హీరో హీరోయిన్లను కలిపిన తెలివైన నిర్మాత!

Star-Producer-Behind-Hero-Heroine-Patchup-Andhra-Talkies

హీరో హీరోయిన్లను కలిపిన తెలివైన నిర్మాత!

ఆయన మీడియం రేంజ్ హీరోలలో టాప్. ఆయనతో కలిసి ఓ సూపర్ టాలెంటెడ్ హీరోయిన్ ఒక సినిమాలో నటించింది. ఆ సూపర్ టాలెంటెడ్ హీరోయిన్ చేసేవే తక్కువ సినిమాలు. తూతూమంత్రం పాత్రలను అసలు ఒప్పుకోదు. పైగా స్ట్రాంగ్ లేడీ అని కూడా టాక్ ఉంది. ఈ హీరోయిన్ కు.. అ హీరోకు షూటింగ్ సమయం లో ఈగో క్లాషెస్ వచ్చాయిని ఎడమొహం పెడమొహంగా ఉంటూ ఫిలిం యూనిట్ ను ఏడిపించారని టాక్ ఉంది. అయితే ఆ సినిమాను నిర్మించిన వ్యక్తి ఓక స్టార్ ప్రొడ్యూసర్.. ఆయన ముదుర్లకే ముదురు మహాముదురు కావడంతో ఇద్దరికి అయన శైలిలో నచ్చజెప్పి రాజీ కుదిర్చి సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమా మూడేళ్ళ క్రితం రిలీజ్ అయింది. సూపర్ హిట్ గా నిలిచింది.

ఇదిలా ఉంటే ఆ హీరోయిన్ ఇకపై ఆ హీరోతో నటించదని అందరూ అనుకున్నారు. కానీ మనం అనుకున్నవి జరగకపోవడం.. అనుకోనివి జరగడమే జీవితం. ఇప్పుడు అలానే జరిగిందట. ఆ సినిమా తర్వాత ఆ హీరోయిన్ కు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు. కెరీర్ చాలా డల్లుగా సాగుతోంది. ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్ కాలేక పోయింది. చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. ఈ సమయంలో ఆ ముదురు ప్రొడ్యూసర్ ఒక ప్రాజెక్ట్ సెట్ చేశాడట. ఆ హీరో ఈ హీరోయిన్ ను జోడీగా ఒప్పించాడట. అసలు ఆ హీరో హీరోయిన్ కలిసి నటించడం అనేది అసాధ్యం అని వాదించిన వ్యక్తులు ఇప్పుడు ఈ ప్రాజెక్టు గురించి తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారు.నిర్మాత ఆలోచన ఏంటంటే హీరో హీరోయిన్లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదని టాక్ ఎలాగూ ఉంది కాబట్టి బోల్డంత పబ్లిసిటీ. పైసా ఖర్చు లేకుండా మీడియానే ఉత్సాహంగా వార్తలు రాసి మరీ ఆ సినిమాకు ప్రచారం కల్పిస్తుందని స్కెచ్ వేశారట. సూపర్ ఐడియా కదా?

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...