హీరోయిన్ గురించి సోదరి భజన ఎక్కువైపోతోంది!

Heroin-Kangana-Ranaut-shares-latest-look-on-Jayalalitha-birth-anniversary-Andhra-Talkies
హీరోయిన్ గురించి సోదరి భజన ఎక్కువైపోతోంది!

హీరోయిన్ గురించి సోదరి భజన ఎక్కువైపోతోంది!

బాలీవుడ్ లో తన సోదరి కంగనా రనౌత్ తప్ప.. అంతా వ్యర్థమే! అన్నట్టుగా స్పందిస్తూ ఉంటుంది రంగోలీ చందాల్. ఇప్పటికే ఈమె వివిధ సందర్భాల్లో చేసినా కామెంట్లు వివాదాస్పదం అయ్యాయి. విడ్డూరంగా మారాయి. కేవలం తన సోదరిని పొగడటం ఆమెను కీర్తించడం ఆమె గురించి గొప్పలు చెప్పడమే కాదు ఇతరులను కించపరిచే పోస్టులు కూడా పెడుతూ ఉంటుంది ఈమె.

తన సోదరి గురించి పొగుడుకుంటే ఒక రకం దాని కోసమని ఇతరులను దూషిస్తూ తక్కువ చేస్తూ పోస్టులు పెట్టడం మాత్రం ఈ రంగోలీ అహంకారానికి నిదర్శనంగా మారింది. ఆ మధ్య దర్శకుడు కరణ్ జొహార్ ను కూడా గేలి చేసినట్టుగా మాట్లాడింది. కంగనా తో సినిమా తీయాలనుందని అతడు ప్రకటిస్తే మంచి స్క్రిప్ట్ తో రావాలని లేకపోతే కంగనా అస్సలు పట్టించుకోదు అన్నట్టుగా ఈమె చెప్పుకొచ్చింది. ఐశ్వర్యరాయ్ తో కరణ్ చేసిన ఇటీవలి సినిమా పేరును ప్రస్తావించి అలాంటి సబ్జెక్ట్ తో వస్తే తన చెల్లి చేతిలో దెబ్బలు తినాల్సి ఉంటుందన్నట్టుగా ఈమె చెప్పుకురావడం టూ మచ్ అనిపించుకుంది.ఇక ప్రస్తుతం జయలలిత జీవిత కథ ఆధారంగా కంగనా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో విమర్శలు వచ్చాయి. జయ లుక్ కు ఏ మాత్రం సంబంధం లేకుండా కంగనా కనిపించిన స్టిల్స్ పై నెటిజన్లు విరుచుకుపడ్డారు. అయితే రంగోలీ మాత్రం తన సోదరిని పొగడటమే పనిగా పెట్టుకుంది. జయలలిత లుక్ లో తన సోదరి అదిరి పోతోందని చెప్పుకుంటూ ఉంది రంగోలీ. చిన్నపాటి మేకప్ తోనే జయలలితలా కంగనా కనిపించేస్తూ ఉందని ఈమె చెప్పుకొచ్చింది. అయితే ఇవన్నీ నకిలీ మాటలే!

ఆ విషయాన్ని ఇది వరకే కంగనా ఒప్పుకుంది. జయలలితలా కనిపించడానికి కొన్ని తను హార్మోనల్ ట్యాబ్లెట్స్ తీసుకున్నట్టుగా కూడా ఆమె చెప్పింది. అయితే రంగోలీ మాత్రం తనదైన శైలిలో టూమచ్ చేస్తూ ఉందని పరిశీలకులు అంటున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...