బన్నీ పార్టీకి వెళ్ళాలంటే భయపడుతున్నారే!

బన్నీ పార్టీకి వెళ్ళాలంటే భయపడుతున్నారే!

నాన్ బాహుబలి రికార్డు కొట్టేసాం అంటూ గ్రాండ్ గా సెలెబ్రేషన్స్ మొదలెట్టేసారు 'అల వైకుంఠ పురములో' టీం. ఇప్పటికే రెండు ఈవెంట్ లు చేసారు. తాజాగా డిస్ట్రిబ్యూటర్స్ - ఎగ్జిబ్యూటర్స్ ను పిలిచి వారికి గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. అయితే ఇదే విధంగా తమ శ్రేయస్సు కోరిన ఇండస్ట్రీ జనానికి కూడా రేపు ఓ పార్టీ ఏర్పాటు చేయబోతుంది అల్లు ఫ్యామిలీ. ఈ పార్టీకి ఇండస్ట్రీ నుండి అందరినీ ఆహ్వానించబోతున్నారు.

ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న హీరోలు  - హీరోయిన్స్  - డైరెక్టర్స్ - నిర్మాతలకు అల టీం నుండి ఇన్విటేషన్ కూడా వెళ్ళింది. అయితే బన్నీ అండ్ ప్రొడ్యూసర్స్ ఇచ్చే  ఈ పార్టీ కి వెళ్ళాలంటే ఇండస్ట్రీలో కొందరు భయపడుతున్నారు. దీనికి కారణం మహేష్ బాబు. అవును అల - సరిలేరు నీకెవ్వరు' రెండు సినిమాలు సంక్రాంతి పోటీ గా వచ్చాయి. ఆ సినిమా కూడా భారీగానే కలెక్షన్స్ రాబట్టింది. అయితే బన్నీ అండ్ టీం మాత్రం ఇండస్ట్రీ హిట్ గా తమ సినిమాను ప్రొజెక్ట్ చేసుకొని 'సరిలేరు' టీం మీద కొన్ని ఇన్ డైరెక్ట్  గా సెటైర్స్ వేస్తున్నారు. అందుకే 'అల' సినిమాకు సంబందించిన సెలెబ్రేషన్స్ కి  నైజాం ఏరియా చేసిన దిల్ రాజు కూడా దూరంగా ఉంటున్నారు.ఈ పరిస్థితుల్లో బన్నీ పార్టీ కి వెళ్ళడం ఆ సినిమా గురించి మాట్లాడటం మహేష్ కి చేరితే సూపర్ స్టార్ ఫీలయ్యే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో మనకెందుకొచ్చింది అంటూ చాలా మంది సైడ్ అవుతున్నారట. ముఖ్యంగా డైరెక్టర్స్  - నిర్మాతలు ఈ పార్టీ కి దూరంగా ఉండే అవకాశం ఉందనే టాక్ గట్టిగా వినబడుతుంది. మరి ఫైనల్ గా ఈ పార్టీలో ఎవరెవరు సందడి చేస్తారో చూడాలి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...