పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - దర్శకుడు క్రిష్ సినిమాకు ఆ హీరోయిన్ ఫిక్స్

Savithri-fame-Heroin-Keerthy-Suresh-Is-Heroine-For-Pawan-Kalyan-Andhra-Talkies
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - దర్శకుడు క్రిష్ సినిమాకు ఆ హీరోయిన్ ఫిక్స్

పవన్ - క్రిష్ సినిమాకు ఆ హీరోయిన్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన రీఎంట్రీ చిత్రం 'పింక్' రీమేక్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.  ఈ సినిమాకు 'వకీల్ సాబ్' అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం.  ఇదిలా ఉంటే పవన్ ఈ సినిమాతో పాటు మరో సినిమాకు తన పచ్చజెండా ఊపారు. అభిరుచి కల చిత్రాలను రూపొందించే క్రిష్ ఈ సినిమాకు దర్శకుడు. 'వకీల్ సాబ్' పూర్తి కాగానే ఈ భారీ బడ్జెట్ చిత్రం సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు.

ఈ సినిమా పీరియడ్ కథాంశంతో తెరకెక్కనుందని.. పవన్ ఒక బందిపోటుగా కనిపిస్తాడని ఇప్పటికే ఈ సినిమా గురించి ఆసక్తికరమైన సంగతులు బయటకు వచ్చాయి.  ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే విషయంపై పలు రకాల వార్తలు వినిపిసించాయి.  మొదట 'కంచె' ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ ను ఎంపిక చేసినట్టు టాక్ వినిపించింది.  తర్వాత ఒక బాలీవుడ్ హీరోయిన్ ను ఫైనలైజ్ చేశారని కూడా అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం అవేవీ నిజం కాదని ఈ సినిమాకు కీర్తి సురేష్ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం.


కీర్తి గతంలో పవన్ సినిమా 'అజ్ఞాతవాసి' లో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.  సినిమా ఫ్లాప్ అయింది కానీ పవన్ - కీర్తి జోడీకి మంచి మార్కులే పడ్డాయి.  'మహానటి' సినిమాలో భారీ గుర్తింపు సాధించిన కీర్తి అయితే ఈ ప్యాన్ ఇండియా సినిమాకు సూట్ అవుతుందని దర్శకుడు క్రిష్ భావిస్తున్నారట.  త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...