పాపం రాశిఖన్నా గుడ్డి దీపం కూడా ఆరిపోయింది

Heroin-Raashi-Khanna-Career-In-Dilemma-Andhra-Talkies
పాపం రాశిఖన్నా గుడ్డి దీపం కూడా ఆరిపోయింది

పాపం రాశిఖన్నా గుడ్డి దీపం కూడా ఆరిపోయింది

ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశిఖన్నా మొదటి సినిమాతో బాగానే నటిస్తుంది కాని బాగా లావుగా ఉందని విమర్శలు ఎదుర్కొంది. దాంతో కష్టపడి బరువు తగ్గి నాజూకుగా తయారు అయ్యింది. నాజూకుగా అయిన తర్వాత ఈమెకు మంచి ఆఫర్లే వచ్చాయి. కాని దురదృష్టమో ఏమో కాని ఈమె చేసిన సినిమాలు సక్సెస్ అయినా ఫ్లాప్ అయినా కూడా ఈమె కెరీర్ మాత్రం అలాగే ఉండి పోయింది.

రాశిఖన్నా కెరీర్ లో ఒక ఎదుగు లేదు బొదుగు లేకుండా తయారు అయ్యింది. దాంతో తెలుగులో ఆమెకు అవకాశాలు రావడమే గగనం అయ్యింది. ప్రతి రోజు పండుగతో గత ఏడాది చివర్లో కాస్త పర్వాలేదు అన్నట్లుగా సక్సెస్ దక్కించుకున్నా కూడా రాశిఖన్నాకు ఛాన్స్ లు రాలేదు. ఇక విజయ్ దేవరకొండతో చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతో ఖచ్చితంగా సక్సెస్ దక్కుతుందని ఆశ పెట్టుకుంది. ఈ చిత్రంతో మళ్లీ బిజీ అవ్వొచ్చు అని ఆశించింది. కాని ఆమె ఆశ నిరాశ అయ్యింది.


రాశి ఖన్నా ప్రస్తుతం తెలుగులో సినిమాలు ఏమీ చేయడం లేదు. ఒకటి రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నా కూడా అవి ఫైనల్ అవుతాయో లేదో చెప్పలేని పరిస్థితి. దాంతో తెలుగు ఇండస్ట్రీలో రాశిఖన్నా వెలుగు కనిపించక పోవచ్చు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ తన దీపం వెలిగిస్తాడనుకుంటే ఉన్న గుడ్డి దీపాన్ని కూడా ఆర్పేశాడు అంటూ రాశిఖన్నా బాధపడుతుందని సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి. తమిళంలో ఒకటి రెండు సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు ఏ మేరకు చేస్తుందో చూడాలి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...