రాశి ఖన్నా కెరీర్ ఇక అయిపోయినట్టేనా?

Dilemma-On-Heroin-Raashi-Khanna-Career-Andhra-Talkies
రాశి ఖన్నా కెరీర్ ఇక అయిపోయినట్టేనా?

రాశి ఖన్నా కెరీర్ ఇక అయిపోయినట్టేనా?

టాలీవుడ్లో హీరోయిన్లు చాలామందే ఉన్నారు కానీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉండేవారు మాత్రం తక్కువ. అలాంటి గుర్తింపు తెచ్చుకున్న భామ రాశి ఖన్నా. మొదట్లో గ్లామర్ కు కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న రాశి నటన విషయంలో యావరేజ్ అనిపించుకుంది. అయితే వరుణ్ తేజ్ తో నటించిన 'తొలిప్రేమ' తో మంచి గుర్తింపు సాధించింది. ఇక స్టార్ హీరోయిన్ అయినట్టేనని అందరూ అనుకున్నారు కానీ అప్పటి నుంచి సాలిడ్ బ్లాక్ బస్టర్ ఒక్కటి కూడా దక్కడం లేదు. దీంతో రాశి స్టార్ లీగ్ కు కూడా చేరలేక పోతోంది. కెరీర్ నత్త నడకన సాగుతోంది.మధ్యలో 'వెంకీమామ'.. 'ప్రతిరోజూ పండగే' సినిమాలు హిట్ ఇచ్చాయి కానీ వాటిలో రాశి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇక తాజాగా రిలీజ్ అయిన 'వరల్డ్ ఫేమస్ లవర్' లో రాశి మెయిన్ హీరోయిన్.. నటనకు కూడా స్కోప్ దక్కింది కానీ సినిమా మాత్రం రాశి నటన ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇంకా బెటర్ గా నటించే అవకాశం ఉన్నప్పటికీ వేస్ట్ చేసుకుందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమా కూడా డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. దీంతో స్టార్ హీరోయిన్ అవుదామనుకున్న రాశి ఆశలు కాస్తా ఆవిరయ్యాయి. నిజానికి ఈ సినిమా తో రాశి కెరీర్ కూడా చివరి దశకు వచ్చినట్టేనని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. .

ఇప్పటికే రాశికి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కడం లేదు. మీడియం హీరోలతో నటిస్తోంది కానీ ఇప్పటికే దాదాపు అందరితో జోడీ కట్టడంతో ఆ హీరోలు కొత్త హీరోయిన్ల వైపు మొగ్గు చూపిస్తున్నారు. మరి ఈ దశలో రాశి ఆఫర్లు సాధించి అందరినీ ఆశ్చర్య పరుస్తుందా లేక కోలీవుడ్ కు షిఫ్ట్ అయిపోతుందా అనేది వేచి చూడాలి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...