మహేష్ నా తమ్ముడు..బన్నీ ఎవరో తెలీదు!

Hero-Allu-Arjun-Fans-Fires-on-Shakeela-Andhra-Talkies
మహేష్ నా తమ్ముడు..బన్నీ ఎవరో తెలీదు!

మహేష్ నా తమ్ముడు..బన్నీ ఎవరో తెలీదు!

ఒకప్పుడు అడల్ట్ చిత్రాలతో అలరించిన షకీలా  అడపాదడపా తెలుగు  సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మార్కెట్లో లోకల్ అడల్ట్ చిత్రాలకు గిట్టుబాటు కాకపోవడంతో పంథా మార్చి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. ఇటీవలే  ఆమె నటించిన `షకీలా రాసిన మొట్ట మొదటి కుటుంబ కథా చిత్రం` టీజర్ లో ఏపీ మూడు రాజధానులపై పంచ్ లేసే ప్రయత్నం చేసింది. తన సినిమా ప్రచారం కోసమే ఇలా దిగజారుడు టీజర్లు వదుల్తోంది! అంటూ నెటి జనులచే అక్షింతలు వేయించుకుంది.

తాజాగా మరోసారి టాలీవుడ్  స్టార్ హీరోలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈసారి ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు....స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లను టార్గెట్ చేసి మాట్లాడింది. ఓ ఇంటర్వూలో ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ లో భాగంగా అడిగిన వాటికి వచ్చిన సమాధానాలు హాట్ టాపిక్ గా మారాయి. టాలీవుడ్ లో మహేష్ బాబు నా తమ్ముడు లాంటోడు....బన్నీ ఎవరో నాకు తెలియదు! అంటూ వ్యాఖ్యానించింది.  దీంతో  సోషల్ మీడియాల్లో బన్ని ఫ్యాన్స్ భగ్గుమన్నారు.తెలుగు సినిమాల్లో నటిస్తున్నావ్.. నీ చిత్రాలు ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి. బన్నీ లాంటి టాప్ స్టార్ ను  తెలియదని అంటావా? అంటూ మండిపడుతున్నారు. అయితే మెగా ఫ్యామిలీపై షకీలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తొలిసారి కాదు. గతంలోనూ ఇదే తరహా వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. తన సినిమాకు థియేటర్లు ఇవ్వడం లేదని ఆరోపణల్లో భాగంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసినట్లు అప్పట్లో కథనాలు వెడెక్కించాయి. ఇక షకీలా వోన్ ఇండస్ట్రీ గాడ్స్ కంట్రీలో మల్లూ అర్జున్ గా పాపులరైన బన్నీ ఎవరో తెలీదని షకీలా అనేస్తే నమ్మేదెవరు?

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...