పెట్టే ఆడ శిశువుకు `గంగా` అనే పేరును ఎంపిక చేసుకుందట.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...