హన్సిక ఏంటి ఇలా తయారయ్యింది?

Breaking-news-What-Happened-To-Hansika-andhra-talkies

హన్సిక ఏంటి ఇలా అయ్యింది?

హన్సిక మోత్వాని తెలుగు ప్రేక్షకులకు పరిచయం గుర్తింపు ఉన్న భామే. 2007 లో అల్లు అర్జున్ - పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ ఫిలిం 'దేశముదురు' సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సాధించింది. ఆ సినిమా తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో నటించింది. తెలుగులో ఆఫర్లు తగ్గడంతో అప్పట్లో కోలీవుడ్ కు మకాం మార్చింది. ఈమధ్య కొంత గ్యాప్ తర్వాత సందీప్ కిషన్ సినిమా 'తెనాలి రామకృష్ణ BA BL' సినిమా లో నటించింది. కానీ లక్కు మాత్రం వర్క్ అవుట్ కాలేదు.

ఈమధ్య తమిళంలో కూడా ఆఫర్లు తగ్గాయి. ఇదంతా ఒక ఎత్తైతే ఈమధ్య హన్సిక లుక్స్ విషయంలో కూడా కొంత విమర్శలు ఎదుర్కుంటోంది. తెనాలి రామకృష్ణ సినిమాలో హన్సికలో మునుపటి గ్లామర్ లేదని కామెంట్లు వినిపించాయి. రీసెంట్ గా హన్సిక ముంబైలోని బాంద్రా ఏరియాలో ఫోటోగ్రాఫర్ల కంట పడింది. సెలబ్రిటీలు కనిపిస్తే వెంటనే క్లిక్కుమనిపిస్తారు కదా? అలానే హన్సిక ఫోటోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలలో హన్సిక స్లిమ్ గా కనిపిస్తోంది కానీ ఫేస్ లో మాత్రం మునుపటి గ్లో లేదు. స్పష్టంగా వయసు కనిపిస్తోంది.ఇలానే కొనసాగితే హన్సిక కెరీర్ చివరి దశకు చేరుకున్నట్టే. ప్రస్తుతం హన్సిక చేతి లో ఒకే తమిళ సినిమా ఉంది. అదే యూ.ఆర్ జమీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మహా'. ఇది హన్సిక కెరీర్లో 50 వ సినిమా కావడం విశేషం. మరి ఈ సినిమాతో అయినా హన్సిక తన కెరీర్లో బౌన్స్ బ్యాక్ అవుతుందా అనేది వేచి చూడాలి.


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...