తేజ స్పీడ్ కు ముక్కున వేలేసుకుంటున్నారు

Director-Teja-on-About-His-Upcoming-Films-Andhra-Talkies

తేజ స్పీడ్ కు ముక్కున వేలేసుకుంటున్నారు

ఒకప్పుడు ప్రేమ కథ చిత్రాలకు పెట్టింది పేరు తేజ. ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలను.. హీరోలను మరియు క్యారెక్టర్ ఆర్టిస్టులను పరిచయం చేసిన స్టార్ ఫిల్మ్ మేకర్ తేజ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాని మద్యలో ఒక పది సంవత్సరాలు తేజకు గ్యాప్ వచ్చింది. ఆ పదేళ్లలో చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో సక్సెస్ ట్రాక్ లో పడ్డాడు.

ఇప్పుడిప్పుడే తేజ మళ్లీ హిట్ లు అందుకుంటున్నాడు. అయినా కూడా ఈయన్ను ఔట్ డేటెడ్ డైరెక్టర్ అంటూ కొందరు విమర్శిస్తూ ఉంటారు. కాని కొందరు హీరోలు మాత్రం ఈయనపై నమ్మకంతో సినిమాలు చేస్తున్నారు. తనకు నేనే రాజు నేనే మంత్రి వంటి సక్సెస్ ను ఇచ్చినందుకు గాను తేజతో మరో సినిమాను చేసేందుకు రానా సిద్దం అయ్యాడు. ఆ సినిమాకు విభిన్నంగా ‘రాక్షస రాజు రావణుడు’ అనే టైటిల్ ను రిజిస్ట్రర్ చేయించాడు. త్వరలోనే ఆ సినిమా ప్రారంభం అవ్వబోతుంది.ఒక వైపు రానాతో సినిమాను చర్చలు జరుపుతూనే మరో వైపు గోపీచంద్ తో కూడా తేజ సినిమాను ప్రకటించాడు. అయితే ఇప్పట్లో తేజ.. గోపీచంద్ ల సినిమా ఉండక పోవచ్చు అనుకున్నారు. కాని అనూహ్యంగా గోపీచంద్ తో తాను తీయబోతున్న సినిమాకు కూడా తేజ టైటిల్ ఖారారు చేశాడు. తన గత చిత్రాల టైటిల్స్ మాదిరిగానే గోపీచంద్ మూవీకి కూడా అలివేలు ` వెంకటరమణ అనే టైటిల్ ను రిజిస్ట్రర్ చేయించాడట.

ఈ రెండు సినిమాలను సమాంతరంగా తీయాలనేది ఆయన అభిప్రాయంగా తెలుస్తుంది. ఒకేసారి రెండు సినిమాలు చేయాలనుకుంటున్న తేజను చూసి ఇండస్ట్రీ వారు మరియు మీడియా వర్గాల వారు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.

director teja, director teja super inspirational speech, teja super inspirational speech to upcoming artists, director teja inspirational speech, director teja about chiranjeevi, director teja speech, teja super inspirational speech to upcoming artist, teja speech @ mayukha talkies press meet, mayukha talkies, director teja super inspirational speech to upcoming artists, ravi teja movies, ravi teja upcoming movies

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...