చిరు ఐటెం క్లారిటీ ఇచ్చారు.. మరి హీరోయిన్?

Faded-out-Heroine-for-Megastar-Chiru-152-Andhra-Talkies
చిరంజీవి గత ఏడాది సైరా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఫలితంపై మిశ్రమ స్పందన వచ్చింది. ఇక ప్రస్తుతం అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ తన 152వ చిత్రాన్ని చేస్తున్నాడు. కేవలం 100 రోజుల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేస్తానంటూ హామీ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివ అందుకోసం చాలా స్పీడ్ గా చిత్రీకరణ చేస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంపై క్లారిటీ ఇంకా రాలేదు.

ఇటీవలే ఈ చిత్రం కోసం చిరంజీవి మరియు రెజీనాలపై ఒక ఐటెం సాంగ్ చేసినట్లుగా యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందింది. ఆ పాటలో చిరంజీవిని బ్యాలన్స్ చేస్తూ ఆయన స్థాయిలో రెజీనా డాన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చింది అంటూ వార్తలు వచ్చాయి. మెగా 152లో ఐటెంగా రెజీనా అంటూ క్లారిటీ వచ్చింది కాని మెయిన్ హీరోయిన్ ఎవరు అనే విషయం పై మాత్రం ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు.పలువురి పేర్లు పరిశీలించారంటూ వార్తలు వచ్చాయి. చివరకు త్రిష పేరు వద్ద వచ్చి ఆ వార్తలు ఆగాయి. చిరంజీవికి జోడీగా త్రిష నటించనున్నట్లుగా ప్రచారం జరిగింది. కాని ఆ విషయమై కూడా ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. మెగా 152 పై ఉన్న అంచనాల నేపథ్యంలో చిరంజీవికి జోడీగా ఎవరు నటిస్తున్నారా అనే ఆసక్తి ప్రేక్షకుల్లోనే కాకుండా సినీ వర్గాల్లో కూడా కనిపిస్తుంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...